-
బోల్ట్ తినేది బీఫ్ కాదట!!
ఉసేన్ బోల్ట్ బీఫ్ తింటాడని, అందుకే అతడు రియో ఒలింపిక్స్‌లో పతకాలు మూటగట్టుకుని మరీ వెళ్లాడని బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. అసలు నిజంగా బోల్ట్ ఏం తింటాడని ఒక్కసారిగా అందరూ వెతకడం మొదలుపెట్టారు. దాంతో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. జమైకా లాంటి చిన్న దేశంలో, ఓ పేద కుటుంబంలో పుట్టిన బోల్ట్ చిన్నతనం నుంచి సన్నగానే ఉండేవాడు. 15 ఏళ్లకే ఆరు అడుగులకు పైగా పొడవు పెరిగిన బోల్ట్.. తొలుత ఆడింది క్రికెట్ అట!! ఆ తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్ వైపు మారాడు. జమైకా నుంచి వచ్చిన అసఫా పావెల్, షెల్ ఆన్ ఫ్రేజర్, బోల్ట్.. ఈ ముగ్గురూ సాధారణ నేపథ్యం ఉన్నవాళ్లే తప్ప డబ్బున్న ఆసాములు కారు. దాంతో సర్వసాధారణంగా జమైకాలో దొరికే బియ్యం, చేపలు.. ఇవే వీరికి కూడా ఆహారం అయ్యాయి. బోల్ట్ కోచ్ కూడా ఎప్పుడూ అతడిని బీఫ్ తినమని చెప్పలేదు. ఇప్పుడంటే తాను ఎక్కడకు వెళ్లినా తనతో పాటు పర్సనల్ చెఫ్ ఉంటాడని బోల్ట్ చెప్పాడు. ఇప్పటికీ తన భోజనంలో మాత్రం చికెన్, కూరగాయలే ఎక్కువగా ఉంటాయన్నాడు. జమైకన్ ఆహారంలో ప్రధానంగా ఉండే బియ్యం, చికెన్, కూరగాయలే తనకు ఇప్పటికీ ఇష్టమని.. విదేశాలకు వెళ్లినప్పుడు సరైన ఆహారం దొరక్కపోతే ఏ బర్గర్ కింగ్కో, మెక్ డోనాల్డ్స్కో వెళ్లాల్సి ఉంటుందని అన్నాడు. తన ఆహారంలో ప్రధానంగా చికెన్, పోర్క్, చేపలు, దుంపకూరలు ఉంటాయని తెలిపాడు. వీటివల్ల శరీరానికి కావల్సిన కార్బోహైడ్రేట్లు బాగా అందుతాయి. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మాత్రం ఫాస్ట్ ఫుడ్ తింటుంటానని, కానీ తన ఆహారంలో 90 శాతం మంచిదే ఉంటుందని వివరించాడు. ఇక ఇప్పటికి ఒలింపిక్స్‌లో 23 స్వర్ణపతకాలతో కలిపి మొత్తం 28 పతకాలు సాధించిన మైఖేల్ ఫెల్ప్ప్ కూడా బాగా ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకుంటాడు తప్ప బీఫ్ కాదు. అతడు తీసుకునే 12వేల కేలరీల ఆహారంలో చికెన్, పాస్తా, పిజ్జా, చేపలు ఉంటాయి. పీవీ సింధు లాంటి వాళ్లను ఒలింపిక్ విజేతలుగా తీర్చిదిద్దే కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా తన శిష్యులను తగినంత సామర్థ్యం కోసం చికెన్ తినమని చెబుతారట. -
జమైకా చిరుత.. పరుగు ఆపేస్తోంది!
అతడు పరుగెడుతుంటే చిరుత కూడా ఒక్క నిమిషం అలా ఆగి చూస్తుంది. నాకన్నా ఇంతటి వేగం ఇతడికి ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపోతుంది. అలాంటి నల్లచిరుత ఉసేన్ బోల్ట్.. ఇక పరుగులు ఆపేస్తున్నాడు. ఈ ఏడాది రియో డి జెనిరోలో జరగనున్న ఒలింపిక్స్ తర్వాత రిటైరవుతానని నిర్ధారించాడు. ఆరుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు సాధించిన బోల్ట్ 2020 వరకు కూడా ఆడే అవకాశం ఉందని జనవరిలో చెప్పినా.. ఇప్పుడు మాత్రం ఇవే తన చిట్టచివరి ఒలింపిక్స్ అని స్పష్టం చేశాడు. మరో నాలుగేళ్లు ఇదే స్థాయిలో పరుగులు తీయడం చాలా కష్టమని, అందువల్ల రియోలో తాను అనుకున్నది సాధించి, ఆ తర్వాత ఇక రిటైర్ అవుతానని చెప్పాడు. లండన్‌లో 2012లో జరిగిన ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు, 4x100 మీటర్ల రిలే రేసుల్లో బోల్ట్ స్వర్ణపతకాలు సాధించాడు. అంతకుముందు నాలుగేళ్ల క్రితం బీజింగ్‌లో జరిగిన క్రీడల్లోనూ ఈ విభాగాలన్నింటిలో అతడే విజేత. తుపాకి నుంచి బుల్లెట్ బయటకు రావడం అయినా ఆలస్యం అవుతుందేమో గానీ, ఉసేన్ బోల్ట్ ఇలా పరుగు ప్రారంభించడం, అలా గమ్యాన్ని చేరుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం కావని క్రీడా పండితులు చెబుతుంటారు. మరోసారి ఒలింపిక్స్‌లో మూడు బంగారు పతకాలు గెలవాలన్నది తన కల అని, దానిపైనే దృష్టిపెడుతున్నానని బోల్ట్ చెప్పాడు. 200 మీటర్ల పరుగులో 19.19 సెకన్లతో ప్రపంచ రికార్డు ఉసేన్ బోల్ట్ పేరుమీదే ఉన్నా.. అతడికి మాత్రం సంతృప్తి లేదు. కనీసం 19 సెకన్ల లోపు ఆ రేసు పూర్తి చేయాలని తాను కలగంటున్నట్లు తెలిపాడు. ఇలాంటి పరుగుల చిరుతను ఇక ట్రాక్ మీద చూడకపోవడం అంటే క్రీడాభిమానులకు నిరాశే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
కూటముల కురుక్షేత్రం
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్‌గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement