breaking news
Urban Company
-
ఐటీ జీతాల కంటే అర్బన్ కంపెనీలో అధిక సంపాదన!
ఐటీ రంగంలో ఆరంభ స్థాయి ఉద్యోగుల వేతనాలకు సమానమైన, కొన్ని సందర్భాల్లో అంతకంటే అధిక ఆదాయాన్ని తమ ప్లాట్‌ఫామ్‌పై గిగ్‌వర్కర్లు (తాత్కాలిక కార్మికులు, నిపుణులు) పొందుతున్నారని అర్బన్ కంపెనీ తెలిపింది. అర్బన్ కంపెనీతో భాగస్వాములైన నిపుణులు సగటున ప్రతినెలా రూ.28,322 చొప్పున ఆర్జిస్తున్నారని పేర్కొంది.బహిరంగంగా అందుబాటులో ఉన్న పరిశ్రమ డేటా, గ్లాస్‌డోర్ అంచనాల ఆధారంగా ఈ విషయాలు వెల్లడిస్తున్నట్టు పేర్కొంది. ఈ డేటా ఆధారంగా ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఆరంభ స్థాయి వార్షిక వేతనం రూ.4లక్షలుగా ఉన్నట్టు తెలిపింది. ఈ పోలికలు సూచనాత్మకమేనని, సందర్భానుసారం పేర్కొంటున్నట్టు స్పష్టం చేసింది.తమ ప్లాట్‌ఫామ్‌లపై కొందరు అత్యధికంగా రూ.51,673 వరకు నెలవారీ ఆర్జిస్తున్నట్టు, ఐటీ రంగం ఆరంభ స్థాయి వేతనం కంటే 60 శాతం అధికమని అర్బన్ కంపెనీ తెలిపింది. తన ప్లాట్‌ఫామ్‌పై టాప్–20 సేవల నిపుణులు నెలవారీ సగటున రూ.42,418 చొప్పున.. టాప్–10 శాతం మంది రూ.47,471 చొప్పున, టాప్–5 శాతం మంది రూ.51,673 చొప్పున ఆదాయం పొందుతున్నట్టు వెల్లడించింది.ఒక్కో భాగస్వామి ప్రతి నెలా 91 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నట్టు పేర్కొంది. ఈ ప్రకారం ప్రతి గంటకు రూ.313 వరకు ఆదాయం లభిస్తోందంటూ.. చట్టపరంగా కనీస వేతనం కంటే ఎక్కువని పేర్కొంది. -
15 నిమిషాల్లో పని మనిషి..
ఆన్లైన్ డెలివరీ అన్నది ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. మనిషి దైనందిన జీవితంలో భాగంగా మారిపోయింది. ఫుడ్ డెలివరీతో మొదలైన ఆన్లైన్ డెలివరీ సేవలు క్రమంగా కిరాణాతో పాటు అనేక రకాల వస్తువులు, సర్వీసులు నిమిషాల వ్యవధిలో ఇంటి ముంగిటకు చేర్చే వరకూ వచ్చేశాయి. ఈ సేవలు ఇక్కడితో ఆగేలా లేవు.తాజాగా ప్రముఖ హోమ్ సర్వీసెస్ సంస్థ అయిన అర్బన్ కంపెనీ ‘ఇన్‌స్టా మెయిడ్స్ / ఇన్‌స్టా హెల్ప్’ అనే సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ద్వరా 15 నిమిషాల పనిమనిషి మీ ఇంటి ముంగిటకు వస్తారు. ఈ సర్వీస్ ప్రారంభంతో అర్బన్ కంపెనీ ఆన్లైన్ సేవలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.ప్రస్తుతానికి ముంబైలో ఈ సేవను ప్రవేశపెట్టామని, ఇది 'పైలట్ దశలో' ఉందని అర్బన్ కంపెనీ పేర్కొంది. త్వరలోనే ఇతర నగరాలకు విస్తరిస్తామని తెలిపింది. ఈ సేవలో భాగస్వాములకు అంటే పని మనుషులకు 'గంటకు రూ .150 నుండి 180' లభిస్తుందని, అయితే ప్రస్తుతానికి ఈ సేవను గంటకు రూ .49 లకే అందిస్తున్నట్లు వివరించింది."అర్బన్ కంపెనీలో, మా సేవా భాగస్వాముల శ్రేయస్సుకు మేము కట్టుబడి ఉన్నాము. ఈ కొత్త సర్వీస్ ఆఫర్ లో, భాగస్వాములు ఉచిత ఆరోగ్య బీమా, ఆన్-ది-జాబ్ లైఫ్ & యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తో పాటు గంటకు రూ. 150-180 సంపాదిస్తారు. నెలకు 132 గంటలు (22 రోజులు × రోజుకు 6 గంటలు) పనిచేసే భాగస్వాములకు నెలకు కనీసం రూ.20,000 ఆదాయం లభిస్తుంది" అని రాసుకొచ్చింది. అర్బన్ కంపెనీ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్లు వచ్చాయి. ఆన్లైన్ సర్వీస్‌కి ఇది పరాకాష్ట అని పలువురు కామెంట్లు చేశారు.


