breaking news
UPA-2
-
అంగ వికలుర బిల్లుకూ వైకల్యమే!
ఐక్యరాజ్యసమితి సదస్సు తీర్మానం ప్రకారం వికలాంగులకు మిగిలిన వారితో సమాన హక్కులు కల్పించాలి. కొత్త బిల్లు ఇప్పటి వరకు ఉన్న మూడు శాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి పెంచినప్పటికీ, అవకాశాల పరిధిని బాగా కుదించడం వివాదాస్పదమైంది. పార్లమెంటులో ప్రవేశపెట్టే ఏ కొత్త బిల్లు అయినా ప్రజాప్రయోజనాలను ఆశించి ఉం డాలి. కానీ యూపీఏ-2 ప్రవేశపెట్టిన ఎక్కువ బిల్లుల ఉద్దేశం వెనుక ప్రజాప్రయోజనం కాకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనమే ప్రధానంగా కనిపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ అంగవికలుర హక్కుల బిల్లు-2012. ఈ బిల్లును కూడా ఈ సమావేశాలలోనే ఆమోదిం చాలని కేంద్రం హడావుడి పడుతోంది. ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశపెట్టింది కూడా. అంగ వైకల్యం కలిగిన వ్యక్తుల హక్కుల రక్షణ కోసం ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఒక సదస్సులో తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించడానికి భారత ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తున్నది. ఇది ఆహ్వానించదగినదే. ఆ ఉద్దేశంతోనే 2009లో సాధికారత, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కొత్త బిల్లును రూపొందించడానికి ఒక సంఘాన్ని నియమించింది. కోల్‌కతా కేంద్రంగా పని చేస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెరి బ్రెల్ పాల్సీ వైస్ చైర్పర్సన్ డాక్టర్ సుధా కౌల్ కు ఈ సంఘం నాయకత్వం అప్పగించారు. సంఘం తన ముసాయిదాను 2011లోనే వెలువరించి, 2012లో మంత్రిమండలి ఆమోదానికి పంపింది. ఇంత కీలకమైన బిల్లుకు ఆమో దం తెలపడానికి కూడా ఏడాది కాలం పట్టింది. ఏ బిల్లుకైనా కొన్ని సవరణలు తప్పకపోవచ్చు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో, సమన్యాయం, హక్కులు వంటి అంశాలతో ముడిపడి ఉన్న బిల్లుకు సవరణలు అనివార్యమే. వీటన్నిటినీ పక్కకు పెట్టి బిల్లును ఈ సమావేశాలలోనే ఆమోదించాలని యూపీఏ తొందరపడడమే విడ్డూరం. ఐక్యరాజ్యసమితి సదస్సు తీర్మానం ప్రకారం వికలాంగులకు మిగిలిన వారితో సమాన హక్కులు కల్పించాలి. కొత్త బిల్లు ఇప్పటి వరకు ఉన్న మూడు శాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి పెంచినప్పటికీ, అవకాశాల పరిధిని బాగా కుదించడం వివాదాస్పదమైంది. రిజర్వేషన్ శాతం పెరిగినా అది మేలు కంటె కీడే ఎక్కువ చేసే విధంగా తయారయిం ది. అందుకే పదహారు సవరణలతో ఈ బిల్లు ను ప్రవేశపెట్టారు. వైకల్యాన్ని నిర్వచించడం లో కూడా ప్రభుత్వం విశాల దృష్టిని చూపలేకపోయింది. ప్రస్తుతం 1995 నాటి చట్టాన్ని వికలాంగులకు వర్తింప చేస్తున్నారు. దాని ప్రకా రం ఏడురకాల వైకల్యా లు, నలభై శాతానికి మించి ఉంటే వారిని ఈ చట్టం పరిధిలోకి తెస్తున్నారు. అంధత్వం, కంటిచూపులో లోపం, బధిరత్వం, లోకోమోటర్ వైకల్యం, మానసిక రుగ్మత, మానసిక వైకల్యం, కుష్టు-ఈ ఏడిం టిని అంగ వికలుర కోటాలో హక్కులు పొందడానికి అవకాశం ఇచ్చేవిగా నిర్వచించారు. కానీ వైకల్యంలో ఇంత శాతమని నిర్ణయిం చడం సాధ్యం కాదు. ఈ పరిధులు అంగవైకల్యం సమస్యను ఎదుర్కొనడానికి అడ్డంకిగానే ఉంటాయి. అస లు ఈ నిర్వచనం కూడా ఐక్యరాజ్యసమితి సదస్సు తీర్మానం పరిధిలో లేదన్నది మరో విమర్శ. చట్టం ముందు అంతా సమానమే అన్న హక్కు వీరికీ లభించాలని ఆ సదస్సు స్పష్టం చేసింది. నిజానికి అంగ వికలురకు రక్షణ కల్పించడంలో భౌతికమైన అంశం కంటె, సమాజం అలాంటి వారి పట్ల ఏర్పరుచుకున్న దృక్పథం గురించి ఎక్కువ ఆలోచన ఉండాలి. ఈ ఆశయానికే 1995 నాటి చట్టం దూరంగా ఉంది. కొత్త బిల్లులో లోపం కూడా సరిగ్గా ఇదే. కొన్ని ఇతర భౌతిక లోపాలను కూడా ప్రపంచ వ్యాప్తంగా అంగ వైకల్యంగా పరిగణిస్తున్నారు. బిల్లు వీటినీ పట్టించుకోలేదు. బుద్ధిమాంద్యం (ఆటిజం వంటివి), మరుగుజ్జుతనం, హెచ్ఐవీ- ఎయిడ్స్‌లను వైకల్యంగా భారత న్యాయస్థానాలు కూడా గుర్తించాయి. అలాగే ప్రైవేటు సంస్థలలో రిజర్వేషన్‌కు కొత్త బిల్లు కూడా వీరికి అవకాశం కల్పించడం లేదు. బిల్లును యథాతథంగా ప్రవేశపెడితే వికలాంగులకు సమన్యాయం జరగడం కల్ల అన్న విమర్శ వెల్లువెత్తుతోంది. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థకే రిజర్వేషన్ పరిమితం చేస్తే అందరికీ, ముఖ్యంగా నేటి చదువులకు తగ్గట్టు అవకాశాలు ఎలా వస్తాయన్నదే ప్రశ్న. కీలకమైన ఈ బిల్లును ఆదరాబాదరాగానైనా ఆమోదింప చేసి ఆ కీర్తిని కూడా జమ చేసుకోవాలని కాం గ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. అంతేతప్ప బిల్లు మౌ లిక లక్షణాలు, ఉద్దేశాల మీదే విమర్శలు వెల్లువెత్తిన సంగతిని పట్టించుకోవడం లేదు. - కల్హణ -
రాగద్వేషాలకు అతీతంగా పనిచేశా: మన్మోహన్
-
రాగద్వేషాలకు అతీతంగా పనిచేశా: మన్మోహన్
న్యూఢిల్లీ: సరైన సమయంలో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. సాధారణ ఎన్నికల అనంతరం యూపీఏ కొత్త ప్రధానిని ఎన్నుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల అనంతరం కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడించారు. ఢిల్లీ రైసినా రోడ్డులోని నేషనల్ మీడియా సెంటర్లో మన్మోహన్ పూర్తిస్థాయి విలేకరుల సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. తమ ప్రభుత్వం అనేక చారిత్రక చట్టాలను అమల్లోకి తెచ్చిందని తెలిపారు. రాజీనామా చేయాలని ఎప్పుడు అనిపించలేదని, రాగద్వేషాలకు అతీతంగా పనిచేశానన్నారు. తనను దిగిపోమ్మని ఎవరూ అడగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ నుంచి తనకు అనూహ్య మద్దతు లభించిందన్నారు. ఈ పదేళ్లలో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు రాలేదన్నారు. రాహుల్ గాంధీ సమర్థుడైన నాయకుడు, ఆయన విషయంలో పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. యూపీఏ- 3 ప్రభుత్వం గురించి ఇప్పుడే మాట్లాడడం అసంగతమన్నారు. గ్రామీణ ప్రాంతాలు, నగరాల మధ్య అంతరం తగ్గుతోంది. ధరల పెరుగుదల ప్రజలను కాంగ్రెస్‌కు దూరం చేసిందన్నారు. ధరాభారం నుంచి పేదలను కాపాడేందుకు కృషి చేశామన్నారు. గతంలో ఎన్నడూలేనంతగా వ్యవసాయ వృద్ధిరేటు పెరిగిందన్నారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రాధాన్యంగా దృష్టి సారించామని చెప్పారు. తాము సాధించిన అభివృద్ధిని విపులంగా చెప్పేందుకు ఇప్పుడు సమయం తక్కువగా ఉందన్నారు. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మందగమనం నుంచి బయటపడుతున్నాయని తెలిపారు. నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ప్రధాని కావడం వినాశకరపరిణామంగా భావిస్తానని మన్మోహన్ అన్నారు. గుజరాత్లో జరిగిన మారణకాండ మళ్లీ దేశంలో జరగాలని కోరుకోవడం లేదన్నారు. ఇప్పుడున్న మీడియాతో పోలిస్తే చరిత్రకారులు తన పట్ల సున్నితంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. -
యూపీఏకు కష్టకాలమే
సాక్షి, హైదరాబాద్: వివిధ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్రంలోని యూపీఏ-2 ప్రభుత్వ మనుగడే తల్లకిందులయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. డిసెంబర్ 8న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించిన ముఖచిత్రం కూడా మారిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆదివారం ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో లగడపాటి మాట్లాడారు. ‘సీమాంధ్రలో 13 మంది కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులంతా రాష్ట్ర విభజన అంశంపై అధిష్టానం తీరును ధిక్కరిస్తారు. హర్యానాలో ఒకరు, మధ్యప్రదేశ్‌లో మరొకరు వేర్వేరు కారణాలతో పార్టీతో విభేదిస్తున్నారు. ఈ 15 మంది పోను లోక్‌సభలో యూపీఏకు మిగిలే సంఖ్యా బలం కేవలం 213 మాత్రమే’నని లగడపాటి చెప్పారు. యూపీఏకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న డీఎంకే, బీఎస్పీ, ఎస్పీలకు 58 మంది ఎంపీలున్నారు. డిసెంబర్ 8 ఫలితాల తర్వాత ఈ పార్టీలు యూపీఏ-2 ప్రభుత్వానికి దూరమయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణపై సోమవారం కేంద్ర మంత్రి పల్లంరాజు ఇంట్లో జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు. జగన్, చంద్రబాబు జెండాలు పక్కన పెట్టి వస్తే వారితో కలిసి సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఉద్యమించడానికి తాము సిద్ధమని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.