ప్రేమించలేదని కడతేర్చాడు
ముజఫర్ నగర్(యూపీ): వన్ సైడ్‌గానే నిండాప్రేమించి, తీరా ఆ యువతి మరో వ్యక్తితో ప్రేమలో ఉందని తెలిసి తట్టుకోలేక కడతేర్చాడో ప్రబుద్ధుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జావున్ పుర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో మేనెజర్‌గా పనిచేస్తున్న సర్దార్ అజిత్ సింగ్ టీచర్‌గా పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఈ విషయం అమెతో చెప్పడానికి ముందే మరొకరితో ప్రేమలో ఉందని తెలిసి గొంతు నులిమి చంపాడు. అనంతరం మోర్నా గ్రామంలోని కెనాల్లో మృతదేహాన్ని విడిచి వెళ్లాడు. శనివారం గొంతు పై గాట్లతో ఉన్న టీచర్ మృతదేహాన్ని కెనాల్లో పోలీసులు గుర్తించారు.ఆ యువతి మరొకరిని ప్రేమించిన విషయం తెలియడంతో గొంతునులిమి చంపానని నిందితుడు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.