breaking news
Unlimited free calls
-
ఇక అన్లిమిటెడ్ ఉచిత కాల్స్‌తో బీఎస్ఎన్ఎల్
మీరట్: ప్రముఖ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వినియోగదారులకు శుభవార్త. బంపర్ ఆఫర్ తో బీఎస్ఎన్ఎల్ ఈ ఆగస్టు 15న దూసుకొస్తుంది. ప్రతి ఆదివారం ఏ నెట్ వర్క్‌కు అయిన అపరమితమైన ఉచిత ఫోన్ కాల్స్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుంది. ఈ ప్లాన్ ను ఆగస్టు 15 ప్రారంభిస్తున్నారు. అయితే, ఇది ల్యాండ్ ఫోన్ సౌకర్యం ఉన్నవారికి మాత్రమే. ల్యాండ్ ఫోన్ బిజినెస్ ను మరింత వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా రాత్రి 9గంటల నుంచి ఉదయం 7గంటల వరకు అందిస్తున్న అన్ లిమిటెడ్ ఉచిత కాల్ ప్లాన్ కు ఇది అదనం. నైట్ కాలింగ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చి ఏడాది అవుతుంది. ఈ నేపథ్యంలో మరింత బూస్టింగ్ ఇచ్చేందుకు తాజాగా సరికొత్త ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ తీసుకొస్తుంది. -
బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్.. అపరిమిత ఉచిత కాల్స్
-
బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్.. అపరిమిత ఉచిత కాల్స్
రాత్రి 9 గం. నుంచి ఉదయం 7 గం.లోపు * ఏ ల్యాండ్‌లైన్/మొబైల్ నెట్‌వర్క్‌కైనా * వచ్చేనెల 1 నుంచి అమల్లోకి... న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి రాత్రి వేళల్లో అపరిమిత ఉచిత కాల్స్ చేసుకునే ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ఈ ఆఫర్ వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. తమ ల్యాండ్‌లైన్ నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు దేశంలోని ఏ ప్రాంతానికైనా ఏ నెట్వర్క్ ల్యాండ్‌లైన్‌కైనా, ఏ మొబైల్ నెట్వర్క్ ఫోన్లకైనా ఉచితంగా ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చని వివరించింది. అన్ని ల్యాండ్‌లైన్ సాధారణ ప్లాన్లకు (గ్రామీణ, పట్టణ) ల్యాండ్‌లైన్ స్పెషల్ ప్లాన్లు, కాంబో ప్లాన్(ల్యాండ్‌లైన్, బ్రాండ్‌బాండ్ కలగలిపిన).. ఏ ప్లాన్లకైనా ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ల్యాండ్‌లైన్ వ్యాపారానికి జోష్‌నిచ్చే దిశగా బీఎస్ఎన్ఎల్ ఈ ఉచిత అపరిమిత కాల్స్ ఆఫర్‌ను అందిస్తోంది. దేశీయ ల్యాండ్‌లైన్ మార్కెట్లో అధిక మార్కెట్ వాటా (దాదాపు 62 శాతం)ఉన్న బీఎస్ఎన్ఎల్ నుంచి ల్యాండ్‌లైన్ కనెక్షన్ల ఉపసంహరణ అధికంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1.62,556 మంది బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ కనెక్షన్లకు గుడ్‌బై చెప్పారు. దీనిని నివారించడానికి కూడా ఈ అపరిమిత ఉచిత కాల్స్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారుల సంఖ్య 1.66 కోట్లుగా ఉంది.