breaking news
University of Jammu
-
భారత్ వాణిని ప్రపంచం ఆసక్తిగా వింటోంది
జమ్మూ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో ప్రపంచ వేదికపై భారత్ పలుకుబడి, స్థాయి పెరిగిపోయాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత్ చెప్పే విషయాలను ప్రపంచ సమాజం ఇప్పుడు ఆసక్తిగా వింటోందని చెప్పారు. గతంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ ఏ విషయమైనా చెబితే, అంత సీరియస్‌గా తీసుకునేవారు కారని తెలిపారు. మోదీ ప్రభుత్వం వచ్చాక 2014 తర్వాత అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో జాతీయ భద్రతపై జరిగిన సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ అమెరికా, ఈజిప్టుల్లో ఆరు రోజుల పర్యటన సందర్భంగా పలు చారిత్రక ఒప్పందాలపై సంతకాలు చేసిన నేపథ్యంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ప్రధాని మోదీ పలుకుబడి పెరిగిందని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ ‘బాస్’అంటూ మోదీని అభివరి్ణంచగా, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆటోగ్రాఫ్ తీసుకునేంత ప్రజాదరణ కలిగిన నేతగా కొనియాడిన నేపథ్యంలో మంత్రి ఈ మాటలన్నారు. ప్రధాని మోదీ హయాంలో భారత్ మరింత శక్తివంతంగా మారిందన్న ఆయన..అవసరమైన పక్షంలో సరిహద్దుల వెలుపల కూడా దాడి చేయగలదంటూ పొరుగుదేశం పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’విధానం అంటే అర్థం ఏమిటో దేశంతోపాటు ప్రపంచమే తెలుసుకుందని వ్యాఖ్యానించారు. 2016, 2019ల్లో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఆయన ప్రస్తావిస్తూ..ఇందుకు సంబంధించిన నిర్ణయాలను ప్రధాని మోదీ కేవలం 10 నిమిషాల్లోనే తీసుకున్నారని, దీన్ని బట్టి ఆయన సామర్థ్యమేంటో తెలుస్తుందని రాజ్‌నాథ్ తెలిపారు. సరిహద్దుల లోపలే కాదు, వెలుపల కూడా ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను మన బలగాలు ధ్వంసం చేశాయన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోíÙంచడమే ప్రభుత్వ విధానంగా మార్చుకున్న దేశాలు ఈ ఆటను ఎక్కువ సేపు ఆడలేవన్న విషయాన్ని గ్రహించాలని ఆయన పాక్‌నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. భారత్ కృషితో నేడు చాలా వరకు పెద్ద దేశాలు ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడుతున్నాయని చెప్పారు. కశీ్మర్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ద్వారా ఏమీ సాధించలేమన్న విషయం పాక్ తెలుసుకోవాలన్నారు. పాక్ ముందుగా తన సొంతింటిని చక్కదిద్దుకోవాలని హితవుపలికారు. పాక్ ఆక్రమిత కశీ్మర్ కూడా భారత్‌దేనని చెప్పారు. దీనిపై పార్లమెంట్ ఇప్పటికే పలు తీర్మానాలు చేసిందని గుర్తు చేశారు. జమ్మూకశీ్మర్‌లో తామూ భాగమేనంటూ పీవోకే ప్రజలు డిమాండ్ చేసే రోజులు ఎంతో దూరంలో లేవని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. -
ఉద్యోగ సమాచారం
ఐఐసీటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ).. తాత్కాలిక ప్రాతిపది కన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 6. వయసు 28 ఏళ్లకు మించకూడదు. ఇంటర్వ్యూ తేది అక్టోబర్ 27. వివరాలకు www.iictindia.org చూడొచ్చు. ఢిల్లీ నిట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్).. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 13. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేది నవంబర్ 30. వివరాలకు www.nitdelhi.ac.in చూడొచ్చు. కేంద్ర జల వనరుల సంస్థలో పోస్టులు సెంటర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఫెలో (ఖాళీలు-4), ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఖాళీలు-1) పోస్టుల భర్తీకి అక్టోబర్ 30, నవంబర్ 11న ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వయసు 28 ఏళ్లకు మించకూడదు. వివరాలకు www.cwrdm. org చూడొచ్చు. రామన్ రీసెర్చ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్లు బెంగళూరులోని రామన్ రీసెర్చ ఇన్స్టిట్యూట్.. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో రీసెర్చ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 13. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 19. వివరాలకు www.rri.res.in చూడొచ్చు. తిరుచిరాపల్లి నిట్‌లో సపోర్ట ట్రైనీలు తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సపోర్ట ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 10. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 13. వివరాలకు www.nitt.edu చూడొచ్చు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో విజిటింగ్ డాక్టర్లు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే.. కాంట్రాక్టు ప్రాతిపదికన ఆసుపత్రుల్లో విజిటింగ్ స్పెషలిస్ట్‌ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 8. వయసు 30-64 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 6. వివరాలకు www.secr.indianrailways.gov.in చూడొచ్చు. యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో ప్రొఫెసర్లు యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ.. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్ (ఖాళీలు-21), అసోసియేట్ ప్రొఫెసర్ (ఖాళీలు-17), అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఖాళీలు-20), డెరైక్టర్ (ఖాళీలు-1), అసిస్టెంట్ డెరైక్టర్ (ఖాళీలు-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 30. వివరాలకు www.jammuuniversity.in చూడొచ్చు. వరంగల్ నిట్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్).. వికలాంగుల కోటాలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఖాళీలు-7), సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్ (ఖాళీలు-1), జూనియర్ అసిస్టెంట్ (ఖాళీలు-2), ల్యాబ్/వర్క అసిస్టెంట్ (ఖాళీలు-2), అటెండెంట్ (ఖాళీలు-2). దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 6. వివరాలకు www.nitw.ac.in చూడొచ్చు. ఓఎన్జీసీలో 493 పోస్టులు గుజరాత్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) లిమిటెడ్.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. ఏ-2 లెవల్ (ఖాళీలు- 231), ఏ-1 లెవల్ (ఖాళీలు-254), డబ్ల్యూ-1 లెవల్ (ఖాళీలు-8). ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 6. వివరాలకు www.ongcindia.com చూడొచ్చు. ‘ఆయుర్వేదిక్ సెన్సైస్’లో అసిస్టెంట్ డెరైక్టర్లు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ ఇన్ ఆయుర్వేదిక్ సెన్సైస్.. ఆయుర్వేద, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో అసిస్టెంట్ డెరైక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11. వయసు 45 ఏళ్లకు మించకూడదు. దరఖా స్తుకు చివరి తేది నవంబర్ 30. వివరాలకు www.ccras.nic.in చూడొచ్చు. తమిళనాడు జలమండలిలో ఏఈలు తమిళనాడు వాటర్ సప్లై అండ్ డ్రైనేజ్ బోర్డ.. సివిల్, మెకానికల్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. ఏఈ (సివిల్) (ఖాళీలు-75), ఏఈ (మెకానికల్) (ఖాళీలు-25). దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 31. వివరాలకు www.twadrecruitment.net చూడొచ్చు. కాటన్ కార్పొరేషన్లో స్పెషల్ రిక్రూట్మెంట్ నవీ ముంబైలోని ‘ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’.. వికలాంగుల కోటాలో అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్) (ఖాళీలు-1), జూనియర్ అసిస్టెంట్ (జనరల్/అకౌంట్స్) (ఖాళీలు-5), మెయింటనెన్స స్టాఫ్ (ఖాళీలు-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 16. వివరాలకు www.cotcorp.gov.in చూడొచ్చు. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు నోయిడాలోని బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 8. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 30. వివరాలకు www.becil.com చూడొచ్చు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో టెక్నీషియన్లు ఒడిశాలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్).. వివిధ విభాగాల్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 46. వయసు 28 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 10. వివరాలు www.hal-india.com చూడొచ్చు. ఎంటీఎన్ఎల్లో స్పెషల్ రిక్రూట్మెంట్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్.. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 5. వయసు 35 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 23. వివరాలకు www.mtnl.in చూడొచ్చు. ఆర్మీలో ఎడ్యుకేషన్ కార్ప్స ఇండియన్ ఆర్మీ.. వివిధ సబ్జెక్టుల్లో ఎడ్యుకేషన్ కార్ప్స కోర్సుల్లో ప్రవేశానికి పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 10. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 11. వయసు 27 ఏళ్లకు మించకూడదు. వివరాలకు www.joinindianarmy.nic.in చూడొచ్చు.