breaking news
Uneducated
-
బాల కార్మికులు లేని సమాజం కోసం..
‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐ.ఎల్.ఓ.) జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినంగా జరపాలని తీర్మానించింది. పిల్లలను దొంగ తనంగా రవాణా చెయ్యడాన్ని ఆపడం, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం బాలకార్మికులు బడిబాట పట్టేలా చూడటం ఈ దినోత్సవ లక్ష్యం. 2002 నుంచి ప్రతియేటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అభి వృద్ధి చెందిన దేశాలలో కూడా బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 27.6 కోట్ల మంది పిల్లలు బాలకార్మికులుగా ఉన్నారని సర్వేలు, గణాంకాలతో సహా వెల్లడిస్తున్నాయి. తల్లిదండ్రులు అనాధలు కావడం, కుటుంబ పేదరికం, నిరక్షరాస్యత తదితర కారణాలవల్ల బాలలు కార్మికులుగా మారుతున్నారు. కర్మాగారాలలో, హోటల్స్‌లో, రైల్వే, బస్సు స్టేషన్లు, వీధులలో బాల కార్మికులు కని పిస్తున్నారు. చాలీ చాలని జీతాలతో పనులు చేస్తూ బతుకు బండిని లాగుతున్నారు. బాల కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడు తున్నా ఫలితాలు శూన్యం. సరైన సమయానికి తిండి దొరకక పస్తులు ఉంటూ రోగాలపాలవుతున్నారు బాల కార్మికులు. వీధులలో తిరుగుతూ పడేసిన వాటర్ బాటిళ్లు, చిత్తు కాగితాలు, కవర్లు ఏరుకుంటూ జీవితం గడుపుతు న్నారు. గ్రామాలలో బడి ఈడు గల పిల్లలు బడికి వెళ్లకుండా పశువులను మేపడానికి వెళ్లడం, లారీలు, ట్రాక్టర్లు, ప్రైవేటు బస్సులలో క్లీనర్లుగా పనిచేస్తూ బాల కార్మికుల సంఖ్య పెరగడానికి కారణాలుగా నిలుస్తున్నారు. చట్టాలను అమలు చేస్తున్న నాయ కుల ఇళ్లలో బాల కార్మికులు పనిచేస్తున్నట్లు పత్రిక లలో కథనాలు కూడా గతంలో వచ్చాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, వివిధ దేశాలలో బాల కార్మి కుల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సమా జంలో భాగస్వాములైన మనమందరం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుం బిగిద్దాం. బాల కార్మి కులతో మాట్లాడి పాఠశాలల్లో చేర్పిద్దాం. అనాథ లైన బాల కార్మికులను ప్రభుత్వ వసతి గృహాలలో ఉండేలా ప్రవేశం కల్పిద్దాం. దేశ అభివృద్ధికి అవరో ధంగా నిలుస్తున్న బాలకార్మిక వ్యవస్థను తరిమి కొట్ట డానికి ప్రతి ఒక్కరం ముందుకు వద్దాం. (నేడు ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం) కామిడి సతీష్ రెడ్డి, జెడలపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ‘ మొబైల్ : 98484 45134 -
సంపూర్ణ అక్షరాస్యత స్వప్నమేనా..!
- వందశాతం చేరేదెన్నడు..! - రాత్రి బడులు తెరిచినా లాభం లేకపాయే - ‘సాక్షర భారత్’ వచ్చినా అందరికీ సదువు రాకపాయే - జిల్లా అక్షరాస్యత శాతంలో మహిళల వెనుకంజ - నేడు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం మోర్తాడ్ :నగరాలు, పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాలలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో సరైన సహకారం లేకపోవడంతో సాధ్యం కావడం లేదు. నిరక్ష్యరాస్యతను తగ్గించి అక్షరాస్యుల సంఖ్యను పెంచడానికి కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం 2010 సెప్టెంబర్ 8 నుంచి సాక్షరభారత్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తుంది. ప్రతిఏడాది సెప్టెంబర్ 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహించడం తప్పా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన ఘనతను మాత్రం చాటుకోలేకపోతున్నాం. నిరక్షరాస్యుల్లో మహిళలే అధికం జిల్లాలో 85.88 శాతం అక్షరాస్యులు ఉన్నట్లు అ ధికారుల రికార్డులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నిరక్ష్యరాసుల సంఖ్య తగ్గలేదన్న విష యం స్పష్టమవుతోంది. జిల్లాలో పురుషుల్లో కంటే మహిళల్లోనే నిరక్షరాస్యుల సంఖ్య అధికంగా ఉన్నట్లు వెల్లడవుతోంది. జిల్లాలోని 23 మండలాల్లో మహిళల అక్షరాస్యత 50శాతం లో బడి ఉంది. 13మండలాల్లో మాత్రమే మహిళ లు 50 శాతానికి పైగా అక్షరాస్యత సాధించారు. మహిళల్లో అక్షరాస్యత శాతం పెంచడానికి సాక్షరభారత్ కేంద్రాలకు అనుబంధంగా బోధకుల ను నియమించారు. అయినా అక్షరాస్యత శాతం పెరగడం లేదు. క్షేత్రస్థాయిలో అక్షరాస్యత కా ర్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయక పో వడంతోనే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యం కాలేక పోతుంది. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్, బాల్కొండ, ఎడపల్లి, బాన్సువాడ, డిచ్పల్లి, జక్రాన్‌పల్లి, మద్నూర్, కోటగిరి, రెంజల్ మండలాల్లో మిహ ళా అక్షరాస్యత 50 శాతంకు పైగా ఉంది. మిగిలిన వేల్పూర్, దోమకొండ, మాక్లూర్, భిక్కనూర్, నవీపేట్, వర్ని, మోర్తాడ్, ఎల్లారెడ్డి, నందిపేట్, కమ్మర్పల్లి, సదాశివ్‌నగర్, ధర్పల్లి, సిరికొండ, బిచ్కుంద, పిట్లం, మాచారెడ్డి, తాడ్వాయి, బీర్కూర్, నిజాంసాగర్, నాగిరెడ్డిపేట్, జుక్కల్, గాంధారి, లింగంపేట్ మండలాల్లో మహిళా అక్షరాస్యత 50 శాతంకు తక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాలను పరిశీలిస్తే అతి తక్కువగా లింగంపేట మండలంలో మహిళ అక్షరాస్యత శాతం 37.11 గా ఉంది. ఇదే మండలంలో పురుషుల అక్షరాస్యత శాతం 48.39గా ఉంది. అక్షరాస్యతలో జిల్లాలో నిజామాబాద్ మండలం ముందంజలో ఉండగా లింగంపేట చివరి స్థానంలో ఉంది. వయోజనులే ఎక్కువ వయోజనుల్లోనే నిరక్ష్యరాసులు ఎక్కువ మంది ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. వీరికోసం సాక్షర భారత్ ద్వారా అక్షరాస్యత కార్యక్రమా న్ని నాలుగేళ్లనుంచి నిర్వహిస్తూనే ఉంది. గ్రా మాల్లో కో-ఆర్డినేటర్లను నియమించి వీరిని అజమాయిషీ చేయడానికి మండల కో-ఆర్డినేటర్, సూపర్వైజర్, అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్, ప్రాజెక్టు డెరైక్టర్, డిప్యూటీ డెరైక్టర్లను నియమించారు. అయితే క్షేత్ర స్థాయిలో ఈ కార్యక్ర మం అమలు పకడ్బందీగా జరగకపోవడంతో నిరక్ష్యరాసుల సంఖ్య అలాగే ఉండిపోతోంది. పథకాలను ఆర్భాటంగా ప్రకటిస్తున్నారే త ప్పా.. అమలులో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా పాలకు లు, అధికారులు క్షేత్రస్థాయిలో పథకాలను పకడ్బందీగా అమలు చేసి సంపూర్ణ అక్షరాస్యతకు కృషిచేయాలని అందరూ కోరుతున్నారు.