breaking news
Understand
-
ఏఐ మరో సంచలనం.. జంతువుల భాష డీకోడ్ చేస్తూ..
ఇప్పటివరకు మన ఊహకే పరిమితమైన ఒక విషయం త్వరలో వాస్తవ రూపం దాల్చనుంది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో మనుషులు జంతువులు, పక్షులతో సంభాషించగలిగే అవకాశం త్వరలో రానున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ సాంకేతికతతో జంతువుల స్వరాలు, కదలికలను సేకరించి విశ్లేషించడం వాటి గోప్యత హక్కును ఉల్లంఘించే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.జంతువుల భాషను అర్థం చేసుకునే దిశగామెషిన్ లెర్నింగ్ నమూనాలు.. జంతువుల ధ్వనులను క్రమబద్ధీకరించి, మనుషులు సులభంగా గుర్తించలేని నమూనాలను గుర్తిస్తున్నాయి. కారియన్ క్రో (కాకి)ల స్వరాలపై ఏళ్లుగా పరిశోధన చేస్తున్న జీవశాస్త్రవేత్త విట్టోరియో బగ్లియోన్.. ఏఐ తన రికార్డింగుల్లోని సాధారణ లక్షణాలను గుర్తించగలగడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. కాకులు గూడు రక్షణ కోసం ఇతర కాకులను పిలిచే ఒక స్వరం ‘రండి.. సహాయం చేయండి’ అనే అర్థాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు.‘ప్లేబ్యాక్’తో ప్రమాదంరికార్డు చేసిన జంతు స్వరాలను అడవిలో తిరిగి వినిపించే ‘ప్లేబ్యాక్’ పద్ధతి దుర్వినియోగానికి దారితీయవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పరిచయమైన స్వరాన్ని అనుకరించి జంతువుల ప్రవర్తనను ప్రభావితం చేయవచ్చని, దాని అసలు అర్థం పూర్తిగా తెలియకపోయినా ఇది సాధ్యమని పేర్కొన్నారు. వేటగాళ్లు లేదా దురుద్దేశంతో ఉన్నవారు ఈ సాంకేతికతను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని బగ్లియోన్ హెచ్చరించారు.సంభాషణా.. లేక జోక్యమా?న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన మోర్-దాన్-హ్యూమన్ లైఫ్ కార్యక్రమం డైరెక్టర్ సీజర్ రోడ్రిగెజ్-గరవిటో కూడా ప్లేబ్యాక్ సాంకేతికతపై ఆందోళన వ్యక్తం చేశారు. 2025లో జంతు సంభాషణకు సంబంధించిన ఏఐ వ్యవస్థలపై రూపొందించిన నివేదికలో.. ఈ సాంకేతికత వల్ల జంతువులను సంప్రదించేందుకు పెద్ద సంఖ్యలో మనుషులు ప్రయత్నించే పరిస్థితి ఏర్పడొచ్చని, వాటిని ఆయుధాలుగా ఉపయోగించే ప్రమాదమూ ఉందని పేర్కొన్నారు.ఏనుగు ఉదంతం హెచ్చరిక2007లో జంతుశాస్త్రవేత్త కేటీ పేన్.. మరణించిన వృద్ధ ఏనుగు స్వరాన్ని రికార్డు చేసి వినిపించడంతో ఓ ఏనుగు తీవ్ర ఆందోళనకు గురైందని తెలిపారు. జంతువుల స్వరాన్ని కచ్చితంగా పునరుత్పత్తి చేయగలిగినా.. దాని అర్థం, దాని ప్రభావం పూర్తిగా అర్థం కాకపోవచ్చని ఈ ఘటన సూచిస్తోంది.2030 నాటికి సాధ్యమేనా?ఇన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ జంతువులతో సంభాషణకు వీలైన వ్యవస్థల అభివృద్ధిపై పరిశోధకులు, సాంకేతిక సంస్థలు దృష్టి కొనసాగిస్తున్నాయి. మనుషులతో సంభాషిస్తున్నామని జంతువుకు తెలియకుండానే సంభాషణను గుర్తించగల ప్రాజెక్టుకు ప్రస్తుతం 10 మిలియన్ డాలర్ల బహుమతి ఉంది. ఈ సవాలుకు నిధులు సమకూరుస్తున్న బిలియనీర్ జెరెమీ కొల్లర్.. వచ్చే దశాబ్దంలోనే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని ఓ కార్యక్రమంలో ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐ వేగాన్ని దృష్టిలో ఉంచుకుని 2030 నాటికి ఈ ‘కోడ్’ను ఛేదించగలమని అన్నారు.ఇది కూడా చదవండి: నీమ్ కరోలి బాబా ఎవరు.. స్టీవ్ జాబ్స్‌ను ఎలా ప్రభావితం చేశారు? -
ఆన్‘లైన్’ అర్థమయ్యేనా?
సాక్షి, హైదరాబాద్ : జనగామ జిల్లా కేంద్రంలో కాసుల సౌమ్య 8వ తరగతి చదువుతోంది. కరోనా నేపథ్యంలో పాఠశాలలు తెరిచే పరిస్థితి లేకపోవడంతో ఈమెకు ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో రోజుకు ఒక సబ్జెక్టును బోధిస్తున్నారు. బోర్డుపై రాసి ఫొటోలను వాట్సాప్ చేస్తున్నారు. వీడియో ద్వారా పాఠాలు చెబుతున్నారు. ఉదయం గంటన్నరపాటు రెండు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో టీచర్లు చెప్పిన సమయంలో వినడమే తప్ప, తిరిగి అడగడానికి వీలు లేదు. ఒక్కోసారి వీడియో షేక్ అవుతోంది. ఆ సమయంలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు పూర్తి స్థాయిలో వినలేక పోతున్నామని, బోర్డుపై రాసిన చిన్న చిన్న అక్షరాలను చూడలేక కళ్లపై ఒత్తిడి పెరుగుతోందని సౌమ్య చెబుతోంది. ఇంటర్నెట్ కూడా ఒక్కోసారి ఇబ్బంది పెడుతుండటంతో ఆన్లైన్ క్లాస్‌లు మధ్యలోనే ఆగిపోతున్నాయని అంటోంది. ఏడాది పొడవునా ఇలానే చదువుకోవడం కష్టమేనని చెబుతోంది. ఈ సమస్య సౌమ్యది మాత్రమే కాదు. రాష్ట్రంలోని దాదాపు అన్ని చోట్లా, అందరు విద్యార్థులదీ ఇదే పరిస్థితి. కరోనా పేరుతో రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయి కానీ విద్యార్థుల బుర్రలోకి అవి ఏ మేరకు ఎక్కు తున్నాయన్నది ఎవరికీ అంతు పట్టడం లేదు. తరగతి గదిలో కూర్చుని పాఠాలు వింటేనే కనీ సం 30% మంది విద్యార్థులు శ్రద్ధ పెట్టలేరని కొన్ని అధ్యయనాలు చెబు తున్నాయి. ఇక ఇంట్లో ఉండి స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడకుండా... పాఠాలు ఏ మేరకు వింటారనేది సందేహాస్పదమే. ఆన్లైన్ పాఠాలు అర్థం కావడం లేదని 70% మంది విద్యా ర్థులు అభిప్రాయపడుతున్నట్టు ఇటీవల ఓ సర్వేలో వెల్లడి కావడం గమనార్హం. అటు వైపు నుంచి టీచర్ చెప్పింది వినడమే కానీ, ఏమైనా సందేహాలుంటే అడిగే పరిస్థితి లేకపోవడం, టీచర్ చెప్పినంత సేపు ఏకాగ్రతతో వినలేక పోవడం, ఇంటర్నెట్ సమస్య ఏర్పడితే క్లాసు మధ్యలో ఆగిపోవడం, స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడడమే కానీ, పాఠాలు వినే ఓపిక విద్యార్థులకు లేకపోవడం, డబ్బులు పెట్టి కొనిచ్చాం... ఖచ్చితంగా పాఠాలు వినండంటూ తల్లి దండ్రులు విద్యార్థులపై ఒత్తిడి చేయడం... ఇలా అనేక సమస్యల మధ్య చదువులు కొనసాగిం చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒత్తిడిలో పిల్లలు వాస్తవానికి, దాదాపు నెలరోజుల క్రితం నుంచే పాఠశాలలు ప్రారంభం కావాలి. అప్పటి నుంచి పాఠాలు ప్రారంభిస్తే వార్షిక పరీ క్షలు సమీపించే నాటికి సిలబస్ పూర్తయ్యేలా పాఠ్య ప్రణాళికల రూపకల్పన జరిగింది. కానీ, సమయం అప్పుడే నెలరోజులు గడిచిపోయింది. జూన్ నుంచే కొన్ని పాఠశాలలు ఆన్లైన్ తరగతులు ప్రారంభించినా మొదట్లో కొంత మందకొడిగానే సాగాయి. కానీ, ఇప్పుడు విద్యార్థుల వారీగా టైంటేబుళ్లు తయారు చేసి, బోధించే టీచర్లకు షెడ్యూల్ ఇచ్చి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఆన్లైన్ క్లాసులు బోధిస్తు న్నాయి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు. ఈ నేపథ్యంలో వీడియో పాఠాలు వినే సమయంలో విద్యార్థులు మానసికంగా, శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుతుందంటూ గంటల ముందు నుంచే సెల్ఫోన్లు ఆపరేట్ చేస్తుండడం, కంప్యూటర్ల ముందు కూర్చుని పిచ్చాపాటి బ్రౌజింగ్ చేస్తున్న కారణంగా విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతోందని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పాఠం ప్రారంభం అయిన తర్వాత వాట్సాప్‌లో వచ్చే ఫోటోలు, వీడియో రూపంలో కనిపించే చిన్న అక్షరాలను చూసుకుని మళ్లీ నోట్సు రాసుకోవడం వారికి తలకు మించిన భారంగానే మారింది. దీంతో కళ్లు ఇబ్బంది పెడుతున్నాయనే ఫిర్యాదులు అప్పుడే విద్యార్థుల నుంచి ప్రారంభం అయ్యాయని ఇటీవల ఓ ఉపాధ్యాయ సంఘం నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. ఇక పెద్ద తరగతుల విద్యార్థులకు అయితే ఆన్లైన్ క్లాసులు ఓ ఆటగా, ఆందోళనగా మారాయి. తల్లితండ్రుల భయంతో పాఠాలు విన్నట్టు నటించడం, అర్థం కాని అంశాలను ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియకపోవడం, నోట్సుల్లో పూర్తిగా రాసుకోకుండా ఎలా చదువుకోవాలో అర్థం కాకపోవడం సమస్యగా మారుతోంది. ఒకవేళ పాఠశాలలు పునఃప్రారంభం అయినా ఆన్లైన్లో చెప్పిన పాఠాలు మళ్లీ బోధిస్తారో.... సమయం లేదని సరిపెడతారో తెలియని పరిస్థితి. వెనుకబడతామా..? ఆన్లైన్ పాఠాలు ప్రారంభం అయిన విద్యార్థుల పరిస్థితి అలా ఉంటే ఇంకా ఆన్లైన్ పాఠాలు మొదలు కాని విద్యార్థులు మరో టెన్షన్ అనుభవిస్తున్నారు. తమ పక్కనే ఉండే మరో విద్యార్థి చదువుకుంటుంటే తాను ఇంకా చదువుకోవడం లేదనే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. చదువుల్లో వెనుకబడతామేమోననే భయం వ్యక్తమవుతోంది. ఇదే ఆందోళన, ఆదుర్దా ఇంకా ఆన్లైన్ పాఠాలు ప్రారంభం కాని విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ కనిపిస్తోంది. ఒకవేళ తమ పిల్లలకు కూడా ఆన్లైన్ పాఠాలు అంటారేమో అనే ఆలోచనతో కొందరు కొత్త ఫోన్లు కొనడం, కంప్యూటర్లు రిపేర్ చేయించుకోవడం లాంటి పనుల్లో నిమగ్నం కాగా, పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం వైపు ఆశగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి...పరీక్షలెట్టా పాఠాలయితే వింటున్నాం కానీ పరీక్షలు ఆన్లైన్లో ఎలా నిర్వహిస్తారో అనే ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. పోటీపరీక్షలు రాసేంత వయసు, అవగాహన వచ్చిన తర్వాతే ఆన్లైన్లో పరీక్షలు రాయడం సాధ్యం అవుతుందని, అలా కాకుండా చిన్న వయసులోనే కంప్యూటర్, సెల్ఫోన్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తమ పిల్లలు పరీక్షలు ఎలా రాస్తారో అనే ఉత్కంఠ కూడా తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించాలి: 'నా కుమారుడు శశాంక్‌రెడ్డి హైదరాబాద్‌లో, కుమార్తె యశస్విని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. ఆన్లైన్ తరగతుల పేరిట ఇద్దరికి కలిపి సెల్ఫోన్లు, నోట్‌బుక్స్, ఇతర పరికరాలు కొనుగోలు కోసం రూ.30 వేల పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆన్లైన్ ద్వారా అర్థం చేసుకుంటే, ఎంత కష్టపడైనా చదివించేందుకు సిద్దంగా ఉన్నాం. కానీ ఫో¯న్లో పాఠాలు అర్థం చేసుకోలేక పిల్లలపై మానసికంగా ఒత్తిడి పెరుగుతోంది. ఆన్లైన్ బోధన కన్నా ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి.’ ఆసిరెడ్డి తిర్మల్‌రెడ్డి, తండ్రి, జనగామ ఈ ఏడాది డుమ్మానే : ‘నా కుమారుడు సాత్విక్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. మా గ్రామంలో నేటికీ కనీసం 2జీ సిగ్నల్ కూడా సరిగా రాదు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తే మా గ్రామంలోని విద్యార్థుల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్నా ఊర్లో ఇంటర్నెట్ సరిగా రాదు. ఫోన్ ఇస్తే పిల్లలు చదువుకునే దాని కన్నా గేమ్స్ ఆడుకోవడానికే సరిపోతుంది. ఇంటర్నెట్ సహకరించకపోతే చెప్పే పాఠాలు కూడా సరిగా అర్థం కావు. ఆన్లైన్ చదువులంటే ఊర్లో పిల్లలు ఈ ఏడాది చదువులకు డుమ్మా కొట్టినట్టే. ఇక టీవీల్లో చదువులు సాధ్యమయ్యే పని కాదు. మేడిచెలిమి లావణ్య, కుందనవానిపల్లి, అక్కన్నపేట మండలం, సిద్ధిపేట జిల్లా -
కోతులకూ కుర్రాళ్ల ప్రవర్తన..
వాషింగ్టన్: మనుషుల్లానే కోతులు కూడా తమ జీవితకాలం పాటు ఇతరుల చూపులను అర్థం చేసుకుంటాయని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. హార్వర్డ్ వర్సిటీ, పెనోస్లోవియా వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం 481 రైసిస్ కోతుల మీద ఈ అధ్యయనం నిర్వహించారు. శిశువులతో పోలిస్తే కాస్త ముందుగానే బాల్య దశలో ఉన్న కోతులు శాస్త్రవేత్తల చూపులకు చురుగ్గా స్పందించాయని, పైకి చూడగానే ఇవి కూడా చూపును పైకి మరల్చాయని వివరించారు. ఇక కుర్రాళ్లలా యవ్వనంలో ఉన్న మగ కోతులు ఆడ కోతుల వైపు అధికంగా చూసేవని తెలిపారు. వృద్ధాప్యంలో సైతం మనుషుల్లానే తమ చూపులను తిప్పాయన్నారు. చూసి నేర్చుకోవడం అనేది భాష, సామాజిక అవగాహన, జ్ఞానాన్ని పెంచుకునేందుకు పునాదని, ఇది మానవ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని వాల్ యూనివర్సిటీ చెందిన లారీ సాన్టోస్ తెలిపారు. -
స్పీడ్ రీడింగ్ వల్ల ప్రయోజనాలు శూన్యమే..!
స్పీడ్ రీడింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయంటూ వివిధ సంస్థలు కోచింగ్ క్లాస్ లు, యాప్ లతో ఊదరకొడుతుంటే... అదంతా వృధా ప్రయాసేనంటున్నారు అధ్యయనకారులు. ఎంతటి సమాచారాన్నయినా స్పీడ్ రీడింగ్ ప్రాక్రిస్ తో గుర్తు పెట్టుకోవచ్చన్న వాదాన్ని వారు తప్పుబడుతున్నారు. స్పీడ్ రీడింగ్ పై జరుగుతున్న ప్రచారానికి అర్థం లేదని, వేగంగా పఠించడం వల్ల విషయాలు గుర్తుండవని, హాయిగా... ప్రశాంతంగా చదివినదే ఎక్కువకాలం గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుందన్నది పరిశోధకుల వాదన. వేగ పఠనంపై అందుబాటులో ఉన్న యాప్ లు, టెక్నిక్ లను అధ్యయనం చేసిన పరిశోధకులు వాటివల్ల ఎటువంటి ప్రయోజనం లేదంటున్నారు. దశాబ్దాల కాలంగా జరిగిన పరిశోధనలను పరిశీలించిన అధ్యయనకారులు స్పీడ్ రీడర్స్ చదివిన విషయాలను గుర్తు పెట్టుకోలేకపోతున్నట్లుగా చెప్తున్నారు. ఈ మెయిల్, సామాజిక మీడియా ప్రపంచంలో స్పీడ్ రీడింగ్ అవసరమౌతుందే తప్పించి దీర్ఘ కాల ప్రయోజనాలకు అవసరం లేదంటున్నారు. అతి పెద్ద పుస్తకాల్లో రాసిన విషయాన్ని అప్పటికప్పుడు చదివి, తక్కువ సమయం గుర్తుపెట్టుకొనేందుకు స్పీడ్ రీడింగ్ షార్ట్ కట్ మెథడ్ అని, విజ్ఞాన శాస్త్రంలో అది ఓ చిన్న ఆధారం మాత్రమే అని పరిశోధనల్లో తేలిందని సైకలాజికల్ సైంటిస్టుల బృందం చెప్తోంది. దశాబ్దాల కాలంగా స్పీడ్ రీడింగ్ కోర్సులు ఉండగా... ఇటీవల కన్జూమర్ మార్కెట్లో స్పీడ్ రీడింగ్ టెక్నాలజీల సంఖ్య భారీగా పెరిగిపోయిందని, శాన్ డియాగోలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా సైకలాజికల్ సైంటిస్ట్ ఎలిజబెత్ స్కాటర్ చెప్తున్నారు. తక్కువ సమయంలో చదవడం వల్ల, విషయాన్ని అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం తక్కువగానే ఉంటుందని ఆమె వివరిస్తున్నారు. పఠనం అనేది మనసుకు, కళ్ళకు సంబంధించిన ప్రక్రియ అని, ఎంతో నైపుణ్యం కలిగిన వారు నిమిషానికి సుమారు 200 నుంచి 400 పదాలు చదవగల్గుతారని అంటున్నారు. కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్ మధ్యభాగంలో వెంట వెంటనే పదాలు ప్రదర్శించడంద్వారా వేగ పఠనం అలవర్చుకొనేందుకు స్పీడ్ రీడింగ్ టెక్నాలజీలు ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియ సరైనది కాదని, ఇందులో జరిగిపోయిన పదాన్ని తిరిగి చదివేందుకు, వాక్యనిర్మాణానికి అవకాశం లేదని, ఇలా స్పీడ్ గా కదిలిపోయే పదాల్లో పది శాతం పదాలను మాత్రమే కళ్ళు చూడగల్గుతాయని పరిశోధకులు చెప్తున్నారు. మన దృష్టి, సామర్థ్యం కలిపితేనే వ్యాక్య నిర్మాణం జరుగుతుందని అప్పుడే చదవడం వల్ల ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. భాష పట్ల అవగాహన లేకుండా స్పీడ్ గా చదివే సమర్థతను పెంచడం వల్ల ఏమీ లాభం లేదంటున్నారు. అయితే విషయాలపట్ల సమగ్ర అవగాహన ఉండి, వేగంగా చదివేవారికి ఇది వర్తించదంటున్నారు. చదువుతున్న విషయంపై ఆసక్తి అధికంగా ఉండి, ఎక్కువ విషయాన్ని తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉన్నవారికి ఈ స్పీడ్ రీడింగ్ ది కొంత ప్రయోజనకరంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలిందని చెప్తున్నారు. ఆరోగ్యకరమైన పఠనాశక్తి కలిగి ఉండాలంటే మాత్రం విషయంపట్ల అవగాహన అవసరం అని, అది మోతాదు ప్రకారం పెంచుకోవడమే అన్ని రకాలుగా శ్రేయస్కరమని అధ్యయనకారులు తేల్చి చెప్తున్నారు. -
ప్రైవేటు వైద్య ఫీజులు యధాతథం
హైదరాబాద్: ప్రైవేటు అన్ ఎయిడెడ్ నాన్ మైనారిటీ, మైనారిటీ వైద్య, దంత వైద్య పీజీ కోర్సుల ఫీజులను 2015-16 విద్యా సంవత్సరానికి యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కోర్సులకు సంబంధించి కన్వినర్ కోటా(50శాతం), మేనేజ్మెంట్ కోటా(50శాతం)ల సీట్లకు ప్రస్తుతం అమలులో వున్న ఫీజులే వచ్చే విద్యా సంవత్సరంలో కొనసాగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మన పోలీసులింతే!
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ముగ్గురు వ్యక్తులు నగరం నడిబొడ్డున ఆటోలో వెళ్తున్న అమ్మాయిలపై చేతులేశారు. అసభ్య చేష్టలతో హడలెత్తించారు. దుండగుల్ని పట్టించడానికి ఆటోడ్రైవర్ ట్రాఫిక్ పోలీసుల నుంచి ఏసీపీ వరకు అందర్నీ సంప్రదించాడు. ఏ దశలో ఎవరూ కనీసం స్పందించలేదు. ఏదైనా ఘటన జరిగితే నానా హడావుడి చేసే రక్షకభటులు.. ఘటనకు కారకులైన వారు దొరికే అవకాశం ఉన్నా పట్టుకోవడానికి ప్రయత్నించలేదు. ఇది అభాగ్య నగరంలో మహిళలు, యువతలకున్న భద్రతలోని డొల్లతనాన్ని తెలిపే ఉదంతం.. వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంపట్నానికి చెందిన రవీంద్రగౌడ్ ఆటోడ్రైవర్. శనివారం రాత్రి 7.30 సమయంలో మాదాపూర్ తీసుకెళ్లేందుకు సోమాజిగూడలో ముగ్గురు మహిళల్ని ఆటో ఎక్కించుకున్నాడు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద సిగ్నల్ పడడంతో ఆటో ఆగింది. అక్కడి ఫుట్‌పాత్‌పై ఉన్న ముగ్గురు యువకులు.. అందరూ చూస్తుండగానే ఆటోలో ఉన్న యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, చేతులేస్తూ ఇబ్బందికి గురి చేశారు. ఆటోడ్రైవర్ వారిస్తున్నా వినకుండా తమ ఆగడాన్ని కొనసాగించారు. ఎలాగో వారి బారి నుంచి తప్పించి ఆటోడ్రైవర్ ముగ్గురు యువతుల్ని గమ్యానికి చేర్చి.. తిరిగి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్దకు చేరాడు. అంత క్రితం అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు యువకుల గురించి గాలించాడు. సమీపంలోని బస్టాపులో కూర్చొని మద్యం తాగుతుండటాన్ని గమనించి అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులకు చెప్పాడు. శాంతిభద్రతల పోలీసులకు చెప్పాలని వారు నిర్లక్ష్యంగా బదులిచ్చారు. కనీసం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ ఫోన్ నెంబర్ ఇవ్వాలని కోరితే విసుక్కున్నారు. దీంతో ఆటోడ్రైవర్ ‘సాక్షి’ విలేకరి ద్వారా బంజారాహిల్స్ ఏసీపీ అశోక్‌కుమార్ నెంబర్ సంపాదించాడు. ఆయనకు విషయాన్ని చెప్పగా, జూబ్లీహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయాలని సూచించారు. ఆయనకు జరిగిన ఘటన చెప్పి, ముగ్గురు యువకులు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిపాడు. పది నిమిషాల్లో పోలీసులను పంపిస్తానని సదరు ఇన్స్పెక్టర్ చెప్పగా.. అరగంటైనా ఎవరూ రాలేదు. అప్పటికే ఫూటుగా తాగిన దుండగులు తాపీగా జారుకున్నారు. ఆటోడ్రైవర్ రవీంద్రగౌడ్ పడిన తాపత్రయం చూసిన వారంతా.. పోలీసుల నిర్వాకమింతేనని వ్యాఖ్యానించారు. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని రవీంద్ర తెలిపారు. ఘటనకు పాల్పడినవారు యాచకులై ఉంటారని స్థానికులు చెబుతున్నారు.


