breaking news
under 18 tennis
-
రన్నరప్ అపురూప్ రెడ్డి
సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత అండర్–18 సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రాష్ట్రానికి చెందిన అపురూప్ రెడ్డి, భక్తి షా ఆకట్టుకున్నారు. త్రివేండ్రమ్‌లో జరిగిన ఈ టోర్నీలో అపురూప్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రన్నరప్‌గా నిలిచి రెండు పతకాలను సాధించగా... భక్తి డబుల్స్ విభాగంలో రజత పతకాన్ని దక్కించుకుంది. బాలుర సింగిల్స్ ఫైనల్లో వీఎం సందీప్ (తమిళనాడు) 3–6, 6–3, 6–1తో పి. అపురూప్ రెడ్డి (తెలంగాణ)పై గెలుపొంది విజేతగా నిలిచాడు. డబుల్స్ ఫైనల్లో అపురూప్‌రెడ్డి – సంజయ్ (కేరళ) ద్వయం 4–6, 4–6తో ఎస్. భూపతి–వీఎం సందీప్ (తమిళనాడు) జంట చేతిలో పరాజయం పాలై రన్నరప్‌గా నిలిచింది. బాలికల డబుల్స్ ఫైనల్లో ఆలియా జుబేర్ (మహారాష్ట్ర)–భక్తి షా (తెలంగాణ) జంట 3–6, 4–6తో త్రిష (కేరళ)– ప్రేరణ (మహారాష్ట్ర) జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని దక్కించుకుంది. -
సాయికార్తీక్‌కు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సిరీస్ అండర్-18 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు సాయి కార్తీక్ రెడ్డి టైటిల్‌ను కై వసం చేసుకున్నాడు. భారతీయ విద్యా భవన్ స్కూల్‌కు చెందిన కార్తీక్ ఫైనల్ మ్యాచ్‌లో 7-6, 6-4తో కిరణ్ దేవ (తమిళనాడు)పై విజయం సాధించాడు. ఇటీవలే భవన్స జూనియర్ కాలేజ్‌లో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ అండర్ -19 టోర్నీలో కార్తీక్ పసిడి పతకాన్ని... ఇండస్ స్కూల్లో జరిగిన సౌత్‌జోన్ సీబీఎస్ఈ టెన్నిస్ టోర్నమెంట్లో రజత పతకాన్ని సాధించాడు.