breaking news
Uncomplete
-
అరకొర శిక్షణ ద్వారా ప్రయోజనం శూన్యం
ఎమ్మెల్యే రాజేశ్వరి రంపచోడవరం : గిరిజన యువతకు అరకొర శిక్షణ ద్వారా ప్రయోజనం లేదని వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. స్థానిక బీఎస్ఆర్ వికాస, నన్నయ వర్సిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన యువతకు కోట్లాది రూపాయాలు ఖర్చు తో శిక్షణ ఇస్తున్నా వారికి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పిం చడం లేదని ఆరోపించారు. విజయనగరంలో ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులకు శిక్షణకు వెళ్లిన వారికి వసతి సదుపాయం కల్పించలేదన్నారు. నిరుద్యోగులు డబ్బులు ఖర్చు చేసుకుని ఎక్కడ ఉంటారని ఆరోపించా రు. ఐటీడీఏ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు లెక్కలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు ఉపయోగం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే దిశగా శిక్షణ ఇవ్వాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబూరమేష్ మాట్లాడుతూ 2013 సంవత్సరంలో డిగ్రీ ఉత్తీర్ణులైన వారిని కూడా శిక్షణకు అనుమతించాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ బి సువర్ణకుమార్,ఎంపీటీసీ కారుకోడి పూజా, వికాస టీపీఓ సాగర్, బీఎస్ఆర్ ప్రిన్సిపాల్ జె.ప్రసాద్ వికాస ప్రాజెక్టు అధికారి జి.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అసంపూర్తి..అస్తవ్యస్తం
–కొనసా...గుతున్న పుష్కరఘాట్ల పనులు –గడువు మరో నాలుగు రోజులే –నాణ్యతకు తిలోదకాలిస్తున్న కాంట్రాక్టర్లు –వర్షాలకు –మట్టికొట్టుకుపోతున్న రోడ్లు గడువుల మీద గడువులు దాటిపోతున్నాయి. పనులు మాత్రం నత్తకు నడకలు నేర్పుతున్నాయి. జిల్లాలోని 52 ఘాట్లలో ఎక్కడా పూర్తిస్థాయిలో పనులు కాలేదు. పుష్కరాలు 12వ తేదీన ప్రారంభంకానున్నాయి. గడువు ముంచుకొస్తుండడంతో కాంట్రాక్టర్లు పైపై పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఓ వైపు కష్ణమ్మ పవరళ్లు తొక్కుతోంది. పుష్కరఘాట్ల మీదుగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులు జిల్లాలోని ఘాట్లకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు పనులు ఏ మేరకు జరిగాయో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ఆదివారం పలు ఘాట్లను విజిట్ చేసింది. అనేకచోట్ల కొనసాగుతున్న ఘాట్ల పనులు. పునాదులు దాటని మరుగుదొడ్లు.. చిన్న జల్లులకు మట్టికొట్టుకుపోయిన రోడ్లు.,.కొన్ని చోట్ల ప్రారంభించని పార్కింగ్ పనులు..ఇవీ.. కనిపించిన దశ్యాలు. పుష్కరాలకు మరో నాలుగు రోజులే గడువు ఉంది. ఈలోగా పనులు ఎలా పూర్తిచేస్తారన్నది అటు కాంట్రాక్టర్లు.. ఇటు అధికారులకే తెలియాలి. హడావుడిగా పనులు పెబ్బేరు : ఎలాగైనా గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో మండలంలో కాంట్రాక్టర్లు హడావిడి పనులు చేస్తూ కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారు. శ్రీరంగాపూర్ వీఐపీ ఘాట్ వద్ద రూ.6.2కోట్లతో చేపడుతున్న ఇంకా మరుగుదొడ్లు, తాగునీటి పనులు, దుస్తులు మార్చుకునే గదులు, సీసీబెడ్ నిర్మాణాలు పూర్తికానేలేదు. రూ.2.8కోట్లతో ఏర్పాటు చేస్తున్న వాహనాల పార్కింగ్ పనులు పూర్తి కాలేదు. ఇక్కడ నల్లరేగడి భూములు ఉండడంతో పార్కింగ్ చేసే స్థలంలో మట్టిని తీసివేసి ఎర్రమట్టితో నింపి రోలింగ్ చేయాల్సి ఉంది. కానీ నది పక్కనే ఉన్న సుద్దమట్టిని పరిచి రోలింగ్ చేస్తున్నారు. అలాగే మునగమాన్ దిన్నె పుష్కరఘాట్ వద్ద పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. బీటీ రోడ్డు పనులు పూర్తి కాలేదు. తాగునీటి, మరుగుదొడ్ల పనులు సైతం పునాదుల్లోనే ఉన్నాయి. రంగాపూర్ నుంచి జనుంపల్లి మీదుగా వేసిన బీటీ వారానికే దెబ్బతింది. జనుంపల్లి నుంచి మునగమాన్‌దిన్నె ఘాట్‌వద్దకు వేస్తున్న బీటీ రోడ్డులో నాణ్యత కరువైంది. కొన...సాగుతున్న పనులు అలంపూర్ : మండలంలోని గొందిమల్ల పుష్కర ఘాట్ వద్ద పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీఐపీ పుష్కర ఘాట్‌కు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం పిండ ప్రదానాల స్థలం, దుస్తులు మార్చుకునే గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర పనులు పూర్తి కాలేదు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో రూ.9.5 లక్షలతో గొందిమల్ల ఘాట్ వద్ద 48మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మిస్తున్నారు. ఇక్కడ షెడ్లు పూర్తయినా నీటి పైపులైన్, ఇతర పనులు జరగాల్సి ఉంది. రూ.18 లక్షలతో తాగునీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్లకు ఇరువైపు నీటి ట్యాంకులు ఏర్పాటుచేశారు. వాటికి రంగులు వేయడం, కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. పుష్కర ఘాట్ వద్ద వాహనాలు, ఆర్టీసీ బస్సుల కోసం రూ.1.5కోట్లతో పార్కింగ్ పనులు జరుగుతున్నాయి. లో–లెవల్ ఘాట్ పనులు కొలిక్కి వచ్చినా, హై–లెవల్ ఘాట్ పూర్తి కాలేదు. మరో రెండు రోజుల్లో పనులన్నీ పూర్తి చేయిస్తామని ఏఈలు రవికుమార్, శ్రీనివాసులు తెలిపారు. నిఘా లోపం... దగా అధికం.. నది అగ్రహారం దగ్గర జరుగుతున్న పుష్కర పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ల లాభాపేక్ష, అధికారుల నిఘాలోపం ఫలితంగా అనేక అభివద్ధి పనుల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మితిమీరిన రాజకీయ జోక్యంతో కాంట్రాక్టర్లు నాణ్యతను ఏకోశాన పట్టించుకోలేదు. రక్షణ కడ్డీలు కొన్నిచోట్ల ప్రారంభం కాకుండానే విరిగిపోయాయి. మరికొన్ని చోట్ల నీటి ఉధతికి కొట్టుకుపోయాయి. పిండప్రదానం చేసే ఘాట్ పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం ఊసేలేదు. తాగునీటి వసతి సింటెక్స్ ట్యాంకుల ఏర్పాటు కోసం దిమ్మెల నిర్మాణం నాసిరకంగా సాగుతుంది. రెండుచోట్ల మాత్రమే కుళాయిలు బిగించారు. ఆలయాల అభివద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యుత్ స్తంభాల ఏర్పాటు కొనసాగుతుంది. పార్కింగ్ స్థలాల్లో ఏర్పాటు చేసే మట్టి రోడ్లు నామమాత్రంగా ఉన్నాయి. దుస్తులు మార్చుకోవడానికి ఇప్పటి వరకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు జరగలేదు. ప్రణాళికలకు పాతర మాగనూర్ : మండలంలోని వాసునగర్, కష్ణ, తంగిడి, ముడుమాల్ గ్రామాల్లోని పుష్కరఘాట్ల నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం జరగడంలేదు. ఘాట్లకు వచ్చే భక్తుల రాకపోకలకు రోడ్ల నిర్మాణాలను గతనెల క్రితమే చేపట్టినా అవి నేటికీ పూర్తికాలేదు. మిగిలిన నాలుగు రోజుల్లో పనులు పూర్తికాకుంటే వేలాదిగా వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. నల్లగట్టు – కష్ణ, అలాగే కష్ణ – తంగిడి వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు, చెక్‌పోస్టు–వాసునగర్ సీసీ రోడ్డు, కష్ణ నుంచి పుష్కరఘాట్వెళ్లే తాత్కాలిక పనులు పూర్తికాలేదు. అలాగే తాగునీరు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ స్థలాల పనులుకూడా ఈ నాలుగు రోజుల్లో పూర్తయ్యేలా కనిపించడంలేదు. అసలు భక్తులు ఎక్కువగా ఉండేచోట కాకుండగా ఎక్కడ పడితే అక్కడ నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు సూచించినా కాంట్రాక్టర్లు పెడచెవిన పెట్టారు.