breaking news
umesh chandra
-
మహేశ్ బ్యాంక్ ఎండీకి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: ఏపీ మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఎండీ ఎ.ఉమేశ్‌చంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. ఉమేశ్‌చంద్రపై నమోదు చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును నిలిపివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేశారని, ఈ కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇచ్చిన సమన్లను సవాల్ చేస్తూ ఉమేశ్‌చంద్ర దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. బ్యాంకు పాలకమండలి ఎన్నిక సందర్భంగా నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేయడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. ఇది ఈడీ దర్యాప్తు నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ మేరకు స్పందించిన న్యాయమూర్తి... తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు దర్యాప్తు నిలిపివేయాలని, అలాగే ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
ఉత్తమ పోలీస్ అధికారులు చిరంజీవులు
-ప్రజలు ఎప్పుడూ మరచిపోలేరు -ఐపీఎస్ అధికారి ఉమేష్‌చంద్ర దీనికి నిదర్శనం - సంస్మరణ సభలో గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ తెనాలి తమకు మంచి చేసిన పోలీసు అధికారులను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని, అందుకు ఐపీఎస్ అధికారి ఉమేష్‌చంద్ర నిదర్శనమని గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ చెప్పారు. మావోయిస్టుల కాల్పుల్లో మృతిచెందిన యువ ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేష్‌చంద్ర 17వ వర్ధంతి రోజయిన ఆదివారం తెనాలిలో సంస్మరణ సభను నిర్వహించారు. ఏటా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర విభజనతో స్వస్థలమైన తెనాలికి మార్పుచేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌తో కలిసి ఇక్కడి చెంచుపేటలోని తెనాలి-నారాకోడూరు రోడ్డులోగల ఉమేష్‌చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పద్మావతి కళ్యాణమండపంలో సంస్మరణసభకు ఉమేష్‌చంద్ర తండ్రి సి.వేణుగోపాలరావు స్వాగతం పలికారు. ఐజీ సంజయ్ ప్రసంగిస్తూ... అధికారిగా మావోయిస్టులను ఎదుర్కొనే వ్యూహాలనే కాకుండా ప్రత్యేకంగా కళాబృందాలను ఏర్పాటుచేసి ప్రజాచైతన్యానికి ఉమేష్‌చంద్ర కృషిచేసినట్టు చెప్పారు. ప్రజలు సంక్షేమానికి, శాంతిభద్రతల పరిరక్షణకు, పోలీసు ఉద్యోగుల సంక్షేమానికి కూడా తనదైన ప్రత్యేకతతో పనిచేశారని వివరించారు. ఉమేష్‌చంద్ర స్ఫూర్తితో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ పోలీసు విధులు నిర్వర్తించాలని సూచించారు. ట్రైనీ అధికారిగా వున్నపుడు ఉమేష్‌చంద్రను కలిసిన జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తన ప్రసంగంలో ఉమేష్‌చంద్ర ధైర్యసాహసాలను కొనియాడారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ, గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ నారాయణ నాయక్, అదనపు ఎస్పీ రామాంజనేయులు, తెనాలి ఆర్డీవో జి.నర్సింహులు తమ ప్రసంగాల్లో ఉమేష్‌చంద్ర సేవలను ప్రశంసించారు. నేటితరం యువత, పోలీసులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తొలుత రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉత్తమంగా విధులు అందిస్తున్న వివిధ కేటగిరిల పోలీసు ఉద్యోగులు, అధికారులను అతిధుల చేతులమీదుగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ప్రొబెషనరీ పోలీసులు 90 మంది ప్రత్యేకంగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాధ్, వివిధ రంగాల ప్రముఖులు కొత్త సుబ్రహ్మణ్యం, నన్నపనేని సుధాకర్, కొడాలి సుదర్శనబాబు, కంభంపాటి క్రాంతి, నిమ్మగడ్డ జనార్ధనరావు, ఉమేష్‌చంద్ర సతీమణి నాగరాణి, కుమారుడు భరత్ మోహన్ చంద్ర హాజరయ్యారు. కుటుంబసభ్యులు చదలవాడ హరినారాయణ, భుజంగరావు (చిన్నా), చదలవాడ సతీష్‌చంద్ర పర్యవేక్షించారు. -
ఏపీ ఆర్చరీ మాజీ సెక్రటరీ ఉమేశ్ చంద్ర మృతి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి ఉమేశ్ చంద్ర సక్సేనా (78) శనివారం సాయంత్రం మృతి చెందారు. ఏపీ సంఘానికి ప్రధాన కార్యదర్శిగాను, భారత ఆర్చరీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగాను ఆయన పని చేశారు. సక్సేనా హయాంలో రాష్ట్రంలో పలు జాతీయ ఆర్చరీ పోటీలు నిర్వహించారు. ఉమేశ్ చంద్ర మృతి పట్ల రాష్ట్ర ఆర్చరీ సంఘం అధ్యక్షుడు అనిల్ కామినేని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈనెల 8 నుంచి ఫుట్‌బాల్ టోర్నీ సికింద్రాబాద్ ఓల్డ్ బొల్లారం యూత్ ఫుట్‌బాల్ క్లబ్ ఆధ్వర్యంలో 7-ఏ సైడ్ ఓపెన్ ఫుట్‌బాల్ టోర్నీ జరగనుంది. ఈ నెల 8 నుంచి ఓల్డ్ అల్వాల్ ప్లే గ్రౌండ్లో పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి గల జట్లు ఈ నెల 6లోగా తమ ఎంట్రీలను పంపించాలి. ఇతర వివరాలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ జాన్ విక్టర్ (77025-36075)ను సంప్రదించవచ్చు.