breaking news
Ultimate Kho Kho 2022
-
Ultimate Kho Kho 2022: ఖో–ఖో లీగ్ విజేత ఒడిశా జగర్‌నాట్స్
పుణే: చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఒడిశా జగర్‌నాట్స్ పైచేయి సాధించి అల్టిమేట్ ఖో–ఖో లీగ్ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఒడిశా జగర్‌నాట్స్ 46–45తో ఒక్క పాయింట్ తేడాతో తెలుగు యోధాస్ జట్టును ఓడించింది. మ్యాచ్ ముగియడానికి 14 సెకన్లు ఉన్నాయనగా తెలుగు యోధాస్ 45–43తో రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఈ దశలో ఒడిశా ప్లేయర్ సూరజ్ అద్భుతమైన డైవ్ చేసి తెలుగు యోధాస్ ప్లేయర్ అవధూత్ పాటిల్‌ను అవుట్ చేసి మూడు పాయింట్లు స్కోరు చేశాడు. దాంతో ఒడిశాకు చిరస్మరణీయ విజయం సొంతమైంది. విజేతగా నిలిచిన ఒడిశా జట్టుకు రూ. కోటి ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్ తెలుగు యోధాస్‌కు రూ. 50 లక్షలు... మూడో స్థానంలో నిలిచిన గుజరాత్ జెయింట్స్‌కు రూ. 30 లక్షలు లభించాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు రామ్‌జీ కశ్యప్ (చెన్నై క్విక్‌గన్స్; రూ. 5 లక్షలు).. ‘బెస్ట్ అటాకర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు అభినందన్ పాటిల్ (గుజరాత్; రూ. 2 లక్షలు)... ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దీపక్ మాధవ్ (తెలుగు యోధాస్; రూ. 2 లక్షలు)... ‘యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు మదన్ (చెన్నై క్విక్‌గన్స్; రూ. 2 లక్షలు) గెల్చుకున్నారు. -
Ultimate Kho Kho 2022: తెలుగు యోధాస్ గెలుపు.. అరంగేట్ర సీజన్లో తొలి జట్టుగా!
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో భాగంగా రాజస్తాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు యోధాస్ 83–45తో నెగ్గింది. ఈ టోర్నీలో తెలుగు యోధాస్కిది మూడో విజయం. అటాకర్ సచిన్, డిఫెండింగ్ అరుణ్ తమ ప్రదర్శనతో తెలుగు యోధాస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం తెలుగు యోధాస్ 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో 83 పాయింట్లు స్కోరు చేసిన తెలుగు యోధాస్.. అల్టిమేట్ ఖో-ఖో తొలి సీజన్లో ఇప్పటి వరకు 80+ పాయింట్లు సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో సచిన్ భార్గో బెస్ట్ అటాకర్‌గా నిలిచాడు. అరుణ్ గుంకీకి బెస్ట్ డిఫెండర్ అవార్డు దక్కింది. ఇక మంగళవారం(ఆగష్టు 23) తెలుగు యోధాస్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. ముంబై ఖిలాడీస్‌తో తలపడనుంది. చదవండి: Ned Vs Pak 3rd ODI: పాపం.. జస్ట్ మిస్! ఆ తొమ్మిది పరుగులు చేసి ఉంటే! కనీసం.. IND vs ZIM 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి