breaking news
UK jailed
-
నీరవ్ ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.253.62 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న నీరవ్ కంపెనీలకు చెందిన రత్నాలు, నగలు, బ్యాంక్ డిపాజిట్లను జప్తు చేసినట్లు తెలిపింది. సుమారు రూ.16వేల కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో ప్రస్తుతం యూకేలో జైలు శిక్ష అనుభవిస్తున్న నీరవ్‌ను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు తుదిదశలో ఉన్నట్లు పేర్కొంది. తాజా జప్తుతో కలిపి నీరవ్‌కు చెందిన మొత్తం రూ.2,650 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లయిందని వివరించింది. -
గ్యాంగ్ లీడర్ చౌదరికి 12 ఏళ్ల జైలు శిక్ష
మహిళల అక్రమ రవాణా కేసులో భారతీయ సంతతికి చెందిన గ్యాంగ్‌లీడర్ విశాల్ చౌదరి (35) కి బ్రిటన్ కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాదాపు 100 మందికి పైగా మహిళలను బ్రిటన్ తరలించడమే కాకుండా వారితో బలవంతంగా వ్యభిచారం చేయించినట్లు విశాల్‌పై నమోదైన నేరం రుజువైందని పేర్కొంది. విశాల్‌తోపాటు అతడికి సహాకరించిన నలుగురితోపాటు మరో మహిళకు లండన్ కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. నిందితులలో విశాల్ సోదరుడు కునాల్ చౌదరికి 5 ఏళ్లు, మహిళ సిజల్వియా అబెల్ 3 ఏళ్లు, ఆమె సోదరుడు క్రిస్జిటియన్ అబెల్ 10 ఏళ్లు, అట్టిల్లా కోవాస్ 6 ఏళ్లు బ్రిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం ఆరోపణలపై విశాల్, కునాల్ చౌదరిలతోపాటు మరో ముగ్గురుని గతే ఏడాది మొదట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బిబిసి ఓ కథనాన్ని వెలువరించింది.