breaking news
UK boy
-
ఫేస్బుక్లో అమ్మాయి ఫోన్నంబర్తో దుశ్చర్య
లండన్: తన మాట వినని అమ్మాయిపై కక్ష తీర్చుకునేందుకు ఓ యువకుడు ఫేస్బుక్లో ఆమె ఫోన్ నంబర్‌ను ఓ సెక్స్ వీడియోతో కలిపి పోస్టు చేశాడు. 'మీరు ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే.. ఆమె మీతో శృంగారంలో పాల్గొంటుంది' అని ఆ పోస్టులో రాశాడు. ఈ ఘటనకు సంబంధించిన కేసు బ్రిటన్‌లోని మిన్షుల్ స్ట్రీట్ క్రౌన్ కోర్టు ఎదుటకు ఇటీవల వచ్చింది. సోషల్ మీడియాలో ఈ దుశ్చర్యకు పాల్పడిన యువకుడిని 18 ఏళ్ల షాన్ స్టాట్గా గుర్తించారు. అతడు ఫేస్బుక్లో ఓ అమ్మాయితో మాట్లాడాడు. 'హాయ్' అని మాట కలిపి.. ఆ తర్వాత తనను కలిసేందుకు రావాల్సిందిగా కోరాడు. అందుకు ఆమె నుంచి బదులు రాలేదు. దీంతో చికాకు పడిన అతను అసభ్యకర ఫొటోలు ఫేస్బుక్లో పోస్టు చేసి.. అవి నీవేనని అంటానని ఆ అమ్మాయిని బెదిరించాడు. దీంతో ఆమె అతన్ని బ్లాక్ చేసింది. ఇంకా బరితెగించిన స్టాట్ ఆ అమ్మాయి ఫోన్ నంబర్‌ను ఓ సెక్స్ వీడియోతో కలిపి పోస్టు చేశాడని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఆమెకు వెంటవెంటనే 25 నుంచి 30 కాల్స్ వచ్చాయని నివేదించారు. అయితే తన క్లయింట్ స్టాట్కు ఇంకా మానసిక పరిణితి రాలేదని, అతను 10, 13 ఏళ్ల వాడిలాగా ప్రవర్తించాడని డిఫెండింగ్ న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడు స్టాట్ యువ నేరస్తుల గృహంలో నాలుగేళ్ల శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా అతని పేరును లైంగిక నేరస్తుల జాబితాలో నిరవధికంగా కొనసాగించాలని ఆదేశించింది. -
గుండు చేయించుకున్నందుకు శిక్ష!
లండన్:ఓ 14 ఏళ్ల బాలుడు చేపట్టిన సేవా కార్యక్రమం కాస్తా అతనికి శాపంగా మారింది. యూకేకు చెందిన స్టాన్ లాక్ అనే బాలుడు ప్రాణాంతక క్యాన్సర్ కు నిధులు సమీకరించాలని తలపెట్టాడు. అందులో భాగంగానే తన తలపై జట్టును తొలగించుకుని నున్నటి గుండుతో ఫండ్స్ సమీకరించే పనిలో పడ్డాడు. ఆ బాలుడు అలా దర్శనమివ్వడం అతను చదువుతున్న స్కూల్ నిబంధనలను అతిక్రమించడమేనట. దీంతో బాలునిపై స్కూల్ యాజమాన్యం క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఆ బాలున్ని ఒక గదిలో బంధించి ఉంచింది. తిరిగి జట్టు పెరిగే వరకూ ఆ బాలుడు స్కూల్ పిల్లలకు దూరంగా ఉండాలని యాజమాన్యం స్పష్టం చేసింది. ఆ బాలుడు క్యాన్సర్ పై అవేర్ నెస్ ను తీసుకురావడానికి చేసిన ప్రయత్నం అతని చదువుకి తీవ్ర అడ్డంకిగా మారింది. ఇదిలా ఉండగా ఆ బాలుడు క్యాన్సర్ నిధులను దాదాపు 500 డాలర్లు(రూ.ముప్ఫై వేలు) లను సేకరించడం గమనార్హం.