breaking news
TVS and Sons
-
రచ్చకెక్కిన టీవీఎస్ ఫ్యామిలీ వార్
దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజమైన టీవీఎస్ గ్రూప్ కుటుంబంలో ఆస్తుల పంపిణీకి సంబంధించిన విభేదాలు రచ్చకెక్కాయి. సుదర్శన్ శ్రీనివాసన్, లక్ష్మీ వేణుల మధ్య ఆర్థిక యాజమాన్య హక్కుల విభజన ప్రక్రియ సజావుగా సాగడం లేదని స్పష్టమవుతోంది. వేణు శ్రీనివాసన్ కుటుంబంలో ఆర్థిక సమానత్వం, అన్-లిస్టెడ్ ఆస్తుల మూల్యాంకనం, పన్నుపరమైన చిక్కులు ఈ వివాదానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.పరిష్కారం కాని ఆర్థిక యాజమాన్య హక్కులుమల్లికా శ్రీనివాసన్, డాక్టర్ లక్ష్మీ వేణు ఉమ్మడిగా విడుదల చేసిన ప్రకటనలో.. 2020లో టీవీఎస్ గ్రూప్ స్థాయి ప్రమోటర్ల మధ్య జరిగిన వ్యాపారాల విభజన ఒప్పందం వేరు, తమ కుటుంబ అంతర్గత ఆస్తుల పంపిణీ వేరని స్పష్టం చేశారు. కుటుంబ ఆస్తులన్నీ కేవలం ఒకే వ్యక్తికి చెందుతాయని, వారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోగలరనే వాదన సరికాదని పేర్కొన్నారు. మేనేజ్మెంట్ బాధ్యతలకు తగిన పారితోషికం లభించినప్పటికీ అసలైన ఆర్థిక ఆస్తుల పంపిణీ ఇప్పటికీ ముగింపునకు రాలేదని తెలిపారు.వివాదం నేపథ్యంటీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్ సుదర్శన్ వేణు, ఆయన సోదరి లక్ష్మీ వేణు మధ్య కుటుంబ ఆస్తుల పంపిణీ విషయంలో స్పష్టత కొరవడింది. ట్రస్ట్ నిర్మాణాలు, హోల్డింగ్ కంపెనీలలో తమకు తగిన సమాన ఆర్థిక హక్కులు రావాలని లక్ష్మీ వేణు పక్షం కోరుతుండగా, యాజమాన్య నియంత్రణకు సంబంధించి భిన్నాభిప్రాయాలు తలెత్తాయి.2024 మార్చిలో కుటుంబ సభ్యుల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కేవలం బ్రాండ్ వినియోగం, పోటీ వ్యాపారాలకు దూరంగా ఉండటం వంటి నిబంధనలకే పరిమితమైందని, అంతేకాని అది కుటుంబ సంపద లేదా ఆస్తుల ఆర్థిక పరిష్కారానికి సంబంధించిన ఒప్పందం కాదని లక్ష్మీ వేణు, తల్లి మల్లికా శ్రీనివాసన్ స్పష్టం చేయడంతో ఈ వివాదం బహిర్గతమైంది.కంపెనీల విలువల్లో వ్యత్యాసంటీవీఎస్ మోటార్స్, టీవీఎస్ హోల్డింగ్స్ వంటి సంస్థల మార్కెట్ విలువలు వేల కోట్లలో ఉండటం, భవిష్యత్ వారసత్వ ప్రణాళికలో భాగంగా ట్రస్టుల ద్వారా ప్రయోజనాలు ఒకరికే మెజారిటీగా దక్కేలా ఏర్పాట్లు జరుగుతున్నాయనే చర్చ రావడంతో కుటుంబ ఆస్తుల సమాన పంపిణీ అంశం తెరపైకి వచ్చింది.అన్-లిస్టెడ్ ఆస్తులు, పన్ను నిబంధనల చిక్కులులిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువను సులభంగా నిర్ణయించగలిగినప్పటికీ కుటుంబానికి చెందిన పలు అన్-లిస్టెడ్ ఆస్తులు, హోల్డింగ్ కంపెనీల షేర్ల విలువను పారదర్శకంగా లెక్కించడం సవాలుగా మారింది. దీనితో పాటు, ఆస్తులు, షేర్ల బదిలీ సమయంలో ఎదురయ్యే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ సంబంధిత చిక్కులు ఈ విభజన ప్రక్రియను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఏకాభిప్రాయంతో సమస్యను పరిష్కరించుకోవడానికి ఇప్పటివరకు ప్రయత్నించామని అయితే బయటకు వస్తున్న కథనాల దృష్ట్యా వాస్తవాలను వెల్లడించాల్సి వచ్చిందని లక్ష్మీ వేణు, మల్లికా శ్రీనివాసన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం.. ధరాభారం ఖతం! -
రెనో చిన్న కారు మే 20న వస్తోంది...
పాత కార్ల విక్రయాల్లోకి ప్రవేశిస్తున్నాం - కార్లెస్ షోరూంలు ఏర్పాటు - రెనో వైస్ ప్రెసిడెంట్ రాఫెల్ ట్రెగ్వెర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో గత కొన్నేళ్లుగా ఊరిస్తున్న చిన్న కారుకు ముహూర్తం ఖరారైంది. 800 సీసీ సామర్థ్యంతో రూపొందుతున్న ఈ కారును ముందుగా భారత్‌లో ప్రవేశపెడుతున్నారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, బ్రెజిల్ తదితర దేశాల్లో విడుదల చేయనున్నారు. మే 20న చెన్నైలో ఆవిష్కరిస్తున్న విషయాన్ని రెనో ఇండియా సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రాఫెల్ ట్రెగ్వెర్ ధ్రువీకరించారు. మల్టీ పర్పస్ వెహికిల్ రెనో లాడ్జీ మోడల్‌ను హైదరాబాద్ మార్కెట్లో గురువారం విడుదల చేసిన సందర్భంగా ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. కాగా, చిన్న కారు జూన్-జూలైకల్లా భారతీయ రోడ్లపై పరుగు తీయనుందని సమాచారం. రెనో ఒక మోడల్‌ను భారత్‌లో ఆవిష్కరించడం కూడా ఇదే మొదటిది. కారు ధర రూ.2.5-4 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కార్యకక్రమంలో పంపిణీ సంస్థ శ్రీశ్రీశ్రీ రెనాల్ట్స్ ఎండీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్లు లేని షోరూంలు.. భారత్‌లో టీవీఎస్ అండ్ సన్స్ సహకారంతో డిజిటల్ షోరూంలను రెనో తెరవనుంది. కార్లకు బదులుగా షోరూంలో తెరను ఏర్పాటు చేస్తారు. కస్టమర్ తనకు కావాల్సిన మోడళ్లను ఆ స్క్రీన్‌పై వీక్షించొచ్చు. అలాగే పాత కార్ల విక్రయాల్లోకి కంపెనీ ప్రవేశిస్తోంది. వారం రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. హైదరాబాద్‌తోసహా ఏడు నగరాల్లో డీలర్లను నియమించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. 5 శాతం వాటా లక్ష్యం..: కంపెనీ 2014లో దేశంలో సుమారు 50 వేల వాహనాలను విక్రయించింది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 7 శాతం. ఇక భారత్‌లో రెనోకు 2 శాతం మార్కెట్ వాటా ఉంది. 2016 నాటికి 5 శాతం లక్ష్యంగా చేసుకున్నట్టు రాఫెల్ చెప్పారు. 2015లో కొత్తగా 45 డీలర్లను నియమిస్తున్నట్టు తెలిపారు. చెన్నై సమీపంలోని రెనో-నిస్సాన్‌ల సంయుక్త ప్లాంటు వార్షిక సామర్థ్యం 4.8 లక్షల యూనిట్లు. ప్లాంటు విస్తరణకు ఇరు సంస్థలు రూ.5,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి.


