breaking news
TV coverage
-
ఆ వార్తను పదే పదే చూసి...
న్యూస్ ఛానెళ్లలో ప్రసారం అవుతున్న ఒకే వార్తను పదే పదే చూసిన ఓ వ్యక్తి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికే డిప్రెషన్లోకి వెళ్లిపోగా.. ఆ కథనాలు అతనిపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఆ పెద్దాయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ ఆత్మహత్య ఘటనల ఉదంతం కేసులో దర్యాప్తు కొనసాగుతున్న విషయం విదితమే. ఇదిలా ఉంటే గోరెగావ్‌కు చెందిన 63 ఏళ్ల కృష్ణశెట్టి అనే వ్యక్తి మూడేళ్ల క్రితం వ్యాపారంలో భారీగా నష్టాలు రావటంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఇంటికే పరిమితమైన ఆయన.. బురారీ ఫ్యామిలీ సూసైడ్ కథనాలను టీవీలో రెప్పవేయకుండా చూస్తూ వస్తున్నాడు. వద్దని భార్య, కూతురు ఎంత వారించినా కృష్ణ పట్టించుకోలేదు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనై శుక్రవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘ఆ కుటుంబం(భాటియా ఫ్యామిలీ) చేసింది నిజంగానే సాహసం. చావటానికి చాలా ధైర్యం కావాలి’ అని తరచూ తమతో చెప్పేవాడని కృష్ణ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన శుభంగి పారేకర్ అనే మానసిక వైద్యుడు ఇలాంటి కథనాల విషయంలో సున్నితత్వం పాటించాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
టీవీ కవరేజి ఉంటేనే మహిళల క్రికెట్‌కు ఆదరణ: మిథాలీ రాజ్
జొహన్నెస్‌బర్గ్: మహిళల క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంతోనే స్టేడియాల్లో ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉంటుందని భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ఆరోపించింది. నాలుగు దేశాల సిరీస్‌లో భాగంగా జరిగిన ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు చాలా తక్కువ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ‘భారత్‌లో అయితే మ్యాచ్‌లను చూసేందుకు చాలా మంది స్టేడియాలకు వస్తారు. మహిళల క్రికెట్‌ను మార్కెట్ చేసుకోవడం ముఖ్యం. ఏదైనా సిరీస్ ఆడినప్పుడు మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయాలి. అయితే వారికి మ్యాచ్‌లను వీక్షించే అవకాశం లేకపోవడంతో ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు’ అని మిథాలీ పేర్కొంది.