breaking news
turns back
-
ఇండిగో విమానంలో సమస్య
సాక్షి, న్యూఢిల్లీ: ఇండిగో విమానంలో మరోసారి ఇంజీన్ సమస్య తలెత్తడం కలకలం సృష్టించింది. ఢిల్లీ -ముంబై విమానంలో ప్రయాణం మధ్యలో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య వచ్చింది. గాల్లో ఉండగానే ఇంజీన్ ఒక్కసారిగా వైబ్రేట్ అవ్వడం మొదలుపెట్టింది. దీంతో ప్రయాణికులు తీవ్రం ఆందోళనకు లోనయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని వెనక్కి మళ్లించారు. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపై స్పందించిన ఇండిగో వివరణ ఇచ్చింది. పక్షి ఢీకొనడం వల్ల మెయిన్ ఇంజీనల్లో ఇబ్బంది ఏర్పడిందని వెల్లడించింది. మరోవైపు ఇండిగో విమానాల్లో ఇలాటి సమస్యలు రావడం, ఊగిపోవడం లాంటివి జరిగిన సందర్భాలు కనీసం 15 ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇండిగోలోని నియో ఇంజీన్‌లో సమస్యలు రావడం, మార్గం మధ్యలోనే వెనక్కి మళ్లించడం చాలా సాధారణంగా మారిపోయిందని, భద్రతా రీత్యా చాలా సీరియస్‌గా పరిగణించాల్సిన అంశమని పేర్కొన్నారు. -
పేర్లు తెచ్చిన తంటా....విమానం వెనక్కి
న్యూఢిల్లీ: ఒకరి లగేజీ బదులు మరొకరిది దించడంతో 135 మందితో ఢాకా వెళ్తున్న జెట్ ఎయిర్వేస్ విమానం శుక్రవారం ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయానికి తిరిగొచ్చింది. ఫాయ్సోల్ ఇస్లాం లండన్ నుంచి ఢిల్లీ మీదుగా ఢాకా ప్రయాణిస్తున్నాడు. కానీ ఆయన ఢిల్లీలో ఢాకా వెళ్లాల్సిన విమానం ఎక్కలేదు. మరో ప్రయాణికుడు పై ఇస్లాం కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఇద్దరి పేర్లు ఒకేలా ఉండటంతో గ్రౌండ్ సిబ్బంది పొరపాటున ఫాయ్సోల్ది కాకుండా పై ఇస్లాం లగేజీని దించేశారు. నిబంధనల ప్రకారం యజమాని లేకుండా వారి వస్తువులు విమానంలో ప్రయాణించడానికి వీల్లేదు. ఈ గజిబిజి జెట్ ఏయిర్‌వేస్ దృష్టికి రావడంతో విమానాన్ని వెనక్కి మళ్లించమని పైలట్‌ను ఆదేశించారు.