breaking news
Tulasi Shivamani
-
కార్తికేయ 2 సినిమా ఒక ఎత్తు.. ఆ ఒక్క స్పీచ్ మరో ఎత్తు: నటి
తెలుగు, తమిళ, కన్నడ.. ఇలా పలు ప్రాంతీయ భాషల్లో కలిసి దాదాపు 700 సినిమాలు చేసింది నటి తులసి. ఒకప్పుడు హీరోయిన్గా, తర్వాత క్యారెక్టర ఆర్టిస్టుగా రాణించిన ఆమె ఇటీవల ఎక్కువగా అమ్మ పాత్రల్లో ఒదిగితోంది. ఇటీవల బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన కార్తికేయ 2తో మరింత ఊపు మీదున్న ఆమె వరుస సినిమాలకు సంతకం చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తులసి మాట్లాడుతూ.. 'నేను 1967లో జన్మించాను. పుట్టిన మూడు నెలలకే నటించాను. మూడేళ్లకే డైలాగ్స్ చెప్పాను. అంటే 56 ఏళ్లుగా వెండితెరపై నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. నాలుగు స్తంభాలాట సినిమాలో అలీ హీరో, నేను హీరోయిన్. షూటింగ్ గ్యాప్‌లో అలీ నాకు సరదాగా సైట్ కొట్టేవాడు. ఇక కార్తికేయ 2 సినిమా విషయానికి వస్తే ఆ మూవీ సక్సెస్ ఒక ఎత్తయితే, ఆ సినిమా స్పీచ్ వల్ల నాకు బోలెడన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి' అని చెప్పుకొచ్చింది. చదవండి: ఫిజికల్ అన్నారంటే ఒక్కొక్కరి తోలు తీస్తా: రేవంత్ వార్నింగ్ సమంత గ్లిజరిన్ కూడా వాడదు: యశోద డైరెక్టర్స్ -
సక్సెస్ సెంటిమెంట్... ఈ అమ్మ!
నటి తులసి గుర్తున్నారా? ‘శంకరాభరణం’ నాటి బేబీ తులసి ఆ తరువాత కథానాయికగా కూడా కొంతకాలం ఆకట్టుకున్నారు. కొంతకాలం గ్యాప్ తరువాత ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’లో నటిస్తున్నారు. ‘‘చాలా రోజుల తరువాత సినిమాకు కీలకమైన ఒక ముఖ్య పాత్ర ధరిస్తున్నా’’ అని తులసి చెప్పారు. ఈ తరం యువ హీరోలకు తల్లి పాత్రల్లో నటిస్తున్నందుకు సహజంగానే ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గమ్మత్తేమిటంటే, సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబంతో చిరకాల అనుబంధమున్న తులసికి ఆ సంగతులు కూడా గుర్తే. మహేశ్‌బాబు చిన్నప్పుడు అతని పుట్టినరోజు వేడుకలకు హాజరైన సంగతులు ఇప్పుడు స్టార్ హీరో అయిన ఆయనకు ‘శ్రీమంతుడు’ సెట్స్‌లో జ్ఞాపకం చేశారట! ఆ సంగతులు చెప్పగానే మహేశ్ హాయిగా నవ్వేశారట! ‘‘వాళ్ళ నాన్న గారిలాగే మహేశ్ కూడా హడావిడి, ఆర్భాటం లేకుండా చాలా సాదాసీదాగా ఉంటాడు. అంత స్టారైనా కొద్దిగా కూడా గర్వం లేదు’’ అని తులసి చెప్పుకొచ్చారు. మహేశ్‌బాబు నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అంటే బాగా ఇష్టమంటున్న ఆమె, మహేశ్ నెక్స్ట్ ఫిల్మ్ ‘బ్రహ్మోత్సవం’ (దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల)లో కూడా ఒక ముఖ్యపాత్ర ధరిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, శ్రీకాంత్ అడ్డాల లాంటి దర్శకులు తెరపై చూపే కుటుంబ బంధాలు, గ్రామీణ వాతావరణం బాగుంటాయని ఆమె అన్నారు. ఆ దర్శకులు కూడా తమ స్క్రిప్టుల్లో తులసికి పాత్ర ఉండేలా చూడడం మరో విశేషం. మొత్తానికి, ఈ ‘శంకరాభరణం’ ఫేమ్ అమ్మగా నటించిన ‘జులాయి’, ‘డార్లింగ్’ల లాగే రానున్న ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’కి కూడా సక్సెస్ సెంటిమెంట్ వర్కౌటయ్యేలా ఉంది.