breaking news
Tube Investments
-
ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: మురుగప్ప గ్రూప్ కంపెనీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 299 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు ప్రభావం చూపాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 346 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 4,169 కోట్ల నుంచి రూ. 4,783 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 3,868 కోట్ల నుంచి రూ. 4,569 కోట్లకు పెరిగాయి. కాగా.. ఆదాయంలో ఇంజినీరింగ్ విభాగం నుంచి రూ. 1,323 కోట్లు లభించగా.. మెటల్ ఆధారిత ప్రొడక్టుల నుంచి రూ. 404 కోట్లు, మొబిలిటీ బిజినెస్ నుంచి రూ. 168 కోట్లు చొప్పున అందుకుంది. ఫలితాల నేపథ్యంలో టీఐఇండియా షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం పతనమై రూ. 4,312 వద్ద ముగిసింది. -
ఇండియామార్ట్- వీఎస్టీ టిల్లర్స్ హైజంప్
ఆగస్ట్‌లో పవర్ టిల్లర్లు, ట్రాక్టర్ల విక్రయాలు 57 శాతం జంప్‌చేసి 3,535 యూనిట్లను తాకినట్లు వెల్లడించడంతో వ్యవసాయ పరికరాల కంపెనీ వీఎస్టీ టిల్లర్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. తొలుత ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 1,770ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. తదుపరి కొంత వెనకడుగు వేసింది. ప్రస్తుతం 2.2 శాతం లాభపడి రూ. 1676 వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్‌లో 2,638 పవర్ టిల్లర్స్తోపాటు.. 897 ట్రాక్టర్లను విక్రయించినట్లు వీఎస్టీ టిల్లర్స్ తెలియజేసింది. ఈ ఏడాది తొలి 5 నెలల్లో 10,864 పవర్ టిల్లర్స్, 3,513 ట్రాక్టర్ల అమ్మకాలు సాధించినట్లు వివరించింది. ఇండియామార్ట్ ఇంటర్మెష్ ఈ ఏడాది క్యూ1లో పటిష్ట ఫలితాలు సాధించడం, ఎస్ఎంఈలు డిజిటల్ టెక్నాలజీవైపు మళ్లడం వంటి సానుకూల అంశాలతో ఇటీవల జోరు చూపుతున్న ఇండియామార్ట్ ఇంటర్మెష్ కౌంటర్ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో తొలుత 11 శాతం దూసుకెళ్లి రూ. 4,220ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 4,176 వద్ద ట్రేడవుతోంది. ఎస్ఎంఈలు అధికంగా వినియోగించే ఆన్లైన్ బీటూబీ క్లాసిఫైడ్ విభాగంలో మార్కెట్ లీడర్‌గా నిలుస్తుండటం ద్వారా కంపెనీ మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మూడు రోజులుగా ఈ కౌంటర్ లాభాలతో కదులుతోంది. గత రెండు నెలల్లోనే ఈ షేరు 98 శాతం ర్యాలీ చేయడం విశేషం! సీజీ పవర్ ఇప్పటికే ఈక్విటీ షేర్లు, వారంట్ల ద్వారా కంపెనీలో రూ. 700 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రతిపాదించిన ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ బోర్డు తాజాగా మరో రూ. 100 కోట్ల పెట్టుబడులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించడంతో సీజీ పవర్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 22.35 వద్ద ఫ్రీజయ్యింది. -
స్టాక్స్ వ్యూ
అతుల్ ఆటో బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.565 టార్గెట్ ధర: రూ.625 ఎందుకంటే: త్రి చక్రవాహనాల సెగ్మెంట్లో అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటి. వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల్లో కూడా ఇది ఒకటి. మూడు చక్రాల వాహన కేటగిరిలో ప్రయాణికుల వాహనాల నుంచి సరుకులు రవాణా చేసే వాహనాల వరకూ మొత్తం 45 రకాల మోడళ్లను అందిస్తోంది. శక్తి, స్మార్ట్, జెమ్, జెమిని వంటి కీలకమైన బ్రాండ్లతో వ్యాపారాన్ని సాగిస్తోంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక ప్లాంట్ ఉంది. అహ్మదాబాద్‌లో మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నది. 200 మంది ప్రైమరీ డీలర్లతో, 120 మంది సబ్-డీలర్లతో డీలర్ నెట్వర్క్ పటిష్టంగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో క్వార్టర్లో కంపెనీ నికర అమ్మకాలు 9 శాతం వృద్ధితో రూ.143 కోట్లకు, నికర లాభం 23 శాతం వృద్ధితో రూ.13 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.15కోట్లుగా ఉన్న స్థూల లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో 35 శాతం వృద్ధితో రూ.20 కోట్లకు పెరిగింది. ఇదే జోరు రానున్న క్వార్టర్లలోనూ కొనసాగనున్నదని భావిస్తున్నాం. 2014 సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలానికి ఈ కంపెనీ మొత్తం 19,521 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలానికి కంపెనీ వాహన విక్రయాలు 6 శాతం వృద్ధితో 20,763కు పెరిగాయి. రెండేళ్లలో నికర అమ్మకాలు 12 శాతం, నికర లాభం 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.625 టార్గెట్ ధరగా ప్రస్తుత ధరలో ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చు. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డెరైక్ట్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.428 టార్గెట్ ధర: రూ.599 ఎందుకంటే: చోళ మండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్‌లో ఈ కంపెనీ తనకున్న 74 శాతం వాటాలో 14 శాతం వాటాను రూ.900 కోట్లకు భాగస్వామ్య సంస్థ మిత్సుసుమిటొమోకు విక్రయించింది. దీంతో చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ విలువ 6,300 కోట్లుగా అంచనా వేస్తున్నాం. ఈ 14 శాతం ఈ వాటా విక్రయంతో లభించిన నిధులతో రూ.1,400 కోట్లుగా ఉన్న రుణ భారాన్ని తగ్గించుకోనున్నది. దీంతో రూ.70 కోట్ల వడ్డీ చెల్లింపుల భారం తగ్గి కంపెనీ నికర లాభం పెరగనున్నది. ఈ సాధారణ బీమా వ్యాపారంలో తన వాటాను మరింతగా విక్రయించనున్నది. ఈ కంపెనీకి చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 46 శాతం వాటా(విలువ రూ.4,800 కోట్లు), చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 60 శాతం వాటా(రూ.3,800కోట్లు), శాంతి గేర్స్‌లో 70 శాతం వాటా(రూ.600 కోట్లు)లు ఉన్నాయి. మార్కెట్ విలువ ప్రకారం ఈ వాటాల విలువ రూ.9,200 కోట్లుగా ఉంది. అయితే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,500 కోట్లుగానే ఉంది. సాధారణ బీమా వ్యాపారంలో ప్రీమియమ్‌లు పెరుగుతుండడం, లాభాలు అధికంగా వచ్చే రిటైల్ సెగ్మెంట్‌పై చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రధానంగా దృష్టిసారించడం సానుకూలాంశాలు. రెండేళ్లలో స్థూల ప్రీమియమ్‌లు 15 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాధారణ బీమా వ్యాపారం రూ.200 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తుందని అంచనా. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.