శివదీప్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఆధ్వర్యంలో జరిగిన టీటీసీ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు కొసరాజు శివదీప్ సత్తా చాటాడు. సింగిల్స్‌తో పాటు మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో టైటిల్స్‌ను దక్కించుకున్నాడు. త్రివేండ్రమ్‌లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో శివదీప్ 6-4, 4-6, 6-4తో విజయ్ కన్నన్ (తమిళనాడు)పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో శివదీప్- సాయి సంహిత (తమిళనాడు) ద్వయం 6-4, 3-6, 10-5తో ఓజోస్- శ్వేత (తమిళనాడు) జంటను ఓడించి విజేతగా నిలిచింది.