breaking news
Tsunami threat
-
Japan: మెగా సునామీ వార్నింగ్
-
20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి..
సరిగ్గా 20 ఏళ్ల క్రితం తమిళనాడు తీరంలో సముద్రపు రాకాసి అలలు సృష్టించిన బీభత్సాన్ని నేటికీ ఎవరూ మరచిపోలేరు. 2004 డిసెంబర్ 26న ఏకంగా 6,605 మందిని బలిగొన్న సునామీ మిగిల్చిన విషాదం ఇప్పటికీ స్థానికులను వెంటాడుతూనే ఉంది. నాటి సునామీ బాధితులలో నమితా రాయ్ ఒకరు. ఆనాడు ఆమెకు అనూహ్య అనుభవం ఎదురయ్యింది. దానిని తలచుకున్నప్పుడల్లా ఆమె నిలువెల్లా వణికిపోతుంటుంది.ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఉంటున్న నమితా రాయ్ నాటి సునామీ అనుభవాలను మీడియాకు తెలిపారు. అవి ఆమె మాటల్లోనే.. ‘2004లో నేను కుటుంబంతోపాటు అండమాన్, నికోబార్‌లోని హాట్‌బే ద్వీపంలో ఉండేవాళ్లం. ఆ సమయంలో నేను గర్భవతిని. ఆ రోజు నేను రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నాను. అకస్మాత్తుగా హట్ బే ద్వీపం దిశగా సముద్రపు అలలు ఎగసిపడుతూ వచ్చాయి. వాటిని చూసిన వారంతా పెద్దగా కేకలు పెడుతూ, కొండపైకి పరుగులు తీశారు. దీనిని చూసిన నేను భయంతో స్పృహ కోల్పోయాను.నేను తేరుకుని కళ్లు తెరచి చూసేసరికి దట్టమైన అడవిలో ఉన్నాను. నా చుట్టూ చాలామంది ఉన్నారు. అంతకుముందు అపస్మారక స్థితిలో ఉన్న నన్ను నా భర్త, పెద్ద కుమారుడు ఇక్కడికి తీసుకువచ్చారు. భీకరమైన అలల తాకిడికి హాట్‌బే ద్వీపమంతా ధ్వంసమయ్యిందని చెప్పారు. ఆ మాట వినగానే షాక్‌కు గురయ్యాను. ఆరోజు రాత్రి 11.49 గంటల సమయంలో నాకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. దగ్గర్లో డాక్టర్లెవరూ లేరు.పురిటి నొప్పులతో బాధపడుతూ మెలికలు తిరిగిపోయాను. దీనిని గమనించిన నా భర్త నన్ను ఒక చదునైన బండరాయిపై పడుకోబెట్టారు. సహాయం కోసం వైద్యులకు కాల్ చేశారు. ఎంత ప్రయత్నించినా వైద్య సహాయం అందలేదు. వెంటనే నా భర్త.. నేను పడుతున్న పురిటినొప్పల గురించి అక్కడున్న మహిళలకు చెప్పి,సాయం అర్థించారు. వెంటనే వారు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో నాకు పురుడు పోశారు. అంతటి విపత్కర సునామీ పరిస్థితుల మధ్య నేను నా కుమారునికి జన్మనిచ్చాను. ఆ ఆడవిలో లెక్కకు మించిన విష సర్పాలు ఉంటాయి. వాటి మధ్యనే నేను పురుడు పోసుకున్నాను. నా కుమారునికి ‘సునామీ’ అని పేరు పెట్టుకున్నాను.అయితే అధిక రక్తస్రావం కారణంగా నా ఆరోగ్య పరిస్థితి దిగజారింది. అతికష్టం మీద నా బిడ్డకు పాలు తాగించాను. అయితే అంతకుమందు నేను ఏమీ తినకపోవడంతో నా పిల్లాడికి కావాల్సినంత పాలు ఇవ్వలేకపోయాను. దీనిని గమనించిన చుట్టుపక్కల మహిళలు నా కుమారుని చేత కొబ్బరి నీళ్లు తాగించారు. అటువంటి దుర్భర పరిస్థితుల్లో అదే ప్రాంతంలో మేము నాలుగు రోజులు ఉండాల్సి వచ్చింది. తరువాత రక్షణ సిబ్బంది అక్కడికి వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అక్కడి నుంచి నన్ను వైద్య చికిత్స కోసం పోర్ట్ బ్లెయిర్‌లోని జీబీ పంత్ ఆసుపత్రికి ఓడలో తీసుకెళ్లారు.కోవిడ్ -19 మహమ్మారి సమయంలో నా భర్త లక్ష్మీనారాయణ కన్నుమూశారు. ప్రస్తుతం నేను నా కుమారులు సౌరభ్, సునామీలతో పాటు హుగ్లీలో ఉంటున్నాను. పెద్ద కొడుకు సౌరభ్ ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండవవాడు సునామీ భవిష్యత్‌లో సముద్ర శాస్త్రవేత్త కావాలని అనుకుంటున్నాడు’ అని నమితా రాయ్ తెలిపారు.అనంతరం ఆమె కుమారుడు సునామీ మీడియాతో మాట్లాడుతూ ‘మా అమ్మే నాకు సర్వసం. మా నాన్నగారు మరణించాక అమ్మ మమ్మల్ని పెంచిపెద్ద చేసేందుకు ఎంతో శ్రమించింది. సునామీ కిచెన్‌ను నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకువచ్చింది. భవిష్యత్‌లో నేను సముద్ర శాస్త్రవేత్త కావాలనుకుంటున్నాను’ అని తెలిపారు.ఇది కూడా చదవండి: Veer Bal Diwas: మొఘలులను ఎదిరించిన ఆ చిన్నారుల బలిదానానికి గుర్తుగా.. -
మరోసారి అమెరికాను వణికించిన భూకంపం
-
భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక
నౌమియా : న్యూ కెలడోనియా తూర్పు తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఈ మేరకు అమెరికన్ జియోలాజికల్ సర్వే ఓ ప్రకటన విడుదల చేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్టేలుపై 7.0గా నమోదైనట్లు తెలిపింది. దేశంపై సునామీ దాడి జరిగే అవకాశం ఉందని పసిఫిక సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. సునామీ వల్ల 300 కిలోమీటర్ల పరిధిలో విధ్వంసం జరగుతుందని హెచ్చరించింది. న్యూ కెలడోనియాలో తూర్పు తీరానికి 250 కిలోమీటర్ల దూరంలో ఆ దేశ రాజధాని నౌమియా ఉంది. సోమవారం ఉదయం భూకంపం సంభవించే ముందు న్యూ కెలడోనియాలో ఆదివారం అర్థరాత్రి పలుమార్లు భూమి కంపించినట్లు రిపోర్టులు వచ్చాయి. -
భారత్‌లో సునామీ హెచ్చరికల వ్యవస్థ మెరుగవ్వాలి: గుషీయాకోవ్
సాక్షి, హైదరాబాద్: ఆసియా పసిఫిక్, దక్షిణాసియా దేశాలకు సునామీల ప్రమాదం అధికంగా ఉన్నందున భారత్‌లో సునామీ హెచ్చరికల వ్యవస్థ మెరుగుపడాల్సిన అవసరం ఉందని రష్యా సైన్స్ ఆకాడమీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వియాచెస్‌లేవ్ గుషీయాకోవ్ అభిప్రాయపడ్డారు. ‘జియోస్పేషియల్ డేటా ఫర్ డిసాస్టర్ అండ్ రిస్క్ రిడక్షన్’ అంశంపై ఇక్కడి సునామీ హెచ్చరికల కేంద్రం (ఇన్కాయిస్)లో శుక్రవారం జరిగిన వర్క్‌షాపు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సునామీల తీవ్రత, ప్రభావాలను కచ్చితంగా అంచనా వేసేందుకు కలసికట్టుగా పరిశోధనలు జరపాలన్నారు.