breaking news
trs mla ktr
-
అడ్డుకోవాల్సిన బాధ్యత టి.మంత్రులదే: కేటీఆర్
హైదరాబాద్: అసెంబ్లీలో సీఎం కిరణ్ ప్రవేశపెట్టిన విభజన బిల్లు తీర్మానానికి ఎలాంటి నైతికత లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సీఎం బ్లాక్మెయిల్కు స్పీకర్ నాదెండ్ల మనోహర్ లొంగిపోయారని ఆరోపించారు. బీఏసీలో చర్చించకుండా విభజన విభజన బిల్లు తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారని తెలిపారు. స్పీకర్, ముఖ్యమంత్రి కుమ్మక్కై దొడ్డిదారిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో నెగ్గించుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ తీర్మానాన్ని ఢిల్లీకి పంపించకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులపై ఉందన్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని సహా అన్ని పార్టీల నాయకులను కలిసి తెలంగాణకు మద్దతు కోరతామని కేటీఆర్ చెప్పారు. విభజన బిల్లు తీర్మానంతో శాసనసభలో ఒక ప్రహసనం ముగిసిందని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. ఈ తీర్మానం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదని కొట్టి పారేశారు. -
మానవ జాతి చరిత్రలో మండేలా మహా శిఖరం: కిరణ్
నల్లజాతి సురీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా జాతీ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహాయోధుడని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. ఈ సందర్బంగా మండేలా మృతికి సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆ సందర్బంగా సీఎం కిరణ్ మాట్లాడుతూ...మానవ జాతి చరిత్రలో మండేలా మహా శిఖరమని కిరణ్ అభివర్ణించారు.మండేలా మృతి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం పోరాడే ప్రతి ఒక్కరికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. నెల్సన్ మండేలా జీవితంలో ఎన్నో ఆటుపోట్లును ఎదుర్కొన్నారని తెలిపారు. నెల్సన్ మండేలాకు వచ్చిన పురస్కారాలకు లెక్కలేదని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ... మండేలా మృతితో ఓ యుగపురుషుడిని కోల్పోయామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో మండేలా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారని ఆయన గుర్తు చేశారు. వర్ణ వివక్షపై పోరాడే క్రమంలో మండేలా మరణానికి వెరవకుండా పోరాటం సాగించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. బతుకంతా పోరాటానికి ఆంకితం చేసిన మహానుభావుడు అని మండేలా పోరాటాన్ని కేటీఆర్ కొనియాడారు.