breaking news
trousers
-
ఫ్లైట్‌లో ఆయనగారి దర్జా చూస్తే షాకే!
కుమేల్ నంజియాని అనే వ్యక్తి ఇటీవల ఓ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఫ్లైట్‌నే తన ఇంటిగా మార్చుకొని ఎంత దర్జాగా.. ఇతరులకు అసౌకర్యం కలిగించాడో చెబుతూ కుమేల్ చేసిన ట్వీట్లు ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. విమాన ప్రయాణంలో కుమేల్‌కు ఆరోజు దురదృష్టవశాత్తు ముందు సీటు లభించింది. ఫ్లైట్ టేకాఫ్ కాగానే.. పక్కన కూర్చున్న వ్యక్తి చకచకా తన ప్యాంటు విప్పేసి ముందున్న వాల్‌పై తన రెండు కాళ్లు పెట్టుకొని కూర్చున్నాడు. అది మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ఉందని చెప్పినా ఆ వ్యక్తి వినిపించుకోలేదని కమేల్ తన ట్వట్లలో వాపోయాడు. సిబ్బంది చెప్పిన విషయాన్ని సైతం అతడు పట్టించుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాడని.. చివరికి నాలుగు గంటల ప్రయాణం తరువాత.. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక ప్యాంటు వేసుకొని అతడు బయటకు నడిచాడని కుమేల్ వెల్లడించాడు. సిబ్బంది ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేస్తారని తాను భావించానని అయితే.. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుమేల్ వాపోయాడు. ఫ్లైట్లలో కొందరు వ్యక్తులు సైకోల మాదిరిగా ప్రవర్తిస్తుండటంతో ఇటీవల దక్షిణ కొరియా ఎయిర్‌లైన్స్.. సిబ్బందికి స్టన్ గన్స్‌ను ఇచ్చే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
ఖాకీ నిక్కర్లకు స్వస్తి చెప్పిన ఆర్ఎస్ఎస్
-
పిక్క ప్యాంటు
ఈ ప్యాంటు లెంగ్త్‌కు ఒక లెక్కుంది. దీని పొడవు పిక్క వరకు ఉంటుంది. తొడుక్కోడానికి అనువుగా ఉంటుంది. చకచక నడకకు సౌకర్యంగా ఉంటుంది. చిటపట చినుకుల్లో చివర్లు తడవకుండా ఉంటుంది. ఈ పిక్క ప్యాంటు బెస్ట్. ‘కాప్రి’ ప్యాంటు పేరున్న ఇదే లేటెస్ట్. కాప్రి ఫ్యాషన్ మోకాళ్లకు కొద్దిగా కిందుగా లేదంటే ఇంకాస్త పిక్కల దాకా.. మరికాస్త పొడవు ఉండే కాప్రి ఎల్లలు దాటి ఎవర్గ్రీన్ జాబితాలో చేరింది. కాప్రి అనే పదం ఇటాలియన్ భాష నుంచి వచ్చిందని, 1950-60లలో అమెరికాలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు. మొదటిసారి అమెరికన్ నటి గ్రేస్‌కెల్లీ తన సినిమాలో ధరించి ఆకట్టుకున్నా ప్రపంచమంతా కాప్రి వైపు మళ్లేలా చేయడంలో మాత్రం నటి మార్లిన్ మన్రో, ఆడ్రీ హెప్బర్న్లకే సాధ్యమైంది. నాటి నుంచి ప్రతి అమ్మాయి వార్డ్‌రోబ్‌లో కాప్రి కామ్‌గా చేరిపోయింది. క్యూట్‌గా కనిపించేలా చేసే ఈ ప్యాంట్ మీదకు సింపుల్ టీ షర్ట్ ధరిస్తే చాలు అందంగానూ, స్టైల్‌గానూ కనిపిస్తారు. పాదాలకు అంతే అందమైన హీల్స్, కిల్లర్ హీల్స్ వంటివి ధరిస్తే ఈవెనింగ్ పార్టీవేర్‌కి ఎంచక్కా అమరిపోతుంది. ఈ లెక్క కాప్రీని కలర్ఫుల్గా మార్చేసింది. కొత్త కొత్త డిజైన్లలో ఒదిగిపోయింది. కాప్రీ ప్యాంట్‌నే త్రీ క్వార్టర్ ప్యాంట్, క్రాప్ ప్యాంట్స్, పెడెల్ పుషర్స్, కామ్ డిగ్గర్స్, ఫ్లడ్ ప్యాంట్స్, జామ్స్, హై వాటర్ కల్టర్స్, టొరెడార్ ప్యాంట్స్... ఇలా రకరకాల పేర్లతో పిలిచేవారు. ఇన్ని పేర్లు ఉన్నా కాప్రి అనే పదమే నేడు ప్రపంచమంతా వాడుకలో ఉంది. మీరు కాప్రి ధరిస్తున్నారా?! అయితే డిజైనర్స్ ఇచ్చే సూచనలు తప్పనిసరి... చాలామంది అమ్మాయిలు, మహిళలు కాప్రి ప్యాంట్స్ విషయంలో సరైన అవగాహన ఉండదు. దీనికి కారణం వాస్తవానికి దూరంగా ఉండటం. పొట్టిగా ఉన్నవారు కాప్రి ప్యాంట్స్ ధరిస్తే మరింత పొట్టిగా కనపడతారు.పొడవుగా ఉంటే మరింత హైట్ అనిపిస్తాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే... నడుము వెడల్పుగా ఉన్నవారు కాప్రి కాళ్ల భాగం పొడవుగా ఉండేది తీసుకోవాలి. దీనికి షార్ట్ టాప్ సరైన ఎంపిక. స్లిమ్‌గా కనిపించాలంటే లోయర్ లెగ్ పార్ట్ మరీ టైట్‌గా ఉండేది ఎంచుకోకపోవడమే మేలు. లావుగా ఉన్నవారు లెగ్స్‌కి అతుక్కుపోయేలాంటి కాప్రిని ఎంచుకోవద్దు. వీటి వల్ల మరింత లావుగా కనిపిస్తారు. అలాగే స్ట్రెయిట్ కట్ ఉన్నది ఎంచుకోవాలి. లెగ్గింగ్ కాప్రి ధరించాలనుకునేవారికి ఈ జాగ్రత్త తప్పనిసరి.కాప్రి ప్యాంట్ ధరించినప్పుడు పొట్టిగా కనిపిస్తున్నాం అనుకుంటే హీల్స్ ధరించేడమే సేఫ్.కాప్రి ప్యాంట్ మీదకు ట్యూనిక్, చిక్ ఔట్ ఫిట్.. వంటి మంచి రంగు ఉన్న టాప్ ధరిస్తే లుక్ బాగా కనిపిస్తుంది. స్మార్ట్‌గా కనిపించాలంటే నెక్లేస్ లేదంటే ఏదైనా పెద్దబ్యాగ్ చేత పట్టుకుంటే చాలు. ►కాప్రి ప్యాంటు, డిజైనర్ టాప్ ధరించి స్టైల్‌గా వెలిగిపోతున్న బాలీవుడ్ నటి ఐశ్వర్యాబచ్చన్. క్యాజువల్, కంఫర్ట్ అనిపించే ఈ తరహా డ్రెస్సింగ్ అతివల ఆత్మవిశ్వాసానికి సిసలైన చిరునామా అనిపించుకుంటుంది. ►లేస్, లేదా స్ట్రాప్డ్ లెగ్గింగ్ కాప్రి స్టైల్స్ ప్యాంటు ట్రెండ్‌ని ఫాలో అవుతున్న వారి జాబితాలో చేరుస్తాయి. ► కాప్రి పాయింట్స్ ఇప్పుడు ఇంకాస్త పొడవుగా మారాయి. అదే రంగు లాంగ్ స్లీవ్స్ టీ షర్ట్ ధరిస్తే అఫిషియల్ లుక్‌తో అదరగొట్టేస్తారు. ►జీన్స్ కాప్రి ఎంపిక ఎప్పుడూ స్టైల్లో ముందుంచుతుంది. రఫ్, స్పీడ్, స్టైల్‌తో మీ రూపం ఇట్టే ఆకట్టుకుంటుంది. జీన్స్ కాప్రిలో నటి అక్ష. ► క్యాజువల్ వేర్లో కాప్రి విత్ టాప్ ఈవెనింగ్ వేర్‌గా సౌకర్యాన్నిచ్చే డ్రెస్. ►పార్టీ వేర్‌లోనూ కంఫర్ట్ వెతుక్కునేవారికి కాప్రి ట్రౌజర్ స్టైల్ సరికొత్త స్టైల్ స్టేట్మెంట్. -
అబ్బాయిలకు స్కర్ట్ లు.. అమ్మాయిలకు ప్యాంట్లు!
ప్రభుత్వ పాఠశాలల్లో అబ్బాయిలు, అమ్మాయిలు వారికి నచ్చిన దుస్తులను వేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ యూకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అక్కడి ట్రాన్స్ జండర్స్ భారీ ఊరట లభించనుంది. గత కొంతకాలంగా యూకేలో నువ్వు అబ్బాయివా? అమ్మాయివా? అనే వేధింపులు వీరిపై పెరిగిపోతుండటంతో అక్కడ కొన్ని సామాజిక సంస్థలు పాఠశాలల్లో బట్టలపై నిబంధనలు తీసేయాలని లింగసమానత్వం పేరుతో డిమాండ్ పెరిగింది. అయిదేళ్లు దాటిన పాఠశాలకు వెళ్లే అమ్మాయైనా, అబ్బాయైనా.. వారికి నచ్చిన దుస్తులు అంటే, అబ్బాయిలు స్కర్ట్ లు, అమ్మాయిలు ప్యాంట్లు వేసుకోవచ్చు. అంతేకాదు ప్రభుత్వం నిర్వహించే దాదాపు 80 స్కూళ్లలో దీనిని అమలు కూడా చేస్తోంది. దీంతో స్కూళ్లలో నలుపు, బూడిద రంగుల స్కర్ట్ లను, అమ్మాయిలు ప్యాంట్లను వేసుకునేందుకు వీలు ఏర్పడింది.