breaking news
Tribal Affairs
-
గిరిజన గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
ఎల్లారెడ్డిపేట : గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జెడ్పీటీసీ తోట ఆగయ్య అన్నారు. వీర్నపల్లి మండలం గర్జనపెల్లి శివారులోని భిక్షపతి, పూనానాయక్, లచ్చయ్య తండాల్లో రూ.81 లక్షలతో నిర్మించనున్న బీటీరోడ్డు పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా గిరిజనులు అడవుల్లో దుర్భర జీవితాలు గడిపారన్నారు. వారి జీవితాల్లో మార్పు తేవడానికే ప్రభుత్వం తండాల మధ్య లింకురోడ్లు ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్ అందె సుభాష్, ఎల్సాని మోహన్‌కుమార్, ప్రభాకర్, సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ కమల, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీరాంనాయక్, విఠల్, భాస్కర్, రాజిరెడ్డి, రవి, శేఖర్, తిరుపతి, బుగ్గయ్య పాల్గొన్నారు. -
పోలవరం బాధితులకు సాయంపై వివరణ
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందిన సాయంపై రాజ్యసభలో బుధవారం కేంద్ర ట్రైబల్ అఫైర్స్ శాఖ వివరణ ఇచ్చింది. పోలవరం నిర్వాసితులకు సంబంధించి మొత్తం నాలుగు అంశాల్లో వైఎస్సార్ సీపీ ఎంపీ(రాజ్యసభ) వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు ట్రైబల్ అఫైర్స్ శాఖ మంత్రి జస్వంత్ సిన్హ్ భాభోర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 1. పోలవరం నిర్వాసితులకు పరిహారం, ప్రత్యమ్నాయ ఏర్పాట్లలో జరిగిన లోపాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) నుంచి ప్రభుత్వం నోటీసులు అందుకుందా? ఈ ప్రశ్నపై స్పందించిన ట్రైబల్ అఫైర్స్ మంత్రి.. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) నుంచి నోటీసులు అందుకున్నట్లు చెప్పారు. అందుకు ప్రతిగా స్పందించినట్లు కూడా వెల్లడించారు. 2. అటవీ హక్కులు-2006 కింద అడవి బిడ్డలు, గిరిజనులకు పరిహారాలు అందుతున్నాయా? ఎఫ్ఆర్-2006 చట్టం కింద అటవీ ప్రాంతాల్లో నివసించే(అర్హత కలిగిన) గిరిజనులను ఎస్టీ కేటగిరీలోకి చేర్చి నిబంధలనల ప్రకారం సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ చట్టం కిందే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన గిరిజనులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 3. 20 ఏళ్ల క్రితం చేసిన సర్వే ఆధారంగానే గిరిజనులకు పరిహారాన్ని అందజేస్తున్నారా? గోదావరి జిల్లాల్లోని పైడిపాక, దేవ్రగొండి, మామిడిగొండి, తోటగాంధీ, చేగొండపల్లి, అంగులూర, పుడిపల్లిల్లో సర్వేకు ఏ అంశాలను ప్రమాణికంగా తీసుకున్నారు? 2005-2006 సంవత్సరంలో సోషియో ఎకనమిక్ సర్వేను నిర్వహించినట్లు చెప్పారు. 1894 ల్యాండ్ అక్విసిషన్ యాక్ట్ ఆధారంగా గోదావరి జిల్లాల పోలవరం నిర్వాసితులకు పరిహారాన్ని చెల్లించినట్లు తెలిపారు. 2014 జనవరి 1న సేకరించిన భూమినంతటినీ వాటర్ రీసోర్స్ డిపార్ట్ మెంటుకు అందిచినట్లు చెప్పారు. -
‘తుమ్మిడిహెట్టి’ ఎత్తిపోతలే
అది గ్రావిటీ పథకం కాదు ♦ ప్రాణహిత డిజైన్ మార్పుపై ప్రభుత్వ సలహాదారు వివరణ ♦ ప్రాజెక్టుకు ఇంకా చాలా అనుమతులు రాలేదు ♦ ప్రాణహిత, ఇంద్రావతి నీటితో ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరు ఆయకట్టు స్థిరీకరణ సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల పాత డిజైన్ మేరకు ఆదిలాబాద్ జిల్లా కౌటాల వద్ద నిర్మించనున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ గ్రావిటీ పథకం కాదని ఎత్తిపోతల పథకమని రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల విభాగం సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు శనివారం వివరణ ఇచ్చారు. గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులు ఒకవేళ ఎండిపోతే ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి మాత్రమే తెలంగాణ ప్రాంతాన్ని రక్షించగలవని, ఈ నీటిని వినియోగంలోకి తెచ్చే ఉద్దేశంతోనే ప్రాజెక్టు రీడిజైన్ జరుగుతోందని పేర్కొన్నారు. బ్యారేజీలపై మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందంతోపాటు ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించేందుకు అంగీకరించడం, ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ బ్యారేజీని 103 మీటర్ల ఎత్తులో నిర్మించాలన్న ప్రతిపాదనపై వ్యక్తమవుతున్న విమర్శలపై విద్యాసాగర్‌రావు ఈ మేరకు వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు... గోదావరిపై ఎగువ రాష్ట్రం అక్రమంగా చేపట్టిన వందలాది కట్టడాల వల్ల ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుకు నీరు రాక ఆట స్థలాలుగా మారాయి. భవిష్యత్తులో ఉధృతంగా వరదలు వస్తే తప్ప ఈ ప్రాజెక్టుల్లో నీరు కనబడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రాణహిత, ఇంద్రావతి ఉపనదులు మాత్రమే తెలంగాణను రక్షించగలవు. ఈ ఉప నదుల్లో 75 శాతం డిపెండబులిటీ ప్రకారం 700 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. ఈ నీటిని గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు, అదనంగా పాత ప్రాజెక్టుల స్థిరీకరణకు మళ్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే తుమ్మిడిహెట్టి ద్వారా ఆదిలాబాద్‌లో ఉపయోగించుకునే 20 టీఎంసీలు పోనూ మిగిలిన 140 టీఎంసీలను మేడిగడ్డ, ఇంద్రావతి ద్వారా నీటిని లిఫ్ట్ చేసి తుపాకులగూడెం బ్యారేజీ ద్వారా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తుమ్మిడిహెట్టి ద్వారా ఆదిలాబాద్‌లో 2 లక్షల ఎకరాలు, మిగిలిన 14.40 లక్షల ఎకరాలకు మేడిగడ్డ ద్వారా ఎల్లంపల్లి నీటిని తరలించి సాగునీరు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరు ఆయకట్టు స్థిరీకరణ కోసం ఇంద్రావతి నీటిని తుపాకులగూడెం ద్వారా లిఫ్టు చేసి మేడిగడ్డ ద్వారా వినియోగించుకోనున్నాం. అలాగే ఎస్సారెస్పీ ఫేజ్-2 ఆయకట్టుకు సైతం ఇంద్రావతి నీటినే ఉపయోగించుకుంటాం. పాత ప్రాజెక్టు డిజైన్ మేరకు 7 జలాశయాల ద్వారా 14.7 టీఎంసీలను మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండగా తాజా డిజైన్‌తో 130 టీఎంసీల నిల్వ సామర్థ్యంగల రిజర్వాయర్లు ఏర్పాటవుతున్నాయి. విమర్శకులు అభిప్రాయపడుతున్నట్లుగా ప్రాణహిత ప్రాజెక్టుకు ఏవో కొన్ని తప్ప చాలా అనుమతులు రాలేదు. కేంద్ర జలవనరులశాఖకు సంబంధించి సాంకేతిక సలహా కమిటీ, కేంద్ర పర్యావరణ, అటవీ, గిరిజన వ్యవహారాలశాఖల నుంచి అనుమతులు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద తొందరగా పూడిక చేరే ప్రమాదం ఉందన్నది వాస్తవం కాదు. వరదలతోపాటు గేట్ల నిర్వహణతో పూడిక దిగువకు చేరుతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల ఏపీ రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లదు. గోదావరి జలాల్లో ఆం ధ్రప్రదేశ్‌కు నికరంగా లభించిన 530 టీఎంసీల వాటాను సక్రమంగా బట్వాడా చేసే బాధ్యతను గోదావరి బోర్డు చూసుకుంటుంది.