breaking news
Travel Operator
-
ట్రావెల్ ఆపరేటర్లకు అనుకూలం
న్యూఢిల్లీ: దేశీ పర్యాటక రంగం జోరు మీద ఉండడంతోపాటు, విదేశీ ప్రయాణాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి ఈ రంగంలో పనిచేసే ట్రావెల్ ఆపరేటర్లకు అనుకూలిస్తుందని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రావెల్ ఆపరేటర్ల ఆదాయం 15–17 శాతం వరకు వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. మౌలిక వసతులు మెరుగుపడుతుండడం, ఖర్చు చేసే ఆదాయం పెరుగుదల, ప్రయాణాలకు మొగ్గు చూపించే ధోరణికి తోడు.. దేశీ పర్యాటక రంగంపై పెరిగిన ప్రభుత్వ ప్రాధాన్యం ఈ రంగం వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ఈ రంగంలో 60 శాతం వాటా కలిగిన నలుగురు ప్రధాన ఆపరేటర్లను విశ్లేíÙంచిన అనంతరం క్రిసిల్ రేటింగ్స్ ఈ గణాంకాలను విడుదల చేసింది. ‘‘ట్రావెల్ ఆపరేటర్ల రుణ పరపతి సైతం ఆరోగ్యకర స్థాయిలో ఉంది. బలమైన బ్యాలన్స్ షీట్లకుతోడు గత ఆర్థిక సంవత్సరంలో మాదిరే 6.5–7 శాతం మేర స్థిరమైన మార్జిన్లు.. మెరుగైన నగదు ప్రవాహాలకు మద్దతునిస్తాయి. దీంతో ట్రావెల్ ఆపరేటర్లు రుణంపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం రాదు’’అని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. మెరుగైన వసతుల కారణంగా కొత్త పర్యాటక ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు, ఆధ్యాతి్మక పర్యాటకానికి డిమాండ్ పెరుగుతుండడాన్ని ప్రస్తావించింది. విదేశీ పర్యాటకుల రాక కరోనా ముందు నాటి స్థాయికి చేరుకున్నట్టు తెలిపింది. ముఖ్యంగా కార్పొరేట్సమావేశాలు, సదస్సుల నుంచి డిమాండ్ పెరిగినట్టు పేర్కొంది. ఎన్నో అనుకూలతలు.. అధికంగా ఖర్చు చేసే ఆదాయం, 37 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే సదుపాయం, అడుగు పెట్టిన వెంటనే వీసా కారణంగా విదేశీ విహార యాత్రలు సైతం పెరుగుతున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. ఇక ఆకర్షణీయమైన ట్రావెల్ ప్యాకేజీలు, దక్షిణాసియా, మధ్య ఆసియా దేశాలకు ఎయిర్‌లైన్స్ సంస్థలు సరీ్వసులు నడిపిస్తుండడం కూడా డిమాండ్‌ను పెంచుతున్నట్టు వివరించింది. ‘‘కరోనా తర్వాత అప్పటి వరకు ఎటూ వెళ్లలేకపోయిన వారు పెద్ద ఎత్తున ప్రయాణాలకు మొగ్గు చూపించగా, ఆ ధోరణి తగ్గిపోయి.. సాధారణ పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు, పట్టణీకరణ, అందుబాటు ధరల్లో టూర్ ప్యాకేజీలు, ఆదాయంలో స్థిరమైన వృద్ధి, ఈ రంగంపై పెరిగిన ప్రభుత్వం దృష్టి ఇవన్నీ టూర్, ట్రావెల్ రంగాన్ని స్థిరంగా నడిపిస్తాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ తెలిపారు. -
ఫ్లెమింగో ట్రావెల్ రిటైల్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ట్రావెల్ రిటైల్ ఆపరేటర్, ఫ్లెమింగో ట్రావెల్ రిటైల్ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో డ్యూటీ–ఫ్రీ షాప్స్ కూడా నిర్వహిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,600 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.2,423 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. ఆఫర్ ఫర్ సేల్ కింద ఈ కంపెనీ అనుబంధ సంస్థ, ఫ్లెమింగో డ్యూటీ ప్రీ షాప్, ముంబై 11.29 లక్షల షేర్లను విక్రయిస్తుంది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను ఫ్లెమింగ్ ఇంటర్నేషనల్(యూకే)లో వంద శాతం వాటాను కొనుగోలు కోసం వినియోగించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యస్ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, క్రెడిట్ సూసీ సెక్యూరిటీస్, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, క్యాపిటల్ మార్కెట్స్ సంస్థలు వ్యవహరిస్తాయి. భారత్, శ్రీలంక ట్రావెల్ రిటైల్ మార్కెట్లలో ఫ్లెమింగో ట్రావెల్ రిటైల్ కంపెనీదే అగ్రస్థానం. ఈ రంగం నుంచి ఐపీఓకు వస్తున్న తొలి కంపెనీ ఇదే. ఈ కంపెనీ గత ఏడాది సెప్టెంబర్ నాటికి 28 డ్యూటీ ఫ్రీ స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. భారత ఉపఖండంతో పాటు అమెరికా, కరేబియన్, యూరప్ తదితర మొత్తం 26 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ ఐపీఓ ఆమోదంతో ఈ ఏడాది సెబీ అనుమతిచ్చిన ఐపీఓల సంఖ్య 29కు పెరిగింది. -
పేద మహిళల కోసంస్నేహ హస్తం
సఫా... అంటే స్వచ్ఛత, స్నేహం అని అర్థం. రుబీనా విజయానికి కారణాలు కూడా ఆ రెండే. ఓ సైనికుడి కడుపున పుట్టినందుకు తండ్రిలో ఉన్న సేవకుణ్ణి చూసి తోటివారికి సాయపడాలన్న ఆలోచన పుట్టిందామెకు. ఆ సేవ స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంది. అందుకే ‘సఫా’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా వందలమంది పేద మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఏ వ్యాపారైమైనా విజయవంతంగా ముందుకు సాగడానికి స్వచ్ఛత ఉంటే చాలని ‘సఫా’లోని సభ్యులంతా నిరూపించారు. ఈ విజయం వెనక రుబినాతో పాటు బలమైన ఆశయాలు, పట్టుదలతో కూడిన లక్ష్యాలు ఉన్నాయి. సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వశాఖలో ట్రావెల్ ఆపరేటర్‌గా తొమ్మిదేళ్లు పనిచేసిన రుబీనా నఫీస్ ఫాతిమా చిన్నతనం నుంచే సేవాకార్యక్రమాలంటే ఇష్టపడేది. హైదరాబాద్‌కి చెందిన మిలటరీ అధికారి సులేమాన్ అలాఖాన్ రెండవ సంతానం రుబీనా. తండ్రి ఉద్యోగరీత్యా దేశంలోని అన్ని ప్రాంతాలను చూసిన రుబీనా తన జీవితంలో పేద మహిళల కోసం ఏదో ఒకటి చేయాలని చదువుకున్నరోజుల్లోనే ప్రణాళికలు తయారుచేసుకుంది. ‘‘సౌదీ నుంచి హైదరాబాద్ వచ్చాక ఇక్కడ వాడలన్నీ తిరిగి చూశాను. నిరుపేద కుటుంబాల్లో మహిళ దుఃస్థితి నా మనసును కలిచివేసింది. ముఖ్యంగా ముస్లిం వాడల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చదువు లేకపోవడం ఒక్కటే కారణం కాదు, పేదరికం, గృహహింసలకు బలైపోతున్న మహిళలు, వారికి వారసులుగా పిల్లలు. ఇలాంటివారిని ముందు ఆర్థికంగా నిలబెట్టడం ఒక్కటే పరిష్కారమనుకున్నాను. బంధువులు, స్నేహితులతో ఆలోచించి ‘సఫా’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాను. ‘సఫా’ అనేది ఉర్దూ పదం. స్వచ్ఛత, స్నేహం అని అర్థం. ఈ రెండు పదాలనే పెట్టుబడిగా పెట్టి గత ఎనిమిదేళ్లుగా మా ప్రయాణం కొనసాగుతోంది’’ అని చెప్పారు రుబీనా. శిక్షణ...: హైదరాబాద్‌లోని ఖాజానగర్, సయ్యద్‌నగర్, బోలానగర్, అహమద్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి పేదమహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి రకరకాల పనులకు సంబంధించి ఉచిత శిక్షణ ఇప్పించారు రుబీనా. బంజార్‌హిల్స్‌లోని బోలానగర్ సఫా సంస్థలో వీరికి శిక్షణకు కావాల్సిన ఏర్పాటు చేశారు. మెహెందీ, స్క్రీన్ ప్రింటింగ్, జ్యూట్ బ్యాగ్ మేకింగ్, ఎకో ఫ్రెండ్లీ బ్యాగులు, కొవ్వొత్తుల... ఇలా చాలా రకాల పనులు చేస్తున్నారక్కడ. ‘‘మొదట్లో నేనొక్కదాన్నే ఇళ్లకు తిరిగి నేను చేయబోయే పని గురించి చెప్పాను. చాలామంది నమ్మలేదు. ఓ ఇద్దరు ముగ్గురు మా సంస్థలో పని నేర్చుకుని నాలుగు రూపాయలు సంపాదించుకున్నారని తెలిసాక ఒక్కొక్కరూ బయటికి రావడం మొదలుపెట్టారు. పైగా ఇంటి దగ్గరే పనిచేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చనే మాట చాలామంది ముస్లిం మహిళల్ని ‘సఫా’వైపు అడుగులు వేయించింది’’ అని చెప్పారు రుబీనా. వీరిలో గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలు కూడా ఉన్నారు. ఆర్థికంగా నిలబడి, పిల్లల్ని చదివించుకోవాలనే ధ్యేయంతో గడపదాటిన వీరికి ‘సఫా’ చక్కని మార్గంగా నిలిచింది. మార్కెటింగ్...: తమను ఆశ్రయించిన మహిళలకు ఏ పనంటే ఇష్టమో కనుక్కొని దానిపై శిక్షణ ఇప్పించి చేతినిండా పని ఉండేలా ప్లాన్ చేయడంలో విజయం సాధించడం వెనక రుబీనా శ్రమ చాలా ఉంది. వస్తువు తయారుచేయడం ఒకెత్తయితే, దాన్ని మార్కెట్ చేయడం మరొకెత్తు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో దీన్ని మించిన సవాలు మరొకటి లేదు. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా తయారుచేస్తున్న సఫాలోని ప్రతి వస్తువూ ఓ పేదమహిళ కడుపు నింపుతుందని తెలిస్తే మనసున్న ప్రతి ఒక్కరూ వాటిని కొనడానికి ముందుకొస్తారని చెప్పింది అక్కడ ఉపాధి పొందుతున్న హైమది బేగం. పేద పిల్లల కోసం...: కొందరు అనాథ పిల్లలనూ తండ్రి లేక ఆసరా కోల్పోయిన పిల్లలు కొందరినీ రుబీనా ఉచితంగా చదివిస్తున్నారు. ‘‘బోలానగర్లోని 140 మంది పేద పిల్లల్ని స్కూల్లో చేర్పించాం. వారి బాగోగులు ‘సఫా’నే చూసుకుంటుంది. నేను చేస్తున్న సేవాకార్యక్రమాలకు ఉపాధి పొందడానికి వచ్చిన పేదమహిళలు కూడా పని సాయం చేసి పెడుతున్నారు. స్నేహితులు, బంధువులు చేతిసాయం చేస్తున్నారు. చాలావరకూ మా సంస్థలో తయారయిన సరుకు మార్కెటింగ్‌లో వచ్చిన లాభాలే మమ్మల్ని ముందుకు పంపుతున్నాయి. భవిష్యత్తులో మరింతమంది మహిళలకు శిక్షణలు ఇచ్చి, పెద్దఎత్తున వస్తువులను తయారు చేసి వేలాదిమందికి ఉపాధి కల్పించాలన్నది నా ఆశయం’’ అని చెప్పారు రుబీనా. ‘‘వేడుకలకు వెళ్లకపోయినా ఫరవాలేదు, ఎవరికైనా ఆపదొచ్చినప్పుడు వెంటనే పరుగులు పెట్టకపోతే మనం మనుషుల లెక్కల్లో లేనట్టే తల్లీ’’ అంటూ ఒళ్లో కూర్చోబెట్టుకుని తాతయ్య చెప్పిన మాటల్ని ఈరోజుకూ గుర్తుచేసుకుంటూ ఉంటారు రుబీనా. ఆమెనూ, ఆమె ఆశయాన్నీ ముందుకు నడిపిస్తున్నది అదే! - భువనేశ్వరి, ఫొటోలు: మోహన్ ‘‘సౌదీ నుంచి హైదరాబాద్‌కి రాగానే ఇక్కడ ట్రావెల్ అండ్ టూరిజమ్ ట్రైనింగ్ సెంటర్‌ని స్థాపించాను. చాలా రకాల కార్పొరేట్ సంస్థలతో నాకు పరిచయాలు ఏర్పాడ్డాయి. సఫాలో తయారుచేసిన జ్యూట్ బ్యాగులు, లాప్‌ట్యాప్ కవర్లు, హాండ్ బ్యాగులు, సెల్ పౌచ్‌లు, ట్రావెల్ బ్యాగులు, పెన్ స్టాండ్లను ఆ కంపెనీల్లో అమ్మేలా మార్కెటింగ్ చేసుకున్నాను. దీనికోసం ఆన్లైన్ సహకారం కూడా తీసుకుంటున్నాను. www.safaindia.org ద్వారా మా ‘సఫా’ ఉత్పత్తుల్ని చాలామంది కొనుగోలు చేస్తున్నారు’’ అని వివరించారు రుబీనా.