breaking news
transport problems
-
ఈ కష్టాలను తీర్చే దారి లేదా?
వాంకిడి(ఆసిఫాబాద్)/దహెగాం(సిర్పూర్): గ్రామీణ ప్రాంతాల్లో సరైన రవాణా సదుపాయాలు, దారులు లేక అత్యవసర సమయాల్లో గిరిజనులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. తాజాగా ఓ గర్భిణి నడుం నొప్పితో ఆస్పత్రికి వెళ్లడానికి ఇబ్బంది పడితే, ప్రసవం కోసం మరో నిండు గర్భిణి నరకయాతన పడిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. సరైన దారిలేక అంబులెన్స్ రాకపోవడంతో వాంకిడి మండలం గోందాపూర్కు చెందిన గిరిజన మహిళ పురుటినొప్పులతో విలవిలలాడింది.డొంగర్గాం గ్రామానికి చెందిన ఆత్రం రాజు, కన్నుబాయి దంపతుల కుమార్తె దేవుబాయిని చౌపన్‌గూడ పంచాయతీ పరిధిలోని గోందాపూర్కు చెందిన మడావి మెంగుకు ఇచ్చి వివాహం చేశారు. గర్భిణిగా ఉన్న దేవుబాయి ఇటీవల తన తల్లి గ్రామమైన డొంగర్గాంకు వెళ్లింది. బుధవారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో గ్రామస్తులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే ఈ గ్రామం గుట్టపై ఉండడంతో సుమారు నాలుగు కిలోమీటర్లు వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.అంబులెన్స్‌ను గుట్ట కింద ఉన్న దొడ్డగూడ సమీపంలోనే నిలిపివేశారు. దీంతో దిక్కుతోచనిస్థితిలో నిండు గర్భిణి గ్రామస్తులు, కుటుంబ సభ్యుల సాయంతో వర్షంలో తడుస్తూ కొంతదూరం నడిచింది. ఆ తర్వాత బైక్‌పై అంబులెన్స్ వరకు తీసుకువచ్చారు. అనంతరం ఆమె వాంకిడి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వైద్యుల సూచనల మేరకు దేవుబాయికి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో మహిళకూ దారి కష్టాలే..కుమురంభీం జిల్లాలోనే దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన నైతం సమ్మక్క అనే తొమ్మిది నెలల నిండు గర్భిణికి గురువారం సాయంత్రం నడుం నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. అయితే దారి సరిగ్గా లేదని అంబులెన్సు డ్రైవర్ గ్రామంలోకి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు సమ్మక్కను ఆటో ఎక్కించారు. ఇటీవల భారీ వర్షాలకు రోడ్డు అక్కడక్కడా కోతకు గురికావడం వల్ల ఆటో వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సమ్మక్కను నడిపించుకుంటూ కర్జి గ్రామం ప్లాంటేషన్ వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో దహెగాంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. -
స్తంభించిన రవాణా
చార్జీలపై లారీల సమ్మె ఫైనా¯Œ్స ఎంట్రీ వందల రెట్లు పెరుగుదల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆలస్యమైనా జేబు గుల్లే సాక్షి, రాజమహేంద్రవరం: రవాణారంగానికి సంబంధించిన చట్టానికి సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనివల్ల రవాణారంగం కుదేలవుతుందని రవాణాదార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మోటారు వెహికల్ నిబంధనల చట్టం (1989)లో చార్జీలకు సంబంధించిన రూల్ నం. 32, 81లను సవరించడంతో సరుకు రవాణా వాహనాలపై చార్జీలు భారీగా పెరిగిపోయాయి. దీన్ని నిరసిస్తూ పలు మార్లు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. గత నెల తొమ్మిదో తేదీన బంద్ పాటించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గురువారం నుంచి దేశ వ్యాప్తంగా సమ్మె చేపట్టారు. ఆందోళనలు ఇందుకే.. మోటార్‌సైకిల్ రిజిస్ట్రేష¯ŒS చార్జీ గతంలో రూ.450 ఉండగా ప్రస్తుతం రూ.685 చలానా కట్టించుకుంటున్నారు. కారుకు గతంలో రూ. 735 ఉండగా అది రూ. 1135కు పెరిగింది. కారు ఫైనా¯Œ్స ఎంట్రీ రూ. 735 ఉండగా అది కాస్త మూడురెట్లు పెరిగి రూ. 2,035లకు చేరుకుంది. ఆటో, లైట్వెహికల్, వ్యవసాయ అవసరాలకు వినియోగించే ట్రాక్టర్ రిజిస్ట్రేషన్, ట్రా¯Œ్సఫర్, ఫైనా¯Œ్స ఎంట్రీ చార్జీలు విపరీతంగా పెంచారు. ఈ వాహనాలకు గతంలో రిజిస్ట్రేష¯ŒS చార్జీ చలానా రూ.450 నుంచి రూ. 1150లకు పెంచారు. ట్రా¯Œ్సఫర్ రూ. 250 నుంచి రూ.650లకు, ఫైనా¯Œ్స ఎంట్రీ రూ.100 నుంచి ఏకంగా రూ.1650లకు పెంచేశారు. లారీ రిజిస్ట్రేష¯ŒS గతంలో రూ. 900 ఉండగా ఇప్పడు రెట్టింపయింది. ట్రా¯Œ్సఫర్ చలానా రూ. 600 నుంచి రూ.1050కు పెంచారు. ఫైనా¯Œ్స ఎంట్రీ రూ. 400 ఉండగా ఇప్పడు రూ. 3,300లకు చేరుకుంది. వాహనాలు రిజిస్ట్రేష¯ŒS చేయించడంలో ఆలస్యమైతే అపరాధ రుసుం ప్రతి మూడు నెలలకో విధంగా పెంచారు. గతంలో ఏదైనా వాహనం విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటే ఆవాహనాలపై చార్జీ రూ. 100 ఉండగా ఇప్పుడు దాన్ని రూ. 2,500 చేశారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆలస్యంపై బాదుడే.. సాధారణంగా ప్రతి ఏడాదీ వాహనాన్ని పరీక్షంపజేసుకుని ఫిట్¯ðనెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. కొత్త నిబంధనల ప్రకారం ఈ సర్టిఫికెట్ ఆలస్యమైతే గడువుతీరిన తర్వాత రోజుకు రూ. 50 చొప్పున అపరాధ రుసుం విధిస్తారు. ఆందోళనలు విరమించేది లేదు రాష్ట్ర విభజన తర్వాత రవాణా రంగం కుదేలయింది. అప్పటికే చార్జీలు కట్టినా తెలంగాణలోకి వెళితే తాజాగా చలానాలు కట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఈ చార్జీలు పెంచడం వల్ల రవాణా రంగం కోలుకోలేదు. ఆదాయమే పరమావధిగా చార్జీలను విపరీతంగా పెంచేశారు. ప్రభుత్వం తమ నిర్ణయంపై పునరాలోచన చేసే వరకు సమ్మె కొనసాగుతుంది. – వాసంశెట్టి గంగాధరరావు, ఆటోవర్కర్స్ యూనియ¯ŒS ప్రెసిడెంట్, రాజమహేంద్రవరం -
కుండపోత వర్షం