24 నుంచి యోగా శిక్షణ
ఒంగోలు: పతంజలి యోగాపీఠం ఆ««దl్వర్యంలో ఈ నెల 24 నుంచి ఒంగోలు, చీమకుర్తి, చీరాల తదితర ప్రాంతాల్లో యోగా సర్టిఫికెట్ కోర్సు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పతంజలి యోగపీఠం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు గంధవల్లి బాలసుబ్రహ్మణ్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వయసు18 ఏళ్లు నిండి ఉంది కనీస విద్యార్హత పదిగా కలిగిన వారు ఈ కోర్సు అభ్యసించేందుకు అర్హులన్నారు. మొత్తం 140 గంటల పాటు స్థానికంగా శిక్షణ ఇస్తారన్నారు. అనంతరం 60గంటల పాటు స్వయంగా యోగారుషి రాందేవ్జి వద్ద శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. శిక్షణ పొందిన వారు భవిష్యత్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యోగా టీచర్లుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. వివరాలకు చీరాల వాసులు సెల్: 9390 010267, చీమకుర్తి సెల్:9885608998, మిగిలిన ప్రాంతాల వారు ఒంగోలు సెల్:9618701010 నంబర్లను సంప్రదించాలన్నారు.