breaking news
Train accident prevention
-
గణనీయంగా తగ్గిన రైల్వే ప్రమాదాలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత రైల్వేల్లో ప్రమాదాల సంఖ్య గత దశాబ్దంలో గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక ఆధునిక సాంకేతిక పద్ధతులు, మౌలిక వసతుల అభివృద్ధి చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఫలితాలు కనిపిస్తున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘‘2014–15 ఏడాదితో పోలిస్తే 2024–25లో ప్రమాదాలు 77 శాతం తగ్గాయి. 2024–25లో కేవలం 31 ప్రమాదా లు సంభవించాయి. 2025–26లో జూన్ చివరివరకు కేవలం 3 ప్రమాదాలు మాత్రమే నమోదయ్యాయి. 2014–15 ఏడాదిలో ప్రతి 10,00,000 కిలోమీటర్ల రైలు ప్రయాణాలకు 0.11 శాతం మాత్రమే ప్రమాదాలు సంభవించాయి. 2024–25లో ఇది మరింతగా తగ్గి 0.03 శాతానికి దిగొచ్చింది. అంటే రైలు ప్రమాదాలు ఏకంగా 73 శాతం తగ్గాయి. 2004–14 కాలంలో 1,711 రైల్వే ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 904 మంది మృతి చెందారు. 3,155 మంది గాయపడ్డారు. 2014–24 కాలంలో 678 ప్రమాదాలు సంభవించాయి. మొత్తంగా 748 మంది మరణించారు. 2,087 గాయపడ్డారు’’అని మంత్రి తెలిపారు. ప్రమాద బాధితులకు రూ. 67.59 కోట్ల పరిహారం ‘‘2020 నుంచి ఇప్పటివరకు రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినవారికి లేదా గాయపడినవారికి రూ. 37 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాం. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ద్వారా తేలిన పరిహారంగా రూ.30.59 కోట్లు చెల్లించాం. ట్రిబ్యునల్ పరిహారం ఎక్స్‌గ్రేషియాకు అదనం. ఇది న్యాయ ప్రక్రియ ప్రకారం మాత్రమే కల్పిస్తాం’’అని మంత్రి అన్నారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ‘‘భద్రతకు అత్యంత ప్రాధాన్యం కల్పించాం. దేశవ్యాప్తంగా 6,635 రైల్వే స్టేషన్లలో ఎల్రక్టానిక్ ఇంటర్‌లాకింగ్ అమలు చేశాం. 2020 ఏడాదిలో కవచ్ వ్యవస్థ ఆమోదం పొందింది. 2025 జూలై 30 నాటికి కోటా–మథురా మా ర్గంలో 324 కిలోమీటర్ల మేర కవచ్‌ను కొత్తగా అమల్లోకి తెచ్చాం. 2014లో 90 మాత్రమే ఉన్న ఫాగ్ సేఫ్టీ డివైజ్‌ల సంఖ్యను 2025 నాటికి 25,939 యంత్రాలకు పెంచాం. 2004–14 కాలంలో కొత్తగా 14,985 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను వేశాం. 2014–24 కాలంలో ఇది 34,428 కి.మీకు పెరిగింది. బ్రిడ్జిలు, రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాసుల సంఖ్య 4,148 నుంచి 13,808కి పెరిగింది. ఐసీఎఫ్ కోచ్‌ల స్థానంలో ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లకు మార్చాం. అన్ని బ్రాడ్ గేజ్ మార్గాల్లో 2019 నాటికి అన్మాన్డ్ లెవెల్ క్రాసింగ్‌ల ఇబ్బందులను పూర్తిగా తొలగించాం’’అని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. -
ప్రయోగం ఘనం.. అమలులో జాప్యం
యూరప్ దేశాల్లో అమల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మించి భారత రైల్వే పరిశోధన సంస్థ (ఆర్డీఎస్ఓ) రూపొందించిన డిజైన్‌తో కర్నెక్స్, మేధా, హెచ్‌బీఎల్ కంపెనీల ఆధ్వర్యంలో ఏడాదిన్నరగా సుమారు రూ.40కోట్ల వ్యయంతో వికారాబాద్-వాడీ, వికారాబాద్-బీదర్, వికారాబాద్-లింగంపల్లి జంక్షన్ల మధ్య రైళ్లు ఢీకొని ప్రమాదాలు జరుగకుండా వివిధ అంశాల్లో చేసిన టీకాస్ ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. 2012 నుంచి 2014 జనవరి వరకు వివిధ దశల్లో టీకాస్ ప్రయోగాలు చేపట్టారు. ప్రయోగాలు విజయవంతమైనట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు. కర్ణాటక సరిహద్దులో ప్రయోగాలు కర్ణాటక సరిహద్దులోని మంతట్టి, నవాంద్గీ రైల్వేస్టేషన్లో చేసిన టీకాస్ ప్రయోగాలను ఇటీవల రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే బోర్డు చైర్మన్, సభ్యులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మూడు కంపెనీల సాంకేతిక పరికరాల మధ్య అనుసంధాన ప్రక్రియ ముగిసిన తక్షణమే రైల్వే బోర్డు, ప్రభుత్వ అనుమతితో ఈ ఏడాదిలో అమల్లోకి తెస్తామని పేర్కొన్నా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రమాదాలను ఇలా నివారిస్తుంది ఎదురెదురుగా ఒకే ట్రాక్‌పై రైళ్లు.. ఒక ట్రాక్‌పై ఆగి ఉన్న రైలును వెనుక నుంచి మరో రైలు ఢీకొని ప్రమాదాలు సంభవించకుండా టీకాస్ నివారిస్తుంది. రైలు డీరేల్మెంట్ (పట్టాలు తప్పినప్పుడు) జరిగిన విషయాన్ని ఆ రైల్వే మార్గంలో రాకపోకలు సాగించే ఇతర రైళ్ల డ్రైవర్లకు సమాచారాన్ని అందించి అప్రమత్తం చేయడం దీని ప్రత్యేకత. పొగమంచు, పొగతో ఎదురుగా ఎరువు, ఆకుపచ్చ, పసుపు సిగ్నల్ ఇండికేటర్లు కనిపించకపోయినా డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించకపోయినా స్వయంగా రైలును నిర్ధేశించిన దూరంలో ఆటోమెటిక్‌గా బ్రేక్‌లు వేసి ఆపేస్తుంది. రైలు ఇంజిన్‌లో ఏర్పాటు చేసే టీకాస్ బాక్స్‌ను విమానాల్లో ఉపయోగించే ‘బ్లాక్ బాక్స్’ తరహా ప్రమాణాల తో రూపొందించారు. రైలు ప్రమాదానికి గురైనా బా క్స్ దెబ్బతినకుండా పని చేస్తూ, ఆ మార్గంలో వచ్చే ఇతర రైళ్లు ప్రమాదానికి గురికాకుండా డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది. రైల్వే లెవల్ క్రాసింగ్(గేట్)లు, మోడల్ గేట్లు ఎంత దూరంలో ఉన్నాయనే విషయాన్ని గుర్తించి డ్రైవర్‌కు సమాచారం ఇస్తుంది. కాపాలా లేని రైల్వే గేట్ల వద్ద కిలోమీటర్ దూరం నుంచే సైరన్ మోగిస్తూ వాహనదారులను అప్రమత్తం చేస్తుంది. రైల్వేవంతెనలు, ట్రాక్ పనులు, మలుపుల వద్ద రైలు వేగాన్ని ఆటోమెటిక్‌గా నియంత్రిస్తుంది. టీకాస్ వ్యవస్థ మొత్తం రేడియో ప్రీక్వెన్సీ టాగ్ (ఆర్ఎఫ్టీఏజీ), రేడియో కమ్యూనికేషన్‌పై పని చేస్తుంది. ఎదురుగా మరో రైలు ఉన్నప్పుడు 200 కి.మీ. వేగాన్ని కూడా నియంత్రిస్తుంది.