ప్రయోగం ఘనం.. అమలులో జాప్యం | 'tikas' special for train accident prevention | Sakshi
Sakshi News home page

ప్రయోగం ఘనం.. అమలులో జాప్యం

Jul 27 2014 12:07 AM | Updated on Mar 28 2018 11:05 AM

ప్రయోగాలు విజయవంతమైనట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు.

యూరప్ దేశాల్లో అమల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మించి భారత రైల్వే పరిశోధన సంస్థ (ఆర్‌డీఎస్‌ఓ) రూపొందించిన డిజైన్‌తో కర్నెక్స్, మేధా, హెచ్‌బీఎల్ కంపెనీల ఆధ్వర్యంలో ఏడాదిన్నరగా సుమారు రూ.40కోట్ల వ్యయంతో వికారాబాద్-వాడీ, వికారాబాద్-బీదర్, వికారాబాద్-లింగంపల్లి జంక్షన్‌ల మధ్య రైళ్లు ఢీకొని ప్రమాదాలు జరుగకుండా వివిధ అంశాల్లో చేసిన టీకాస్ ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. 2012 నుంచి 2014 జనవరి వరకు వివిధ దశల్లో టీకాస్ ప్రయోగాలు చేపట్టారు. ప్రయోగాలు విజయవంతమైనట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు.  

 కర్ణాటక సరిహద్దులో ప్రయోగాలు
 కర్ణాటక సరిహద్దులోని మంతట్టి, నవాంద్గీ రైల్వేస్టేషన్‌లో చేసిన టీకాస్ ప్రయోగాలను ఇటీవల రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే బోర్డు చైర్మన్, సభ్యులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మూడు కంపెనీల సాంకేతిక పరికరాల మధ్య అనుసంధాన ప్రక్రియ ముగిసిన తక్షణమే రైల్వే బోర్డు, ప్రభుత్వ అనుమతితో ఈ ఏడాదిలో అమల్లోకి తెస్తామని పేర్కొన్నా మీనమేషాలు లెక్కిస్తున్నారు.

 ప్రమాదాలను ఇలా నివారిస్తుంది
ఎదురెదురుగా ఒకే ట్రాక్‌పై రైళ్లు.. ఒక ట్రాక్‌పై ఆగి ఉన్న రైలును వెనుక నుంచి మరో రైలు ఢీకొని ప్రమాదాలు సంభవించకుండా టీకాస్ నివారిస్తుంది.

రైలు డీరేల్‌మెంట్ (పట్టాలు తప్పినప్పుడు) జరిగిన విషయాన్ని ఆ రైల్వే మార్గంలో రాకపోకలు సాగించే ఇతర రైళ్ల డ్రైవర్లకు సమాచారాన్ని అందించి అప్రమత్తం చేయడం దీని ప్రత్యేకత.

పొగమంచు, పొగతో ఎదురుగా ఎరువు, ఆకుపచ్చ, పసుపు సిగ్నల్ ఇండికేటర్‌లు కనిపించకపోయినా డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించకపోయినా స్వయంగా రైలును నిర్ధేశించిన దూరంలో ఆటోమెటిక్‌గా బ్రేక్‌లు వేసి ఆపేస్తుంది.

రైలు ఇంజిన్‌లో ఏర్పాటు చేసే టీకాస్ బాక్స్‌ను విమానాల్లో ఉపయోగించే ‘బ్లాక్ బాక్స్’ తరహా ప్రమాణాల తో రూపొందించారు.  రైలు ప్రమాదానికి గురైనా బా క్స్ దెబ్బతినకుండా పని చేస్తూ, ఆ మార్గంలో వచ్చే ఇతర రైళ్లు ప్రమాదానికి గురికాకుండా డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది.

రైల్వే లెవల్ క్రాసింగ్(గేట్)లు, మోడల్ గేట్‌లు ఎంత దూరంలో ఉన్నాయనే విషయాన్ని గుర్తించి డ్రైవర్‌కు సమాచారం ఇస్తుంది. కాపాలా లేని రైల్వే గేట్‌ల వద్ద కిలోమీటర్ దూరం నుంచే సైరన్ మోగిస్తూ వాహనదారులను అప్రమత్తం చేస్తుంది.

రైల్వేవంతెనలు, ట్రాక్ పనులు, మలుపుల వద్ద రైలు వేగాన్ని ఆటోమెటిక్‌గా నియంత్రిస్తుంది.

టీకాస్ వ్యవస్థ మొత్తం రేడియో ప్రీక్వెన్సీ టాగ్ (ఆర్‌ఎఫ్‌టీఏజీ), రేడియో కమ్యూనికేషన్‌పై పని చేస్తుంది. ఎదురుగా మరో రైలు ఉన్నప్పుడు 200 కి.మీ. వేగాన్ని కూడా నియంత్రిస్తుంది. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement