breaking news
trailer innovation
-
రాత్రికిరాత్రే బిచ్చగాళ్లను చేశారు
ప్రధాని నరేంద్రమోదీ ప్రజల్ని రాత్రికి రాత్రే బిచ్చగాళ్లను చేశారని నటుడు, దర్శక నిర్మాత మన్సూర్ అలీఖాన్ ధ్వజమెత్తారు. మైమోసా పతాకంపై పెట్టి సీకేపీఆర్.మోహన్ నిర్మించిన చిత్రం కొంచెం కొంచెం. నవ తారలు గోకుల్, నీనూ, ప్రియా మోహన్ నాయకానారుుకలుగా నటించిన ఈ చిత్రానికి ఉదయ్‌శేఖర్ దర్శకత్వం వహించారు.వల్లవన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ మలయాళ నిర్మాతలు నిర్మించిన చిత్రం ఇదన్నారు.మన కళాకారులు తెలుగు చిత్ర పరిశ్రమలో విజయం సాధిస్తునట్లుగానే వీరు ఇక్కడ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. తాను ఈ చిత్రంలో నటించానని, ఇది చాలా మంచి కథా చిత్రం అని పేర్కొన్నారు. ప్రధాని నిర్ణయాన్ని ఖండించాలి కాగా తానీ రోజు ఒక చిత్ర షూటింగ్లో పాల్గొనాల్సి ఉందని,అరుుతే కళాకారులకు, కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి ఉండడంతో నిర్మాతలు డబ్బును మార్చడానికి బ్యాంకుకు వెళ్లడంతో షూటింగ్‌ను ఒక పూట రద్దు చేశారని తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్రమోదీని నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారని అన్నారు. ఇది నల్లధనాన్ని అరికట్టే చర్య అని చాలా మంది అంటున్నారన్నారని నిజానికి ప్రధాని ప్రకటన ప్రజలను రాత్రికి రాత్రే బిచ్చగాళ్లను చేసిందని ధ్వజమెత్తారు.ఆర్థిక సమస్యలతో చిత్ర పరిశ్రమ అతలాకుతలం అవుతోందన్నారు.ప్రజలు చిల్లర డబ్బులు లేక వీధిన పడ్డారని పేర్కొన్నారు. ఇక ప్రేక్షకులు సినిమాలు చూడడానికి థియేటర్లకు రావడం లేదన్నారు.నిత్యావసర ఖర్చులకు కూడా డబ్బు లేక నానా అవస్థలు పడుతున్నారని, డబ్బును మార్చుకోవడానికి బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి పడిగాపులు పడుతున్నారని అన్నారు.దీంతో గత ఐదు రోజులుగా థియేటర్లు జనాలు లేక మూత పడే పరిస్థితి నెలకొందన్నారు. చిత్రపరిశ్రమ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటోందన్నారు.ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయాన్ని అందరూ ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. సినీ కళాకారులందరూ పోరాటం చేయాలని మన్సూర్ అలీఖాన్ ఉద్వేగంగా మాట్లాడారు. మంలో సీనియర్ దర్శకుడు ఎస్పీ.ముత్తురామన్, శీనూరామసామి సుశీందర్, జాగ్వర్ తంగం పాల్గొన్నారు. -
సెన్సార్‌కు భయపడకూడదు
తమిళసినిమా: చిత్ర నిర్మాతలు సెన్సార్ బోర్డుకు భయపడకూడదని సీనియర్ నటుడు, సెన్సార్ బోర్డు సభ్యుడు ఎస్వీ.శేఖర్ వ్యాఖ్యానించారు. కే 3 క్రియేషన్స పతాకంపై ప్రతాప్ మురళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం తిట్టివాసల్. ప్రముఖ నటుడు నాజర్ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో మహేంద్రన్, తనూశెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. చిత్ర ఆడియో, ట్రైలర్లను నటుడు, నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్ ఆవిష్కరించగా తొలి ప్రతులను ఎస్వీ.శేఖర్, యూటీవీ ధనుంజయన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్వీ.శేఖర్ మాట్లాడుతూ ఖర్చు చేసే ప్రతి రూపాయి చిత్రంలో తెలియాలన్నారు. అది ఈ చిత్రంలో స్పష్టంగా తెలుస్తోందని అందుకు చిత్ర నిర్మాతను అభినందిస్తున్నానని అన్నారు.అయితే ఒక సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఒక సూచన చేయాలనుకుంటున్నానన్నారు. దయ చేసి చిత్ర విడుదల తేదీని నిర్ణయించి సెన్సార్‌కు వెళ్లకండని అన్నారు. అలా వెళితే తగిన సమయం లేకపోవడంతో సెన్సార్ వారు షరతులకు తలవంచాల్సి వస్తుందన్నారు. నిర్మాతలకు ధైర్యం చాలా అవసరం అన్నారు.చిత్రాలు మీవని, మీరు చట్టబద్ధంగానే చిత్రాలు చేస్తున్నారని, అందువల్ల సెన్సార్ వారి చెప్పినట్లు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. విడుదలకు సమయం ఉంటే సెన్సార్ వారి నిబంధనలకు తలవంచాల్సిన అవసరం మీకుండదని ఎస్వీ.శేఖర్ అన్నారు.