breaking news
tragic shades
-
డెటాల్ బాటిల్లో మద్యం.. భర్త చేతిలో నిత్యం నరకం
బాలీవుడ్ తెరపై ‘ట్రాజెడీ క్వీన్’గా పేరొందిన మీనా కుమారి తన నిజ జీవితంలో లెక్కలేనన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. అడుగడుగునా అవమానాలు, ఆప్యాయతకు అల్లంత దూరంలో సాగిన ఆమె జీవితం వెండితెరపై మెరిసినా, తెరవెనుక మాత్రం చిమ్మచీకటిగానే గడిచింది.పుట్టుకతోనే మొదలైన చీకటి ప్రయాణంమీనా కుమారి జననం అపశకునంగా భావించిన తండ్రి, ఆమె పుట్టిన గంటల వ్యవధిలోనే అనాథాశ్రమం పాలు చేశాడు. ఆ తర్వాత మనసు మార్చుకుని ఇంటికి తెచ్చినా, ప్రేమకు బదులుగా ఆమెను ఒక ‘ఆర్థిక వనరు’గా మాత్రమే చూశాడు. కేవలం నాలుగు సంవత్సరాల ప్రాయంలోనే ఆమెను సినిమాల్లోకి నెట్టి, కుటుంబ పోషణ బాధ్యతను ఆ చిన్నారి భుజాలపై మోపాడు.బాల్యం నుండి బానిసత్వం వైపుబాల్యం అంటే ఆటపాటలు అనుకునే వయసులో, మీనా సెట్స్‌లో కష్టపడటం మొదలుపెట్టారు. 1939లో ‘లెదర్ ఫేస్’ సినిమాతో మొదలైన ఆమె ప్రస్థానం, 13 ఏళ్లకే హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే, తన కష్టార్జితం అంతా తండ్రి జేబులోకి వెళ్తుండటంతో, తను సంపాదిస్తున్నా ఆర్థికంగా మాత్రం బానిసగానే మిగిలిపోయారు.కమల్ అమ్రోహితో ప్రేమ, తండ్రి నిర్బంధంకెరీర్ సాగుతుండగా దర్శకుడు కమల్ అమ్రోహితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఒక ప్రమాదం తర్వాత, తన కంటే 15 ఏళ్లు పెద్దవారైన కమల్ ఆమెను చూసుకోవడం, ఆపై వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడం జరిగాయి. అయితే, ఈ బంధాన్ని అంగీకరించని ఆమె తండ్రి కఠినంగా వ్యవహరించారు. ఫలితంగా, తండ్రిని ఎదిరించి ఆమె కమల్ అమ్రోహి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది.షరతులతో కూడిన వైవాహిక జీవితంకమల్ అమ్రోహితో జీవనం ఆమెకు స్వర్గధామం కాలేదు. తనతో ఉండాలంటే ఇతర దర్శకులతో పనిచేయకూడదని, సాయంత్రం 6 గంటలకే ఇంటికి రావాలని, మగవారు మేకప్ రూమ్‌లోకి రాకూడదని కమల్ విధించిన షరతులకు ఆమె తలొగ్గారు. ఆ బంధంలో ప్రేమ కంటే నియంత్రణే ఎక్కువగా ఉండటంతో, అది మెల్లగా కారాగారంగా మారింది.గృహహింసకు సాక్ష్యంగా నిలిచిన స్నేహితులుషరతులతో కూడిన బంధం చివరకు రోజూవారీ గొడవలకు, శారీరక హింసకు దారితీసింది. వారి మధ్య గొడవలకు నటి నర్గీస్ లాంటి వారు కూడా సాక్ష్యంగా నిలిచారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆత్మాభిమానం గాయపడటంతో చివరికి వారి బంధం విడాకులతో ముగిసింది.మద్యం సాక్షిగా మరణం వైపు ప్రయాణంజీవితంలో ఎదురైన ఒంటరితనం, మానసిక క్షోభ నుండి బయటపడటానికి మీనా కుమారి మద్యాన్ని ఆశ్రయించారు. అది అలవాటుగా మారి, చివరకు డెటాల్ బాటిళ్లలో కూడా మద్యం దాచుకుని తాగే స్థాయికి వెళ్లారు. 1968లో ఆమెకు ‘లివర్ సిరోసిస్’ ఉన్నట్లు తేలింది. చికిత్స కోసం విదేశాలకు వెళ్లినా, ఆమె పూర్తిగా కోలుకోలేదు.అనాథగా కన్నుమూసిన అద్భుత నటి1972లో ఆమె నటించిన మాస్టర్ పీస్ ‘పాకీజా’ విడుదలైన కొద్ది రోజులకే ఆమె మరణించారు. దీనికి మూడు రోజుల ముందు నుండే ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. చివరి సమయంలో ఆమె పక్కన ఆత్మీయులు ఎవరూ లేరు. ఎన్నో ఆశలతో రూపొందించిన ఆ సినిమా ఘనవిజయాన్ని కూడా చూడకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.ఇది కూడా చదవండి: 16 నుంచి జగన్నాథ రథయాత్ర.. 10 ఆసక్తికర విషయాలు! -
కుప్ప కూలిన బతుకులు
వారు రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు. కూలి పనులే వారికి ఉపాధి. పొట్ట కూటి కోసం ఉపాధి పనులకు వెళ్లి తిరుగు పయనం కాగా.. వారు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడటంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బి.కోడూరు : బి.కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సుమారు 20 మంది ఉపాధి కూలీలు ఉపాధి పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 నిమిషాల్లో ఇళ్లు చేరతామనుకుంటున్న సమయంలో శ్రీరామ్‌నగర్ గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో పందీటి వెంకటసుబ్బమ్మ (48), పందీటి ఆదిలక్షుమ్మ (28) అనే మహిళలపై ఆటో బోల్తాపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వీరిని బద్వేలులోని ప్రభుత్వాసుత్రికి తీసుకెళ్లగా అప్పటికే వెంకటసుబ్బమ్మ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదిలక్షుమ్మను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఆదిలక్షుమ్మకు భర్త ఓబులేసు, అవినాష్ (4), అఖిల్ (2), లక్ష్మి (3 నెలలు) పిల్లలు ఉన్నారు. తల్లి మృతితో పిల్లలు అనాథలుగా మారారు. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన లక్కినేని శేఖర్ అనే వ్యక్తికి కాలు విరిగిపోగా, పందీటి అచ్చమ్మకు తలకు తీవ్ర గాయమైంది. లక్కినేని లలితమ్మకు నడుం భాగం, తలకు తీవ్ర గాయాలు కాగా నాగిపోగు పోలమ్మ, లక్కినేని నారాయణమ్మ, పందీటి ఓబులమ్మ, పందీటి రాజా, అట్లూరు గోపాలయ్య, పందీటి చిన్నయ్య, నాగిపోగు గుర్రమ్మ, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిని కడప రిమ్స్‌కు తరలించారు. వీరిలో నాగిపోగు పోలమ్మ, అట్లూరు గోపాలయ్యల పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. మృతులు, క్షతగాత్రులు అంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంపీడీఓ మల్లన్న, మండల తహసీల్దారు దుగ్గిరెడ్డి, ఏపీఓ నాగిరెడ్డి, బి.కోడూరు ఎస్ఐ బాలమద్దిలేటిలు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఎమ్మెల్యే జయరాములు, వైవీయూ పాలకమండలి సభ్యురాలు విజయజ్యోతి, డ్వామా పీడీ హరిహరనాథ్, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచు బోరెడ్డి శేషారెడ్డి, నాయకులు బోడి రమణారెడ్డి, రామచంద్రారెడ్డి, మున్నెల్లి సర్పంచు ఓ.రమణారెడ్డిలు పరామర్శించి మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు బి.కోడూరు ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన 108 వాహనం ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చినా సరైన సమయంలో అంబులెన్స్ రాలేదు. దీంతో క్షతగాత్రులంతా రోడ్డుపై అలాగే పడిపోయి ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేటు వాహనాలలో కొంత మందిని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సకాలంలో అంబులెన్స్ వచ్చి ఉంటే వెంకటసుబ్బమ్మ, ఆదిలక్షుమ్మలు మృతిచెంది ఉండేవారు కాదని గ్రామస్తులు పేర్కొన్నారు. -
వేడుకలో విషాదం!
► ఈతముక్కల ప్రమాద మృతుల కుటుంబ సభ్యుల కన్నీరు ► రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతితో మిన్నంటిన రోదనలు ► మృతుల్లో ఇద్దరిది ఒంగోలు, మరో ఇద్దరిది కందులూరు ► రిమ్స్‌లో మృతుల బంధువులను పరామర్శించిన ఎంపీ వైవీ ఒంగోలు క్రైం : కొత్తపట్నం మండలం ఈతముక్కల వద్ద ఆదివారం రెండు బైకులు ఢీకొని నలుగురు మృతి చెందడంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలుగురూ ఆయా కుటుంబాలకు ఆధారంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి పగవానికి కూడా రాకూడదని మృతుల బంధువులు రోదిస్తున్నారు. ఒంగోలు భాగ్యనగర్‌కు చెందిన ఇద్దరు యువకులు, టంగుటూరు మండలం కందులూరుకు చెందిన మరో ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో నలుగురూ మృతి చెందారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒంగోలు భాగ్యనగర్‌కు చెందిన మృతుల్లో ఇద్దరు మేనమామ, మేనల్లుడు కావడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాయ ఛాయలు అలముకున్నాయి. స్వయానా రక్త సంబంధీకులు కావటమే కాకుండా పక్కపక్క నివాస గృహాలు కూడా. భాగ్యనగర్ మూడో లైన్‌లోని స్విమ్మింగ్ పూల్ ఎదురుగా వీరిద్దరి నివాసాలు. సంఘటన స్థలంలోనే మృతి చెందిన మండపల్లి అశోక్ (20) ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (పీడీసీసీ)లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పదో తరగతి చదువుకున్న అశోక్ రెండేళ్ల నుంచి బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. ఆ కుటుంబానికి అశోక్ ఒకే ఒక మగ సంతానం. తండ్రి హనుమంతురావు వాటర్ ట్యాంక్ పక్కన గేదెలు మేపుకుంటూ కుటుంబాన్ని ఎక్కదీశాడు. ఎదిగొచ్చిన బిడ్డ కుటుంబానికి అందివస్తాడనుకుంటే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలితీసుకుందని కన్నీరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు ఇక దిక్కెవరంటూ బోరుమంటున్నారు. అదే ప్రమాదంలో మృతి చెందిన భాగ్యనగర్‌కే చెందిన బత్తుల పవన్ (14)తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తన వరుసకు మేనమామ అశోక్ ద్విచక్ర వాహనంపై సహచరుల వినాయక విగ్రహ నిమజ్జనానికి వెళ్తుంటే సరదాగా తాను వస్తానని వారి వెంట వెళ్లాడు. పవన్ తండ్రి ఒంగోలు రిమ్స్‌లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ ఇంట్లో కూడా పవన్ ఒక్కడే మగ సంతానం. ఆ కుటుంబం దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తోంది. తీవ్ర గాయాలపాలై ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న కుట్టుబోయిన శివశంకర్ పరిస్థితి విషమంగా ఉంది. శివశంకర్ వల్లూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి లారీ క్లీనర్‌గా పనిచేస్తూ తనకు ఉన్న ముగ్గురు కుమారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ చదివిస్తున్నాడు. శివశంకర్ మూడో సంతానం. వీరిదీ అంతే.. ఇదే ప్రమాదంలో మృతి చెందిన టంగుటూరు మండలం కందులూరుకు చెందిన ఇద్దరి కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. ఆ రెండు కుటుంబాల్లోనూ వీరిద్దరే పెద్ద దిక్కు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఆ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినట్లయింది. ప్రమాద స్థలంలోనే మృతి చెందిన అల్లూరు రాంబాబు(35) కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తండ్రి ఇటీవలే చనిపోయాడు. భార్యతో పాటు తొమ్మిదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. కందులూరుకే చెందిన రెండో మృతుడు బొబ్బల కృష్ణమూర్తి (25) ఇంటికి పెద్ద కుమారుడు. రెండేళ్ల క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేసిన కృష్ణమూర్తి ఉద్యోగాల వేటలో నిమగ్నమై ఉన్నాడు. తండ్రి నిర్వహిస్తున్న వాటర్‌ప్లాంట్‌లో చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాడు. ఇతనికి తల్లిదండ్రులతో పాటు తమ్ముడు కూడా ఉన్నాడు. మృతుల కుటుంబాలకు ఎంపీ వైవీ పరామర్శ రిమ్స్‌లో ఉన్న మృతుల కుటుంబ సభ్యులను ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం రాత్రి పరామర్శించారు. సమాచారం తెలుసుకున్న ఎంపీ.. హుటాహుటిన రిమ్స్‌కు చేరుకున్నారు. అక్కడే న్న భాగ్యనగర్ మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. కందులూరు మృతుల కుటుంబ సభ్యులను కూడా రిమ్స్‌లోనే పరామర్శించారు. మృతదేహాలను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. ఒంగోలు టూటౌన్ సీఐ పి.దేవప్రభాకర్తో ప్రమాదం జరిగిన తీరును ఎంపీ అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచు గరటయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు వెన్నా హనుమారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, చుండూరి రవి ఉన్నారు.


