breaking news
Tractor rallies
-
ఉరకలెత్తిన ఉద్యమం
బొబ్బిలి, న్యూస్‌లైన్:సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం జిల్లా వ్యాప్తం గా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. వీరికి సమైక్యవాదులు మద్దుతుగా నిలబడ్డారు. జిల్లా కేంద్రంతో పాటు చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గ కేంద్రాల్లో ట్రాక్టర్ల ర్యాలీలు భారీగా జరిగాయి. జిల్లా కేంద్రంలో విజయనగరం నియోజకవర్గ సమన్వయకర్త అవనాపు విజయ్ ఆధ్వర్యంలో దాదాపు వంద ట్రాక్టర్లతో ర్యాలీని నిర్వహించారు. దీన్ని పార్టీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబ శివరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఆ పార్టీ నాయకుల ప్రచార కమిటీ జిల్లా కన్వీనరు గొర్లె వెంకటరమణ, కాళ్ల గౌరీశంకర్, అవనాపు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని అన్ని వీధుల్లో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. పలువురు సమైక్యవాదులు సైతం దీనిలో పాల్గొన్నా రు. చీపురుపల్లి నియోజకవర్గంలో దాదాపు వంద ట్రాక్టర్లతో పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. నియోజకవర్గ సమన్వయకర్తలు మీసాల వరహాలనాయుడు, శనపతి శిమ్మినాయుడుల ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీబొమ్మ జంక్షన్ నుంచి మెయిన్‌రోడ్, ఆంజనేయపురం, లావేరురోడ్ తదిత ర ప్రాంతాల్లో ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక మూడు రోడ్ల కూడలి వద్ద సభ ఏ ర్పాటు చేసి నిరసనలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తుమ్మగంటి సూరినాయుడు, ఇప్పిలి నీలకంఠం, మన్నెపురి చిట్టి, ఆర్‌ఈసిఎస్ మాజీ డెరైక్టర్ కర్రోతు రమణ, గవిడి సురేష్, డబ్బాడ శంకర్, ఎల్లింటి శివ, మీసాల రాజగోపాలనాయుడు తదితరులు పాల్గొన్నారు. గజపతినగరం నియోజకవర్గంలో సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. బోడసింగిపేట గ్రామం నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వ రకూ ఈ ర్యాలీ కొనసాగింది. వందలాది మంది సమైక్యవాదులు, పార్టీ నాయకలు దీనికి మద్దతు పలికారు. కురుపాం మండలంలో గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి మండల కేంద్రాల్లో ట్రాక్టర్ ర్యాలీలు ఆయా మండల నాయకుల ఆధ్వర్యంలో జరిగాయి. సాలూరు నియోజకవర్గ కేంద్రంలో గరుడబిల్లి ప్రశాంత్, రాయల సుందరరావుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా వారు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఎస్.కోట నియోజకవర్గంలో సమన్వయకర్తలు బోకం శ్రీనివాస్, గేదెల తిరుపతిరావులు కొత్తవలస, ఎల్.కోట, ఎస్.కోట జామి మండలాల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. సమన్వయకర్త వేచలపు చినరామినాయుడు ఆధ్వర్యంలో వేపాడ మండలంలో నిరసన ర్యాలీ జరిగింది. నెల్లిమర్ల నియోజకవర్గంలో పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు సింగుబాబు, డాక్టరు సురేష్‌బాబు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ భారీ ర్యాలీ మొయిద జంక్షను నుంచి ర్యాలీ నిర్వహించారు. నెల్లిమర్ల పట్టణమంతా తిరిగి నిరసన తెలిపారు. పార్వతీపురం నియోజకవర్గంలో సమన్వయకర్తలు కొయ్యాన శ్రీవాణి, గర్భాపు ఉదయభానుల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ముందుగా దివంగత నేత వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. కాంప్లెక్సు జంక్షన్ నుంచి పాత బస్టాండు వరకూ ర్యాలీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఛైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన రైతన్న
=వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీలు =ట్రాక్టర్ నడిపి నిరసన తెలిపిన ఆర్కే.రోజా జననేత జగన్మోహన్రెడ్డి పిలుపును రైతులందుకున్నారు. కదంతొక్కుతూ ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించారు. సమైక్యమే తమ నినాదమని చాటారు. సాక్షి, తిరుపతి: సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడంతో బుధవారం జిల్లావ్యాప్తంగా రైతులు ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైతులు ట్రాక్టర్లను పొలం నుంచి రోడ్డుపైకి తీసుకుని వచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి, నగరి నియోజకరవర్గం సమన్వయకర్త ఆర్కే. రోజా నాయకత్వంలో బుధవారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. నగరిలోని సత్రవాడ నుంచి ఓం శక్తి కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. ఆమె స్వయంగా ట్రాక్టర్ నడిపారు. మదనపల్లి చీకులపేటలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు. మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త షమీమ్ అస్లాం నిమ్మనపల్లిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరులో పార్టీ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ అధ్వర్యంలో రూరల్ మండలంలోని ఎన్ఆర్ పేట నుంచి చిత్తూరులోని గాంధీ విగ్రహం వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గం సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వంలో చిత్తూరు-నేండ్రగుంట మార్గంలో ట్రాక్టర్ ర్యాలీ జరిగింది. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను నిలిపి ఆందోళన నిర్వహించారు. ఆయనతోపాటు పాకాల మండల కన్వీనర్ చెన్నకేశవ రెడ్డి, గోవిందరెడ్డి, కేశవులు పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గంలోని బుచ్చినాయుడు కండ్రిగలో నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం అధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ జరిగింది. స్థానిక చెంగాలమ్మ గుడి నుంచి వ్యవసాయ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు. కుప్పంలో పార్టీ సమన్వయకర్త సుబ్రమణ్యం రెడ్డి నాయకత్వంలో బైపాస్ రోడ్డులోని షాదీ మహల్ నుంచి చెరువు కట్ట వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో స్కూటర్లు, ట్రాక్టర్ల ర్యాలీ జరిగింది. మండల కన్వీనర్ సురేష్ రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోవిందరెడ్డి, ఆంజనేయులు ర్యాలీని విజయవంతం చేశారు. పలమనేరులో వైఎస్ఆర్ సీపీ రిలే నిరాహారదీక్షలు జరిగాయి. తిరుపతిలో జరిగిన వైఎస్ఆర్ సీపీ రిలే నిరాహారదీక్షలో మహిళా విభాగం నేత కుసుమ అధ్వర్యంలో పలువురు పాల్గొన్నారు. కొనసాగుతున్న నిరసనలు శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ నేతలు కల్యాణ మండపం వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. పుంగనూరులో ఉద్యోగ జేఏసీ నాయకుడు వరదారెడ్డి నాయకత్వంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మదనపల్లిలో సమైక్య జేఏసీ నేతలు మల్లికార్జున సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి, విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.