breaking news
tmi Group
-
బ్రాండన్ హాల్ గోల్డ్ అవార్డ్ విన్నర్స్.. టీఎమ్ఐ, ఐఓసీఎల్
సేవా షూర్ వీర్ లెర్నింగ్ & డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), TMI e2E అకాడమీ 'బ్రాండన్ హాల్ గోల్డ్' అవార్డు గెలుపొందాయి. ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశ్యం ఇండియన్ ఆయిల్ రిటైల్ అవుట్లెట్లలో కస్టమర్ సర్వీస్ అండ్ డెలివరీలను మెరుగుపరచడమే. బ్రాండన్ హాల్ గ్రూప్ నుంచి వచ్చిన ఈ అవార్డును లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ స్పేస్‌లో ఆస్కార్ అని పిలుస్తారు. సేవా షూర్వీర్ ప్రోగ్రామ్ IOCL పెట్రోల్ సర్వీస్ స్టేషన్లలో కస్టమర్ సర్వీస్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించింది. ఇండియన్ ఆయిల్ రిటైల్ అకాడమీకి భాగస్వామిగా సేవా షూర్ వీర్ ప్రాజెక్ట్ కోసం బ్రాండన్ హాల్ ఎక్సలెన్స్ గోల్డ్ అవార్డును గెలుచుకోవడం చాలా గౌరవంగా ఉందని టీఎమ్ఐ గ్రూప్ సీఈఓ బీ. రామకృష్ణన్ వెల్లడిస్తూ.. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు వెల్లడించారు. బ్రాండన్ హాల్ అవార్డు పనిలో మా అత్యున్నత స్థాయిని సూచిస్తుందని చైర్మన్ మురళీధరన్ అన్నారు. -
చిన్న సంస్థలకు మొబైల్ ఆధారిత సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ మాద్యమంతో చిన్న సంస్థలు (ఎంఎస్ఎంఈ), ఉద్యోగార్థులను అనుసంధానించే దిశగా టీఎంఐ గ్రూప్ కొత్తగా జాబ్స్‌డైలాగ్ సేవలను ఆవిష్కరించింది. సమీప ప్రాంతాల్లో ఉద్యోగాలు కావాలనుకునే అభ్యర్థులకు, దగ్గర్లో ఉండే ఉద్యోగులను తీసుకోవాలనుకునే సంస్థలకు ఇది ఉపయోగపడుతుందని టీఎంఐ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టి. మురళీధరన్ శుక్రవారం ఇక్కడ వివరించారు. రిక్రూట్మెంట్ తలపెట్టిన సంస్థలు తమ కంపెనీ వివరాలు, నియామకావసరాలను జాబ్స్‌డైలాగ్‌కి కాల్ చేసి నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ వివరాలతో ఆయా సంస్థల మైక్రోసైట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం రూ. 3,000 నుంచి ప్యాకేజీలు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఉద్యోగార్థులు మిస్డ్‌కాల్ ఇస్తే.. కాల్ సెంటర్ వారు తిరిగి ఫోన్ చేసి వివరాలు తీసుకుని, ప్రొఫైల్ తయారుచేస్తారని మురళీధరన్ చెప్పారు. ఇది పూర్తిగా ఉచితమన్నారు. అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పించే చిన్న సంస్థలు.. నియామకాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. తొలి ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 1,100 పైచిలుకు సంస్థలు, నాలుగు వేల నియామకాలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జాబ్స్‌డైలాగ్‌ను కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రా అధికారికంగా ఈ నెల 26న ప్రారంభిస్తారని చెప్పారు.