breaking news
tirangayatra
-
త్యాగధనుల జన్మస్థలాలు స్ఫూర్తికేంద్రాలు
దేశభక్తి పెంపొందించేందుకే తిరంగయాత్ర 1 నుంచి రెండు విడతలుగా బైక్‌ర్యాలీ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి ముకరంపుర : బానిస బతుకుల నుంచి విముక్తి కలిగించిన త్యాగధనుల జన్మస్థలాలను స్ఫూర్తికేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యామని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు పి.విక్రమ్‌రెడ్డి తెలిపారు. భావితరాల్లో దేశభక్తి, జాతీయవాదం పెంపొందించేందుకే తిరంగయాత్రను దేశవ్యాప్తంగా చేపడుతున్నట్లు తెలిపారు. కరీంనగర్‌లోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. స్వాత్రంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఆర్థిక, సామాజిక అసమానతలతో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. నైజాం పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17ను విమోచనదినంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణవ్యాప్తంగా పర్యటించి కొమురం భీం మొదలుకుని చాకలి ఐలమ్మ వరకు త్యాగధనుల జీవిత చరిత్రను వివరిస్తామన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు రెండు విడతలుగా బైక్‌ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. 9న కరీంనగర్లో ముగింపు సభ ఉంటుందని, రాష్ట్ర, జాతీయ నాయకులు హాజరవుతారని తెలిపారు. బీజేపీ, బీజేవైఎం నాయకులు గంటల రమణారెడ్డి, కన్నం అంజయ్య, కరండ్ల మధుకర్, పెండ్యాల సాయికృష్ణారెడ్డి, మురళీకృష్ణ, గడ్డం ప్రశాంత్‌రెడ్డి, ఆర్.ప్రసాద్, కె.జ్యోతిబసు, ఎ.శ్రీనాథ్‌రెడ్డి, జి.రంజిత్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, ఎం.కుమార్, కిషోర్, లవన్ పాల్గొన్నారు. -
జాతీయవాదం పెంచడానికే తిరంగయాత్ర
విమోచన దినోత్సవాన్ని విస్మరిస్తున్న సర్కారు టీఆర్ఎస్ ఓటుబ్యాంకు రాజకీయాలు మానుకోవాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ముకరంపుర : తెల్లదొరల నుంచి దేశానికి, నైజాం రజాకార్ల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించిన త్యాగధనుల చరిత్రను స్మరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడం, భావితరాల్లో జాతీయవాదాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తిరంగయాత్రను నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. మంగళవారం కరీంనగర్లో నిర్వహించిన తిరంగయాత్రలో ఆయన పాల్గొన్నారు. కెప్టెన్ రఘునందన్‌రావు విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం తిరంగయాత్రను ప్రారంభించారు. జాతీయ జెండాలతో నగరంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన యాత్రలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ఈనెల 23 వరకు తిరంగయాత్ర జరిగితే తెలంగాణలో మాత్రం సెప్టెంబర్ 23 వరకు ఈ యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను సత్కరించున్నామన్నారు. నిజాం అరాచకాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించిన కొమురం భీం, అనభేరి ప్రభాకర్‌రావు, చాకలి ఐలమ్మ, దొడ్డి కొంరయ్య వంటి పోరాటయోధుల గాథలకు చరిత్రలో స్థానం కల్పించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్న కేసీఆర్ ఇప్పుడు మాట మార్చుతూ ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినప్పటికీ విమోచనోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేని దుస్థితిలో ఉందని విమర్శించారు. రాజకీయ లబ్ధికోసమే మజ్లిస్ పార్టీకి టీఆర్ఎస్ తొత్తుగా మారి విమోచన దినోత్సవాన్ని విస్మరిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ ఓటుబ్యాంకు రాజకీయాలు మానుకోవాలన్నారు. సెప్టెంబర్ 17న విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2019లో అధికారమే లక్ష్యం 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. జగిత్యాల రోడ్డులోని శ్రీదేవి గార్డెన్లో నిర్వహించిన బీజేపీ జిల్లాకార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో తిరంగయాత్రను విజయవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. బీజేపీ మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు గాజుల స్వప్న ఆధ్వర్యంలో లక్ష్మణ్‌కు రాఖీలు కట్టారు. అంతకుముందు ఇటీవల నియామకమైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బల్మూరి వనిత, ఆకుల విజయ, రాష్ట్ర కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కోశాధికారి మనోహర్, నాయకులు మీస అర్జున్‌రావు, న్యాలకొండ నారాయణరావు, కాసిపేట లింగయ్య, బాబూరావు, కోమల ఆంజనేయులు, బాస సత్యనారాయణ, కన్నం అంజయ్య, గుజ్జ సతీష్, పటేల్ దేవేందర్‌రెడ్డి, లింగంపల్లి శంకర్, మిర్యాల్కర్ నరేందర్, హరికుమార్‌గౌడ్, పెండ్యాల సాయికృష్ణారెడ్డి, సుజాతరెడ్డి, ప్రసన్న, సుశీల, రేణుక తదితరులు పాల్గొన్నారు.