breaking news
tiger masks
-
పులివేషం ఎక్కడ పుట్టిందో తెలుసా?
దసరాకు మన ఊళ్లో పులి వేషాలు వేస్తారు కదా? ఆ పులి ఆట పుట్టింది తెలుగు రాష్ట్రాల్లో కాదు. కర్ణాటక తీరప్రాంతంలో. దాని అసలు పేరు ‘పిలి వేషం’ లేదా ‘హులివేషం’. ఇది కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లా, అంటే పూర్వపు తుళునాడు ప్రాంతంలో పుట్టింది. చరిత్రకారుల ప్రకారం అనేక శతాబ్దాల క్రితం నుంచి ఈ ప్రాంతంలో పులివేషం ఉంది.మొదట్లో ఇది దసరాకు కట్టే వేషం కాదు. కృష్ణ జన్మాష్టమి, వినాయకచవితి పండగలప్పుడు మంగళూరు, ఉడిపి, మూడబిదిరి, కుందాపూర్ ఊళ్లలో వేసేవారు. తర్వాత దసరా సమయంలో దుర్గాదేవికి మొక్కుగా వేయడం మొదలైంది. ఎందుకంటే దుర్గాదేవి వాహనం పులి. పులివేషం వేసి ఆడడం అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టడం లాంటిది.ఇప్పుడు దసరా నవరాత్రుల్లో చిన్నపిల్లలు, యువకులు పసుపు, నూనె, రంగులతో పులిలా మారి, తప్పెట దరువుకు ఆడుతూ ఊరంతా తిరుగుతారు. ఇది కేవలం ఆట కాదు, భక్తి, ప్రకృతి పట్ల గౌరవం.ఇదీ చదవండి: భూమికి బదులు మరో భూమి -
పులి రాజాను చూసి కోతులు పరార్!
అర్వపల్లి (నల్లగొండ): కొండముచ్చుతో కోతులను పారదోలడం వినే ఉంటారు. కానీ, ఓ వినూత్న ప్రయత్నంతో నల్లగొండ జిల్లా అర్వపల్లి రైతులు కోతుల బెడదను దూరం చేసుకున్నారు. అర్వపల్లి మండలంలో కోతుల బెడద ఇటీవలి కాలంలో మరీ పెరిగిపోయింది. పంటలకు నష్టం కలిగిస్తుండడంతో రైతులు కొండ ముచ్చులను తీసుకొచ్చి కోతులను పంపించే ప్రయత్నం చేశారు. పెద్దగా ఫలితం రాలేదు. దీంతో పులుల బొమ్మలను ప్రయోగించగా... సత్ఫలితం వచ్చింది. దాంతో రైతులు హైదరాబాద్ నుంచి పులిబొమ్మలను కొనుగోలు చేసి వాటిని పట్టుకుని పొలాల్లో కాపలాగా ఉంటున్నారు. అవి చూసి బెదురుతున్న కోతులు ఆ సమీపంలోకి రావడం లేదు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


