breaking news
Thumukunta
-
హిందూపురంలో బాలకృష్ణకు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం: హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు నాలుగు మాసాల తర్వాత నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఆయనకు తూముకుంటలో ఊహించని పరిణామం ఎదురైంది. పర్యటనలో బాలకృష్ణ ఎదుట చిన్నారులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో చిన్నారులపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా.. ఎమ్మెల్యే బాలకృష్ణ సూగూరు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఆయన మంత్రాలు చదివి వినిపించారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా విస్తుపోయారు. చదవండి: ('చంద్రబాబు నైజం ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు') -
విష ద్రావణం తాగి మహిళ మృతి
గాలివీడు మండల పరిధిలోని తూముకుంట ఎగువమూలకు చెందిన ఇర్రి మల్లికార్జున భార్య శివకళ్యాణి(22) కడుపునొప్పి తట్టుకోలేక విషద్రావణం తాగి మృతి చెందింది. మంగళవారం విషద్రావణం తాగిన ఆమెను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందింది. తహసీల్దార్ భవాని పంచనామ నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గాలివీడు పోలీసులు తెలిపారు.