breaking news
thumb Print
-
పిల్లలు లేరు కదా అనుకుంటే.. బంధువులే రాబంధువులై..
Viral Video: మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోయాన్నదానికి నిదర్శనం ఈ ఘటన. మనిషి. మనీ షీగా మారిపోయిన ఉదంతం ఇది. చనిపోయిన వ్యక్తి నుంచి ఆస్తి కాజేసే ఉద్దేశంతో బంధువులు.. ఆ శవం చేత కాలి వీలునామా కాగితాలపై వేలిముద్ర వేయించారు. ఈ దుర్మార్గానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ కాగా.. పోలీసులు ఆ వీడియోపై స్పష్టత ఇచ్చారు. వయసు పైబడి ఓ మహిళ కన్నుమూసింది. ఆమె భర్త అంతకు ముందు కొన్నేళ్ల కిందటే చనిపోగా.. వాళ్లకు సంతానం లేదని తెలుస్తోంది. పిల్లలు లేకపోవడంతో బంధువుల పిల్లలను ఆ దంపతులు ఆప్యాయంగా చూసుకునేవాళ్లు. ఈ క్రమంలో.. వాళ్ల ఆస్తి మీద ఆ బంధువులకు దుర్బుద్ధి పుట్టినట్లుంది. ఆమె బావ కొడుకులు ఆమె మృతదేహన్ని శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. కాస్త దూరం వెళ్లాక.. ఆమె మృతదేహాన్ని కారు నుంచి బయటకు లాగి, ఓ లాయర్ సమక్షంలో వీలునామా కాగితాల మీద ఆమె వేలిముద్రలు తీసుకున్నారు. ఆమె పేరిట ఉన్న ఓ పెద్ద దుకాణం, ఇంటిని తమ పేరిట మార్చేసేందుకు అలా డాక్యుమెంటరీని ఫోర్జరీ చేసే యత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆమె దూరపు బంధువైన ఓ వ్యక్తికి, ఆ వేలిముద్ర పై అనుమానం కలిగింది. ఎందుకంటే ఆమె చదువుకుంది, సంతకం చేయగలదు కాబట్టి. అయితే ఆధారాలు లేకపోవడంతో.. నిర్ధారించుకోలేకపోయాడు. కానీ, ఆయన అనుమానం నిజమేనే విషయం ఇప్పుడు బయటపడింది. ఆస్తుల పంపకాల్లో తేడాలు రావడంతో.. వాళ్లలో ఒకరు ఆ వీడియో బయటపెట్టాడు. ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. 2021, మే 8వ తేదీన కమలా దేవి అనే మహిళ మరణించగా.. ఆమె బంధువులు చేసిన పని తాజాగా ఓ వీడియో ద్వారా నెట్లో వైరల్ అవుతోంది. దీంతో ఆ బంధువు శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు వీడియోపై దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో పాకిస్తాన్లోది అంటూ ప్రచారం జరిగినా.. చివరకు మన దేశంలోనిదేనని ఆగ్రా పోలీసులు ధృవీకరించారు. Video of man taking thumb impression of deceased woman lying in car goes viral. pic.twitter.com/mZjaz2BvFE — Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) April 10, 2023 Disclaimer: ఈ వీడియో కేవలం విషయం తెలియజేయడానికే.. ఎవరినీ ఇబ్బందిపెట్టడానికి కాదు -
అమ్మ కుడిచేతికి ఏమైంది?
చెన్నై: తమిళనాడులోని మధుర జిల్లా తిరుపారంగుండ్రం అసెంబ్లీ స్థానానికి నవంబర్ 9న ఉపఎన్నిక జరగనుంది. అధికార ఏఐడీఎంకే తరఫున ఏకే బోస్ అనే అభ్యర్థి పోటీ చేయనున్నారు. అయితే ఆమేరకు సంబంధిత పత్రాలపై పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత సంతకం తప్పనిసరైంది. దీంతో వైద్యులు.. సీఎం చేత సంతకానికి బదులు వేలిముద్రలు తీసుకున్నారు. అనంతరం పార్టీ పెద్దలు అమ్మ వేలిముద్ర వేసిన పత్రాలను మీడియాకు సైతం చూపించారు. ఇంతకీ అమ్మ చేతికి ఏమైనట్లు? ఉపదాదాపు 40 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించి వారం కిందట చివరి హెల్త్ బులిటెన్ వెల్లడించిన వైద్యులు.. ఆమె కోలుకుంటున్నదని చెప్పారు. ట్రెకియోటెమి విధానంలో జయ కుడిచేతి గుండా కృత్రిమ నాళాలను వేసినందువల్లే ఆమె సంతకం చేయలేకపోయారని, ఎడమచేతి వేలిముద్రలు తీసుకున్నామని అధికారులు ఎలక్షన్ కమిషన్ కు తెలిపారు. వేలిముద్రలు జయలలితవేనని మద్రాస్ మెడికల్ కాలేజీ నిపుణులు కూడా నిర్ధారించడంతో ఈసీ.. వేలిముద్రలున్న ఏకే బోస్ నామినేషన్ పత్రాలను స్వీకరించింది. కాగా, గతంలో వార్తలు వెలువడ్డట్టు దీపావళిలోపే అమ్మ డిశ్చార్జి అయ్యే అవకాశాలు లేవు. మరికొన్ని రోజులు ఆమె ఆసుపత్రిలోనే ఉంటారని తెలుస్తోంది.