breaking news
thullur incident
-
10 నిమిషాల్లోనే వాగ్దానాలన్నీ విస్మరించారు
-
'10 నిమిషాల్లోనే వాగ్దానాలు విస్మరించారు'
కంచికచర్ల: తుళ్లూరు ఘటనపై తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఏకవచనంతో ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు కొడాలి నాని అన్నారు. తమ నేతపై ఆరోపణలు చేసే హక్కు చంద్రబాబు, టీడీపీ నాయకులకు లేదన్నారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... కొన్ని ఎల్లో మీడియా చానళ్లు కావాలనే వైఎస్ జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం అయిన 10 నిమిషాల్లోనే చంద్రబాబు వాగ్దానాలు విస్మరించారని విమర్శించారు. అధికారం కోసం ఎవరి కాళ్లయినా పట్టుకునే వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.