breaking news
thoorpu jayaprakash reddy
-
జగ్గారెడ్డి బ్రేస్‌లెట్‌కు రూ.20 లక్షలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ విప్ టి.జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) తన బంగారు బ్రేస్‌లెట్‌ను వేలం వేశారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన వేలంపాటలో కృషి బిల్డర్స్ ప్రతినిధులు 20 లక్షలు వెచ్చించి దానిని సొంతం చేసుకున్నారు. మెదక్ ఏడుపాయల దుర్గమ్మ తల్లి పేరుతో రూ.5 లక్షలకు ప్రారంభమైన వేలంపాట 20 లక్షలతో ముగి సింది. జూన్ 1న సంగారెడ్డిలో జరిగిన సభలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన సూచనతో సభ ఖర్చుల కోసం జగ్గారెడ్డికి ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఈ బ్రేస్‌లెట్‌ను ఇచ్చారు. బ్రేస్‌లెట్‌ను వేలం వేసి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇవ్వాలని జగ్గారెడ్డి నిర్ణయించారు. రైతులకోసం బ్రేస్లెట్ అని తెలియగానే ఈ వేలంపాటకు హాజరయ్యానని కృషి బిల్డర్స్ అండ్ డెవలపర్స్ డైరెక్టర్ గిరెడ్డి మహేందర్‌రెడ్డి తెలిపారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు రైతులను ఆదుకోవడానికి రూ.20 లక్షలకు కొనుగోలు చేసినట్టుగా వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో 11 మంది రైతులకు, వరంగల్ జిల్లాలో9 మంది రైతులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పు న రూ.20 లక్షలను పంపిణీ చేస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు. టీపీసీసీ తరఫున రైతులను ఆదుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్టు వివరించారు. వేలంపాటలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని బ్లాక్మెయిల్ చేయాలని మంత్రి హరీశ్‌రావు, టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలకు దిగుతున్నదని జగ్గారెడ్డి ఆరోపించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముక్కును నేలకు రాపిస్తామని హరీశ్ మాట్లాడుతున్నాడని, ఉత్తమ్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. -
తూర్పు అటు... చాగండ్ల ఇటు!
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ నాయకుల వలసలు ఊపందుకున్నాయి. నేతలు అటు ఇటు పార్టీలు మారుతున్నారు. చివరి నిమిషంలో పార్టీ మారి తూర్పు జయప్రకాష్ రెడ్డి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పార్టీ మారిమారగానే ఎంపీ అభ్యర్థిగా కూడా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయనకు బీజేపీ 'టిక్కెట్'తో స్వాగతం పలికింది. జగ్గారెడ్డి ఇచ్చిన షాకుతో బీజేపీ నాయకులు కారు ఎక్కారు. సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన చాంగడ్ల నరేంద్రనాథ్- గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీరియర్ నేత ఫరీదుద్దీన్, స్వామిచరణ్ కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్
-
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్
మెదక్: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డిని సిద్ధిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన రెండు రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు 2010లో ఆయనపై కేసు నమోదయింది. ఈ కేసులో కోర్టుకు హాజరుకానందున ఆయనకు నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీచేసింది. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఈ నెల 7న కోర్టు విచారించనుంది.