breaking news
third phase polls
-
మూడో విడత పంచాయితీకి సర్వంసిద్ధం
అమరావతి: పంచాయతీ సమరం తుది ఘట్టానికి చేరింది. రేపటితో పంచాయతీ పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి. మూడో విడత ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే విశాఖపట్టణం, తూర్పు గోదావరి ఏజెన్సీ గ్రామాల్లో మాత్రం మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ జరపనున్నారు. 13 జిల్లాల్లోని 20 డివిజన్లు 160 మండలాల్లో 2,640 పంచాయితీలకు ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. అయితే మూడో విడతలో మొత్తం పంచాయతీలు 3,221 ఉండగా వాటిలో 579 ఏకగ్రీవం అయ్యాయి. రేపు ఎన్నికలు జరిగే పంచాయతీలు 2,640 ఉన్నాయి. అయితే మూడు పంచాయితీల్లో నామినేషన్లు నమోదు కాలేదు. పోటీలో సర్పంచ్ అభ్యర్థులు మొత్తం 7,757 మంది ఎన్నికలు జరిగే వార్డులు 19,553 ఉండగా పోటీలో 43,162 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓటర్ల సంఖ్య : 55,75,004 మొత్తం వార్డులు 31,516 ఉండగా 11,753 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 210 వార్డుల్లో నామినేషన్స్ రాలేదు. 60 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఎన్నికల సామగ్రిని సరఫరా చేశారు. రాత్రికి ఎన్నికల సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లనుంది. మూడో విడతలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 26,851 ఏర్పాటుచేశారు. వీటిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 4,118 గుర్తించారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 3,127 ఉన్నాయి. నక్సల్స్ ప్రభావిత పోలింగ్ కేంద్రాలు 1,977. ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఈసీ, డీజీపీ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్నికలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టనున్నారు. ఎస్ఈసీ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్, కౌంటింగ్ ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. -
మూడో విడత పోలింగ్ రేపు
సాక్షి, అమరావతి: మూడో విడతలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 2,640 సర్పంచి పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్‌శాఖ జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు చేశాయి. మూడో విడతలో 3,221 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అందులో 579 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలో ఒక్కొక్క చోట సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 2,640 సర్పంచి పదవులకు బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగే చోట మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ కొనసాగనుంది. ఆయా పంచాయతీల పరిధిలో 19,607 వార్డు పదవులకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో ఎన్నికలు జరిగే 3,221 గ్రామ పంచాయతీల పరిధిలో 31,516 వార్డులున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 11,732 వార్డులకు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 177 వార్డులకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 19,607 వార్డుల్లో ఎన్నికలు జరగుతున్నాయి. ఈ వార్డులకు 43,282 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే బుధవారమే ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. చివరి విడత ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేడు చివరి విడతలో ఈనెల 21న ఎన్నికలు జరగనున్న 3,229 గ్రామ పంచాయతీల్లో మంగళవారం సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. నామినేషన్ల పరిశీలన తర్వాత 3,229 గ్రామ సర్పంచి పదవులకు 18,016 మంది, 33,429 వార్డులకు 86,064 మంది పోటీలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది మార్చి 9న నోటిఫికేషన్.. 15న నిలిపివేత రాష్ట్రంలోని 16 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 12 కార్పొరేషన్లలో, 104 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉండగా 75 చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు 2020 మార్చి 9వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల దాఖలు, పరిశీలన ప్రక్రియ ముగిశాక కరోనా పేరుతో అదే నెల 15న ఆ ఎన్నికలను అర్ధంతరంగా నిమ్మగడ్డ నిలిపివేశారు. కాగా ఆగిపోయిన చోట నుంచే ఆ ఎన్నికల ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు, వచ్చే నెల 2 నుంచి 3వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తున్నట్లు తాజా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.