breaking news
Think friendship
-
తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు
పణజి: తెహల్కా మాజీ సంపాదకుడు, తరుణ్ తేజ్పాల్ను బాంబే హైకోర్టు గురువారం దోషిగా నిర్ధారించింది. ఐదేళ్ల క్రితం సెషన్స్ కోర్టు ఒకటి నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడ్డారన్న నేరంలో (ఐపీసీ 376 (2)(ఎఫ్), లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఐపీసీ 354ఏ, మానహాని ఉద్దేశంతో మహిళపై దౌర్జన్యానికి పాల్పడినందుకు ఐపీసీ 354బీల కింద పదేళ్ల కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్సందేకర్ల బెంచ్ తీర్పునిచ్చింది. అరవై రెండేళ్ల వయసున్న, ఇద్దరు పిల్లల తండ్రినైన తనపై దయ చూపాలన్న తరుణ్ తేజ్‌పాల్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. బాధితురాలికి రూ.10,21,000 పరిహారం చెల్లించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని తేజ్‌పాల్ ప్రకటించారు. 2013లో గోవాలో జరిగిన ‘థింక్ ఫెస్ట్’అన్న కార్యక్రమంలో తరుణ్ తేజ్‌పాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ సహోద్యోగి ఒకరు కోర్టుకెక్కారు. దీంతో తేజ్పాల్పై కేసు నమోదైంది. అరెస్టు జరిగి ఛార్జ్ïÙట్ కూడా దాఖలైంది. 2017లో కేసు విచారణ మొదలైంది. మొత్తం 71 మంది సాక్షులను విచారించిన తరువాత 2021 మే నెలలో సెషన్స్ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది. ఆ తరువాత గోవా కోర్టు హైకోర్టులో కేసు వేయడం, విచారణ తరువాత తాజాగా తీర్పు వెలువడింది. -
ట్రూ ఫ్రెండ్!
ఫిల్మ్ ఇండస్ట్రీలో థిక్ ఫ్రెండ్షిప్లంటే కామన్‌గా కనిపించేవి డేటింగ్లే! అదీ ముద్దు గుమ్మలైతే ఒకరికొకరికి బొత్తిగా పొసగనే పొసగదు. కారణాలేమైనా... హీరోలతో ఉన్నంత కలివిడినెస్ను వారిలో వారు మెయిన్‌టెయిన్ చేయరు! కానీ... చిలిపి కళ్ల చిన్నది అనుష్కాశర్మ తన చిత్రం ‘ఎన్‌హెచ్10’ ప్రమోషన్లో క్యూటీ గాళ్ కత్రినా కైఫ్‌ను పొగిడేసింది. కత్రినాతో తనకు మాంచి దోస్తానీ ఉందని... తను ఓ ట్రూ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. ‘షీ ఈజ్ రియల్ పర్సన్. నాటకీయత ఉండదు. హృదయపూర్వకంగా మాట్లాడుతుంది. మేమిద్దరం హెల్దీ టైమ్ స్పెండ్ చేశాం. కత్రినకు కూడా నేనంటే ఎంతో ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చింది అనుష్కా. అంతే కాదు... కత్రినా ప్రెట్టీయస్ట్... సెక్సీయస్ట్ యాక్టర్ కూడానని అద్భుతమైన కాంప్లిమెంటూ ఇచ్చేసింది. మొత్తానికి విరాట్‌తో డేటింగ్షిప్ను ఎంత ఎంజాయ్ చేస్తుందో... కత్రినతో ఫ్రెండ్షిప్నూ అంతే ఆస్వాదిస్తోంది అనుష్కా!


