breaking news
there is moddunidra...
-
ఆగని అక్రమ రవాణా!
జిల్లా నుంచి తరలిపోతున్న ఎర్రచందనం పోలీసుకాల్పుల్లో కూలీ మృతే నిదర్శనం చిత్తూరు (క్రైమ్), భాకరాపేట, న్యూస్‌లైన్: జిల్లా నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా ఆగలేదని మరోమారు రుజువైంది. ఎర్రావారిపాళెం మండలంలోని బొవ్మూజీకొండవద్ద పోలీసుల కాల్పు ల్లో ఎర్రకూలీ మృతిచెందడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల అటవీశాఖ అధికారుల హత్యతో ప్రభుత్వం కన్నెర్ర చేసింది. అటవీశాఖ ఉద్యోగులకు ఆయుధా లు ఇవ్వడానికి అంగీకరించింది. అటవీ, ఎస్టీఎఫ్ బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. దీంతో ఎర్రచందనం స్మగ్లర్లు వెనక్కు తగ్గారన్న భావన అధికారులు, ప్రజల్లో నెలకొంది. అయితే ఈ అంచనా తప్పని ఎర్రావారిపాళెం మండలంలో బుధవారం చోటు చేసుకున్న ఘటన రుజువు చేసింది. కల్యాణిడ్యామ్ సమీపంలోని పులిబోనువద్ద నుంచి కూంబిం గ్‌కు బయులుదేరిన ఎస్టీఎఫ్ బలగాలు నాలుగు బృందాలుగా విడిపోయూయి. పులిబోను నుంచి బయులుదేరిన పార్టీ ఎర్రావారిపాళెం వుండల పరిధిలోని బొవ్మూజీకొండ వైపు వెళ్లింది. ఇక్కడ సుమారు 70 మంది ‘ఎర్ర’ కూలీలు కంటపడ్డారు. వారిని వెంబడించేందుకు వెళ్లిన పోలీసులపై తిరగబడి రాళ్లవర్షం కురిపించారు. ఈ దాడిలో ఆర్ఎస్ఐ మురళి, వురో కానిస్టేబుల్‌కు గాయూలయ్యూయి. ఎస్టీఎఫ్ బలగాలు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ‘ఎర్ర’కూలీ(35) మృతి చెందాడు. రెండో ఘటన రెండేళ్ల క్రితం చంద్రగిరి సమీపంలోని శ్రీవారి మెట్టు వద్ద 300 మంది కూలీలు కూంబింగ్ చేస్తున్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు కాల్పులకు దిగారు. తిరువళ్లూర్ జిల్లాకు చెందిన ఓ తమిళుడు కాల్పుల్లో గాయపడి మృతి చెందాడు. తాజాగా బొమ్మాజికొండ వద్ద జరిగిన కాల్పుల్లో ఓ కూలీ మృతి చెందాడు. ఆయుధాలు సిద్ధం చేసుకున్న కూలీలు పోలీసులు, అటవీ అధికారులపై దాడులు చేసి తప్పించుకోవడానికి తమిళ కూలీలు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. అడవిలో ఓ వైపు దుంగలు మోస్తూనే మరోవైపు కొడవళ్లు, గొడ్డళ్లు చేతపట్టుకుని ప్రతిదాడికి పూనుకుంటున్నారు. ఇందుకు బుధవారం నాటి ఘటనే నిదర్శనం. పోలీసులకు ఎదురుబడ్డ తమిళ తంబీలు కొడవళ్లు, గొడ్డళ్లను పోలీసులపైకి విసిరేశారంటే వారు ఎంతకు తెగిస్తున్నారో అర్థమవుతోంది. గాలింపు ముమ్మరం కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిత్తూరు ఎస్పీ రామకృష్ణ, తిరుపతి ఎస్పీ రాజశేఖర బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు శేషాచలం అడవుల్లో గాలింపు ముమ్మరం చేశాయి. -
కష్టాలన్నీ తీరుతాయి
జననేత భరోసా 10వ రోజూ సమైక్య, ఓదార్పుయాత్రలకు అపూర్వ స్పందన రైతుకూలీలు, కార్మికులు, రైతులతో మాట్లాడిన వై.ఎస్.జగన్ జీవాగ్రంలో ఓదార్పు మహానేత వైఎస్ఆర్ విగ్రహాల ఆవిష్కరణ ‘నాలుగు నెలల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. కొంచెం ఓపిక పట్టండి. మీ కష్టాలన్నీ తీరుతాయి’ అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ధైర్యం చెప్పారు. నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర 10వ రోజు బుధవారం శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో సాగింది. జనం అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు, రైతు కూలీలు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకొచ్చారు. సాక్షి, తిరుపతి: వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఇంటి నుంచి బుధవారం జననేత సమైక్య, ఓదార్పు యాత్రను ప్రారంభించారు. అంతకు ముందు ఇంట్లో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నుం చి వచ్చిన వేదపండితులు జగన్‌ను ఆశీర్వదించారు. అక్కడ తన కోసం వేచి ఉన్న ప్రజలను జననేత కలుసుకున్నా రు. అనంతరం రామ్‌నగర్ కాలనీ సమీపంలో ఉన్న ఇటుకబట్టీ మహిళా కార్మికులు జగన్‌ను కలిశారు. వారి సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఇక్కడే ఒక అంధ బాలుడిని ఆప్యాయంగా పల కరించారు. బిడ్డకు చూపు వచ్చే అవకాశం ఉందా అని బాలుడి తండ్రిని అడిగారు. ఆపరేషన్ చేస్తే రావచ్చని ఆ యన తెలిపారు. ‘నాలుగునెలల్లో మన ప్రభుత్వం రాగానే ఆపరేషన్ చేయిద్దాం నువ్వు మెడికల్ రిపోర్టు సిద్ధం చేసుకో’ అని జననేత హామీ ఇచ్చారు. అనంతరం రోడ్‌షో నిర్వహిస్తూ ఏపీ సీడ్స ఆ ర్చ వద్దకు చేరుకున్నారు. అక్కడ వేచి ఉన్న మహిళలు జగన్‌ను కలుసుకున్నా రు. హౌసింగ్‌బోర్డు కాలనీ వద్దకు రాగా నే అభిమాన నేతను చూసేందుకు మహిళలు పోటీపడ్డారు. ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి సమైక్యాంధ్ర సిం హం వై.ఎస్.జగన్ అని రాసున్న బని యన్లు ధరించిన యువకులు మోటారు సైకిళ్లపై జగన్ కాన్వాయ్ వెంట వచ్చా రు. నాగళ్ల బహూకరణ బూరగమానుకండ్రిగలో జగన్ రోడ్‌షో నిర్వహించారు. అభిమాన నేతను చూ సేందుకు గ్రామస్తులు రోడ్డుపైకి చేరుకున్నారు. బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. ఇక్కడ మూడు నాగళ్లను రైతులు జననేతకు బహూకరించారు. వైఎస్ఆర్సీపీ జెండా రంగులతో కూడిన పెయింట్ చేసిన పారలను రైతులు పెకైత్తి చూపుతూ జై జగన్ అం టూ నినాదాలు చేశారు. రాజన్న బిడ్డను చూసేందుకు రైతులు పోటీపడ్డారు. అంతకు ముందు రైల్వేస్టేషన్, పానగల్ సెంటర్లలో తన కోసం వేచివున్న ప్ర జలను జననేత పలకరించారు. చిన్నారికి విజయమ్మగా నామకరణం మిట్టకండ్రిగ వద్దకు చేరుకోగానే వృద్ధులు, మహిళలు జగన్‌ను కలిసేం దుకు పోటీపడ్డారు. ఇక్కడ జననేతను చూసేందుకు బస్టాప్లపైకి ఎక్కిన యు వకులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు హోరెత్తించారు. ఇక్కడ సురేష్, పోలయ్య అనే ఇద్దరు వికలాంగులతో జగన్ మాట్లాడారు. పింఛన్ అందుతోందా అని వారిని వాకబు చేశారు. ఒక మహిళ తన పాపకు నామకరణం చేయాలని కోరారు. ఆ చిన్నారికి విజయమ్మ అని జగన్ నామకరణం చేశారు. హైవే పెట్రోల్ బంకుల్లో, రెస్టారెంట్లలో, వడ్లమిషన్లలో పనిచేస్తున్న కార్మికులు పరుగున వచ్చి కరచాలనం చేశారు. హైవే లో వైఎస్ఆర్టీయూసీ నాయకులు స మస్యలపై జననేతకు వినతిపత్రం సమర్పించారు. ట్రాక్టర్లలో వచ్చిన జనం చెర్లోపల్లె ఎస్సీ కాలనీ, చెర్లోపల్లెల్లో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో కాన్వాయ్కి ఎదురొచ్చి తమ అభిమాన నేతకు స్వాగతం పలికారు. ఈ గ్రామంలోనే మూడుచోట్ల మహిళలు జగన్ కాన్వాయ్‌ను ఆపారు. ఎగువవీధి క్రాస్ (తొండమనాడు) వద్ద చుట్టుపక్కల పల్లెల నుంచి ట్రాక్టర్లు వేసుకుని వచ్చిన ప్రజలు జగన్‌ను చూసేందుకు కాన్వాయ్ ఆపారు. దీంతో జననేత ఇక్కడ గం టకుపైగా ఉండి ప్రతి ఒక్కరినీ పలకరిం చి కదిలారు. సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ గిరిజనులు స్వాగతం పలి కారు. హైవేలో నిలిపిన బస్సుల పెకైక్కి ఆర్టీసీ కార్మికులు, ప్రయాణికులు జగన్‌ను చూడడం కనిపించింది. కాపుగున్నేరి వద్ద స్కిమ్స్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థులు జగన్‌ను కలిశారు. అభివృద్ధి ఎలా చేయాలనే దానిపై ఒక విద్యార్థిని తన సొంత సూచనలతో కూడిన రచనను అందజేశారు. జననేత దీనిని ఆసక్తిగా చదివారు. ఇక్కడ జగన్‌ను కలిసిన మహిళలు తమకు పావలా వడ్డీ తిరిగి ఇవ్వకుండా బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. జననేతను కలిసిన కోకోకోలా కార్మికులు కోకోకోలా ఫ్యాక్టరీ కార్మికులు వై.ఎస్.జగన్‌ను కలిసి తమకు ఇస్తున్న వేతనాలు చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజ అనే అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను వచ్చే ఎన్నికల్లో పార్టీ అజెండాలో ఒక అంశంగా చేర్చాలని కోరారు. ఇక్కడ తిరుపతి నుం చి ద్విచక్రవాహనానికి ఫ్యాన్ గుర్తు తగిలించుకుని వచ్చిన పార్టీ నాయకులు దుద్దేలబాబు అందరినీ ఆకట్టుకున్నారు. ఇసుకగుంట వద్ద వేచి ఉన్న మహిళలను జననేత పలకరించారు. చల్లపాళెం, చల్లపాళెం బీసీ కాలనీల వద్ద మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వరుసలో నిలబడిన మహిళలందరినీ జననేత ఆశీర్వదించారు. రాచగున్నేరి, ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద కార్మికులు, గ్రామస్తులు జగన్‌ను ఆపి స్వాగ తం పలికారు. మన్నసముద్రం వద్ద ఏర్పేడు సింగిల్‌విండో అధ్యక్షుడు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. మేర్లపాక ఎస్సీకాలనీలో దళిత మహిళలను జగన్ పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహానేత విగ్రహాల ఆవిష్కరణ ఏర్పేడులో మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఏర్పేడు సభలో యాదవులు జననేతకు కంబళికప్పి, గొర్రెపిల్లను బహూకరిం చారు. ఇక్కడ జననేతను చూసేందుకు జనం బారులు తీరడంతో హైవే కిక్కిరిసింది. అనంతరం సీతారాంపేటలో మహిళలు మంగళహారతులతో ఆహ్వానించారు. అంజిమేడు క్రాస్‌లోనూ జగన్‌కు ఘన స్వాగతం లభించింది. అం జిమేడు గ్రామంలో మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మూడేళ్ల క్రితమే విగ్రహాన్ని సిద్ధం చేసుకున్న గ్రామస్తులు జగన్ చేతనే ఆవిష్కరింపజేయాలని ఇన్ని రోజులూ వేచి ఉన్నారు. అవ్వా ఆరోగ్యం ఎలా ఉంది ఇసుకతాగేలిలో వై.ఎస్.జగన్‌కు ఆత్మీయ స్వాగతం లభించింది. ఇక్కడ వందేళ్లకుపైగా వయసున్న వృద్ధురాలిని జననేత పలకరించారు. ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేశారు. గోపాలపురంలో మహిళలు శాలువతో సత్కరించారు. మల్లవ రం, గుత్తివారిపల్లె, వెదళ్లచెరువు, గురవరాజుపల్లెలో ఘన స్వాగతం లభిం చిం ది. తర్వాత రేణిగుంట గాంధీ బొమ్మసెంటర్ వరకు నిర్వహించిన రోడ్ షోలో జనం భారీ సంఖ్యలో పాల్గొన్నారు.