breaking news
Theme hotels
-
Mr & Mrs Mahi జాన్వీ కపూర్ స్టయిల్...సో బ్యూటిఫుల్ : ఫ్యాన్స్ క్లీన్ బౌల్డ్ అంతే!
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ మరోసారి అభిమానుల మనసుదోచుకుంది. అంతేకాదు క్రికెట్ నేపథ్య చీరపై ఆమెకున్న మక్కువను మరోసారి చాటుకుంది. తన అప్కమింగ్మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహీలో ప్రమోషనల్లో భాగంగా జాన్వీ ప్రత్యేక కాన్సెప్ట్ - మెథడ్ డ్రెస్సింగ్‌ని ఎంచుకుని అందరి దృష్టిని తనవైపు మరల్చుకుంది. జాన్వీ కపూర్ ఇటీవల రిఫ్రెష్ ఫ్యాషన్ స్టేట్మెంట్తో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. తాజాగా అద్భుతమైన క్రికెట్ బాల్ థీమ్ డిజైన్‌తో రెడ్ అండ్ వైట్ చారల శారీలో మెరిసిపోయింది. చీరలాగే బ్లౌజ్ కూడా ఎప్పటి లాగే మోడ్రన్‌గా, అద్భుతంగా కనిపించింది. రెడ్ ఫాక్స్ లెదర్ బ్లౌజ్‌ను జత చేసింది. నెక్లైన్, స్లీవ్‌లెస్ డిజైన్‌తో సూపర్ హాట్‌గా కనిపించింది. అంతేకాదు క్రికెట్ బాల్ ఆకారంలో ఉన్న ఒక చిన్న ఎర్రటి లెదర్ పర్స్‌ను ఎంచుకుంది. స్టైలిష్ , కర్లీ హెయిర్‌స్టైల్‌ని , మెరిసే చెవిపోగులు, ఉంగరాలు ఇలా ప్రతీదీ స్పెషల్‌గా ఉండేలా జాగ్రత్తపడింది దీంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రాజ్‌కుమార్ రావు జాన్వీ జంటగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్, పాటలు ఇప్పటికే ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. -
ఇదో మోడ్రన్ టాయిలెట్...
టాయిలెట్లో కూర్చుని తింటే ఎలాగుంటుంది? పరమ చండాలంగా ఉంటుంది. మరి.. టాయిలెట్ థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈ మోడ్రన్ టాయిలెట్ హోటల్లో తింటేనో.. సూపర్‌గా ఉంటుంది అని అక్కడికెళ్లిన వాళ్లు చెబుతున్నారు. తైవాన్‌లోని డటాంగ్లో ఉన్న ఈ హోటల్లో అన్ని టాయిలెట్‌తో లింక్ అయి ఉన్నవే ఉంటాయి. చూశారుగా.. ఫుడ్ కూడా ప్లేటులో పెట్టరు. ఇందులోనే పెడతారు. మనకెలా అనిపించినా.. ఈ హోటల్‌కు తెగ డిమాండ్ ఉందట. అందుకే త్వరలో కౌలాలంపూర్, షెన్జెన్ , మకావూ తదితర ప్రాంతాల్లో ఈ థీమ్ హోటళ్లను తెరవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.