breaking news
Testes
-
కామాంధుడి వృషణాలు కోసేశారు..!
పెద్ద అడిశర్లపల్లి: కోరిక తీర్చమంటూ కొంతకాలంగా మహిళను వేధిస్తున్న ఓ కామాంధుడి వృషణాలు కోసేశారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద అడిశర్లపల్లి మండలం నంబాపురం గ్రామ పంచాయతీ పరిధి ఎల్లాపురం గ్రామానికి చెందిన కలకుంట్ల రాంబాబు ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన మహిళపై కన్నేశాడు. గత నెలలో సదరు మహిళ రాత్రి వేళ బహిర్భూమికి వెళ్లగా మార్గమధ్యలో అటకాయించాడు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో గ్రామస్తులు రాగా పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి జైలుకు పంపారు. 15 రోజుల క్రితమే జైలు నుంచి బయటికి వచ్చినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఆగ్రహించిన బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం అర్ధరాత్రి రాంబాబు ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న అతడి వృషణాలు కోసేసి పారిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే రాంబాబును 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలిసింది. నిందితులంతా పరారీలో ఉన్నారు. -
ఆ కౌంట్ తగ్గితే... ఆలిగోస్పెర్మియా?
నా వయుస్సు 21 ఏళ్లు. వృషణాల్లో వాపు వస్తే డాక్టర్‌కు చూపించుకున్నాను. నాకు వేరికోసిల్ ఉందని అన్నారు. అల్ట్రా సౌండ్ హైఫ్రీక్వెన్సీ (స్క్రోటమ్) చేరుుస్తే ఎడవువైపున గ్రేడ్-3, కుడివైపున గ్రేడ్-1 వేరికోసిల్ అని రిజల్ట్ వచ్చింది. ఆపరేషన్ అవసరవుని రెండువైపులా చేశారు. నెలరోజులు విశ్రాంతి కావాలన్నారు. వృషణాల్లో అప్పడప్పుడూ నొప్పి వస్తూనే ఉంది. నా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - ఆర్.వి.వి., అనంతపురం జ: వృషణాల్లోని రక్తనాళాల్లో (వెరుున్స్) వాపును వేరికోసిల్ అంటారు. దానివల్ల వృషణాల్లో నొప్పి రావడమే గాక వీర్యకణాల సంఖ్య, క్వాలిటీ తగ్గుతుంది. నొప్పి విపరీతంగా ఉన్నా, పిల్లలు లేకున్నా ఈ సవుస్యను ఆపరేషన్ ద్వారా సరిచేస్తారు. ఆపరేషన్ తర్వాత నిల్చోవడం, బరువులు ఎత్తడం వంటివి చేస్తే నొప్పి వస్తుంది. అందువల్ల రెండు నెలల పాటు డాక్టర్లు శారీరక శ్రవు ఎక్కువగా ఉండే పనులు వద్దంటారు. ఎక్కువ దూరం నడవడాన్ని కూడా కొంతకాలం అవారుుడ్ చేయుండి. వుూడు నెలల తర్వాత అన్ని పనులూ వూమూలుగానే చేసుకోవచ్చు. సర్జరీ తర్వాత కొంతవుందిలో నొప్పి అలాగే ఉంటుంది. అది నిదానంగా తగ్గిపోతుంది. స్క్రోటల్ సపోర్ట్ కోసం బిగుతైన లో దుస్తులు వేసుకొవ్ముని చెబుతాం. ఈ శస్త్రచికిత్స వల్ల అంగస్తంభన శక్తిని కోల్పోవడం జరగదు. నా వయసు 28 ఏళ్లు. ఇటీవలే నా భార్య నెలతప్పింది. నేను ఎప్పటివరకు సెక్స్ చేయవచ్చు? నెల తప్పాక కూడా సెక్స్ చేస్తుంటే ఏమైనా ప్రమాదమా? - సి.వి.ఆర్., కర్నూలు నెల తప్పాక సాధారణంగా మొదటి మూడు నెలల పాటు సెక్స్‌ను అవాయిడ్ చేయడం మంచిది. మధ్య మూడు నెలలు సెక్స్‌లో మామూలుగానే పాల్గొనవచ్చు. అయితే ఆ టైమ్‌లో అసాధారణ భంగిమ (అబ్నార్మల్ పొజీషన్స్)ల్లో సెక్స్ చేయడం అంత మంచిది కాదు. అలాగే బలంగా స్ట్రోక్స్ ఇస్తూ చేయకుండా ఉండటం మంచిది. చివరి మూడు నెలల్లోనూ కొంతమేరకు అవాయిడ్ చేయగలిగితే మంచిది. అయితే నెల తప్పాక ఏదో టైమ్‌లో సెక్స్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం కలగదు. కాకపోతే బలమైన సెక్స్ వల్ల ఏదైనా అనుకోనిది జరగవచ్చేమో అని వైద్యపరంగా ఈ సలహాలు చెబుతాం. ఒకవేళ మీరు ఈ టైమ్‌లో సెక్స్ చేసినా దాని గురించి అనవసరంగా ఆందోళన పడకండి. పైపైనే సెక్స్ చేయడం, ఒకరినొకరు సెక్స్‌పరమైన ప్రేరేపణలు చేసుకుని ఆనందించడం వల్ల ప్రమాదం ఉండదు. మీ ఇద్దరూ ప్రైవేట్ పార్ట్స్‌ను శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. నాకు 22 ఏళ్లు. ఇటీవలే ఒక అమ్మాయితో కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొన్నాను. పది రోజుల తర్వాత మూత్రంలో మంట మొదలైంది. ఈ సంఘటన జరిగి మూడు నెలలు అవుతోంది. ఆ అమ్మాయికి వేరే అబ్బాయిలతో కూడా సంబంధాలు ఉన్నాయని నాకు తర్వాత తెలిసింది. ఆ విషయం తెలిశాక హెచ్ఐవీ వస్తుందేమో అని భయం వేసి, ఒకసారి ల్యాబ్‌లో పరీక్ష చేయించాను. నెగెటివ్ అని చెప్పారు. అయితే విండో పీరియడ్‌లో రిజల్ట్ చక్కగా రాదని విని మళ్లీ ఆందోళన మొదలైంది. విండో పీరియడ్ అంటే ఏమిటి? నాకు హెచ్ఐవీ లేదని కన్ఫర్మేషన్ కోసం ఇంకేమైనా పరీక్షలు చేయించాలా? - జీ.ఆర్.కె., హైదరాబాద్ హెచ్ఐవీ నిర్ధారణ విషయంలో హెచ్ఐవీ ఎలీసా, వెస్ట్రన్ బ్లాట్ పరీక్షలు అన్నవి కొంచెం కచ్చితంగా, త్వరగా నిర్ధారణ చేయగలిగే పరీక్షలు. విండో పీరియడ్ అంటే వ్యాధి సోకాక అది పరీక్షల ద్వారా బయటపడటానికి మధ్యన ఉండే సమయం అని అర్థం. అంటే... విండో పీరియడ్‌లో పరీక్ష చేయిస్తే ఒకవేళ శరీరంలో హెచ్ఐవీ కారక ఇన్ఫెక్షన్ ఉన్నా అది పరీక్షల్లో మాత్రం తెలియదన్నమాట. ఎలీసా టెస్ట్‌లో ఈ విండో పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆర్నెల్ల వరకు కూడా పట్టవచ్చు. అదే వెస్ట్రన్ బ్లాట్ అయితే కొన్ని వారాల లోపే తెలుస్తుంది. అందుకే సెక్స్ తర్వాత వెస్ట్రన్ బ్లాట్గాని, ఎలీసాగాని మొదట చేయించి, ఆ తర్వాత మూడు నెలలకోసారి, ఆర్నెల్ల తర్వాత మరోసారి చేయించి... ఆ మూడు పర్యాయాలూ పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వస్తే ఇకపై మీరు నిశ్చింతగా ఉండవచ్చు. అంతేగాకుండా ఆ అమ్మాయి మీ గర్ల్‌ఫ్రెండే అంటున్నారు కాబట్టి వీలైతే మీతోపాటు సెక్స్‌లో పాల్గొన్న అమ్మాయికి కూడా అవే పరీక్షలు చేయించేలా ఒప్పించగలిగితే మంచిది. ఆమెకు కూడా ఫలితం నెగెటివ్ అని వస్తే మీరు (ఆమె కూడా) మరింత సురక్షితంగా ఫీల్ కావచ్చు. పెళ్లి వరకూ సెక్స్‌లో పాల్గొనకుండా ఉండటం అన్నది అటు శారీరక ఆరోగ్యానికీ, ఇటు నైతిక, సామాజిక ఆరోగ్యానికి కూడా మంచిదని గుర్తుంచుకోండి. నా వయుస్సు 27 ఏళ్లు. నాకు మొలల (పైల్స్) సవుస్య ఉంది. కొన్నాళ్లు వుందులు వాడాను. రక్తం పడటం తగ్గింది. కానీ గత కొన్నాళ్లుగా సెక్స్ కోరికలు తగ్గారుు. శరీరంలో రక్తం పాళ్లు తగ్గడం వల్ల ఇలా అవుతుందా? అవ్మూరుులను చూస్తే ఏమీ అనిపించడం లేదు. ఓ వస్తువును చూస్తే ఎలా ఉంటుందో వాళ్లను చూసినా అంతే. నా సవుస్యకు పరిష్కారం చెబితేనే పెళ్లిచేసుకుంటాను. - జె.ఎన్. హైదరాబాద్ జ: పైల్స్ దీర్ఘకాలికంగా ఉన్నవాళ్లలో ఎక్కువ రక్తం పోవడం వల్ల బలహీనత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇది సెక్స్‌లోనూ బలహీనవుయ్యేందుకు ఆస్కారం ఇస్తుంది. కాకపోతే శరీరంలో రక్తహీనత బాగా ఎక్కువై హిమోగ్లోబిన్ పాళ్లు 10 ఎంజీ/డెసిలీటర్ ఉన్నప్పుడే ఈ సవుస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్లు హైపర్థైరారుుడిజం ఉన్నా సెక్స్ కోరికలు, పెర్ఫార్మెన్స్ తగ్గే అవకాశాలు ఉన్నారుు. వుుందు పైల్స్‌కు ఆపరేషన్ చేరుుంచుకొని, థైరారుుడ్ సవుస్యకు చికిత్స తీసుకుంటే తర్వాత మీలో సెక్స్ సావుర్థ్యం నార్మల్‌గా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నా వయుస్సు 26 ఏళ్లు. వూకు ఇంకా పిల్లలు లేరు. డాక్టర్ దగ్గరికి వెళ్లి అన్ని పరీక్షలు చేరుుంచుకున్నాం. ఆమెకు ఎలాంటి సవుస్య లేదని చెప్పి... నాకు వూత్రం వీర్యకణాల సంఖ్య తక్కువ అన్నారు. మొదటిసారి టెస్ట్‌లో స్పెర్మ్ కౌంట్ 60,000 వచ్చింది. డాక్టర్ ఇచ్చిన వుందులు వాడాను. రెండు నెలల తర్వాత వుళ్లీ పరీక్షలు చేరుుస్తే పది మిలియున్లకు పెరిగింది. తర్వాత కూడా వుందులు వాడాను. అరుుతే వుళ్లీ రెండు నెలల తర్వాత పరీక్ష చేరుుస్తే ఆరు మిలియున్లు వూత్రమే ఉన్నట్లు తేలింది. ఇలా తగ్గడానికి కారణం ఏమిటని అడిగితే డాక్టర్ గ్యారంటీ ఏదీ చెప్పలేవుని అంటున్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - ఆర్.కె.ఆర్., చిత్తూరు జ: మీరు ఆలిగోస్పెర్మియూ అనే సవుస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో 60 మిలియున్ నుంచి 120 మిలియున్ల వరకు వీర్యకణాలు ఉండాలి. అరుుతే వీటి సంఖ్య 20 మిలియున్ల కంటే తగ్గితే పిల్లలు కలిగే అవకాశాలు తక్కువ. వీర్యకణాలు తగ్గడానికి సాధారణంగా- వేరికోసిల్, ఇన్ఫెక్షన్లు, హార్మోన్లలోపం వంటివి కారణవువుతారుు. మీకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్, హార్మోన్ పరీక్షలు, వురికొన్ని రక్తపరీక్షలు చేసి... ఏ సవుస్య వల్ల మీకు వీర్యకణాల సంఖ్య తగ్గిందో నిర్ధారణ చేయూలి. సవుస్య వేరికోసిల్ అరుుతే సర్జరీ ద్వారా, హార్మోన్ల లోపం అరుుతే ఇంజెక్షన్ల ద్వారా చికిత్స చేసి వీర్యకణాల సంఖ్యను పెంచగలిగితే... అందరిలాగే మీకూ పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
మా అబ్బాయికి హైడ్రోసిల్... ఏం చేయాలి?
యూరాలజీ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 18 ఏళ్లు. దాదాపు రెండేళ్ల క్రితం వృషణాల దగ్గర నొప్పి వస్తే ఎంబీబీఎస్ డాక్టర్‌కు చూపించాం. అది ‘హైడ్రోసిల్’ అని ఆయన నిర్ధారణ చేసేవరకూ మాకు మా అబ్బాయి ఏమీ చెప్పలేదు. ఇప్పటికీ ఎంత అడిగినా ఏం జరిగిందో చెప్పలేదు. సర్జన్ దగ్గరికి వెళ్లి అవసరమైన చికిత్స చేయిద్దామంటే భయంతో వెనకడుగు వేస్తున్నాడు. మాకు ఏమి చేయాలో బోధపడటం లేదు. సముచితమైన సలహా ఇవ్వండి. అన్నట్టు ఒక్క విషయం.... నేను చాలామంది ప్రముఖులను గమనించినప్పుడు వారిక భారీపరిమాణంలో ‘హైడ్రోసిల్’ ఉన్నప్పటికీ వారు చికిత్స చేయించుకోకుండా అలాగే వదిలేసినట్లు అనిపించింది. ఎందుకు? ఇతర సమస్యలేవైనా ఉత్పన్నమవుతాయని భయమా? - జీ.బీ. అప్పారావు, విజయవాడ హైడ్రోసిల్ (బుడ్డ) సమస్య ఉన్నప్పుడు వృషణాల చుట్టూ నీరు చేరడం వల్ల ఆ ప్రాంతం అంతా వాపు వస్తుంది. దీనివల్ల కొద్దిపాటి ఉబ్బంది ఉంటుంది కానీ సాధారణంగా నొప్పి ఉండదు. సాధారణంగా దీనితో ప్రమాదం కూడా ఉండదు. చాలా సందర్భాల్లో హైడ్రోసిల్ సమస్యకు కారణాలు తెలియవు. అప్పుడే పుట్టిన పిల్లల్లో ఇది చాలా సాధారణం. ఎందుకంటే వాళ్లలో కడుపునకూ, వృషణాలకూ మధ్య కొద్దిపాటి సందు ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ఆ సందుమూసుకుపోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. లక్షణాలు: నీరు చేరి వృషణాల వాపు రావడం మినహా దీనిలో సాధారణంగా ఇతర లక్షణాలేవీ కనిపించవు. కానీ అరుదుగా కొన్నిసార్లు నొప్పి, వృషణాల సంచి ఎర్రబారడం వంటివి కనిపించవచ్చు. వృషణాల సంచికి వాపు వస్తున్నకొద్దీ పురుషాంగానికి కిందినుంచి పైవైపునకు ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపించవచ్చు. నిర్ధారణ: పేషెంట్‌ను భౌతికంగా పరీక్షించి, వృషణాల సంచిని చూడగానే హైడ్రోసిల్‌ను నిర్ధారణ చేయవచ్చు. అంతేగాక ఈ పరీక్షలో భాగంగా వృషణపు సంచిలోని ప్రతి బీజం వెనక నుంచి లైట్ వేసి దాని వెలుగు ఏమేరకు ఇవతలివైపునకు ప్రసరిస్తుంటుందో చూస్తారు. ఈ ప్రక్రియను ట్రాన్స్ల్యూమినేషన్ అంటారు. దీనివల్ల లోపల ఏవైనా మామూలు గడ్డలుగానీ, క్యాన్సర్ వంటి గడ్డలుగానీ ఉన్నాయేమో చూస్తారు. చికిత్స: వృషణాల సంచి పెరుగుతున్నందున కలిగే ఇబ్బంది తప్ప సాధారణంగా ఇందులో నొప్పి ఉండదు. కాబట్టి నొప్పి వచ్చేవరకూ గానీ లేదా అది బట్టల్లోంచి బయటకు అసహ్యంగా కనిపిస్తున్నప్పుడుగానీ లేదా చాలా అరుదుగా సంభవించే పరిణామం అయిన పురుషాంగానికి రక్తసరఫరా తగ్గడం గాని జరిగినప్పుడే చికిత్స చేయించుకుంటారు. హైడ్రోసిల్ వచ్చినా దాని సైజు చిన్నదిగానే ఉంటే, వృషణాల సంచిలోకి ఊరిన ద్రవాన్ని శరీరం మళ్లీ పీల్చుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి ఎలాంటి చికిత్సా అవసరం లేదు. ఇక 65 ఏళ్ల లోపు వారిలో చాలామందికి ఒక్కోసారి ఈ సమస్య దానంతట అదే తగ్గవచ్చు కూడా. అయితే ఆపై వయసు వారికి మాత్రం అలా తగ్గే అవకాశం లేదు కాబట్టి శస్త్రచికిత్స అవసరం. ఇక ఆ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు మాత్రం హైడ్రోసీలెక్టమీ అనే శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది. డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్