breaking news
Terror Attack incident
-
కేంద్ర సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకున్నా ఓకే: అఖిలపక్ష భేటీలో రాహుల్
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ కీలక భేటీ జరిగింది. 2 గంటలకుపైగా సమావేశం కొనసాగింది. పహల్గామ్ మృతులకు అఖిలపక్షం నివాళులర్పించింది. నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రదాడి అనంతరం తీసుకున్న చర్యలపై అఖిలపక్షానికి కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఉగ్రదాడుల్ని ఎదుర్కోవడంలో ఆయా పార్టీల సలహాలను కోరింది.ఉగ్ర దాడులను అఖిలపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. కశ్మీర్లో శాంతి నెలకొనాలని.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా సమర్థిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు జైశంకర్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజుజు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.కశ్మీర్లో అశాంతి నెలకొల్పే శక్తులను అణచివేయాలి: మిథున్రెడ్డిఉగ్రదాడిని ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా వైఎస్సార్సీపీ మద్దతు ఉంటుంది. కశ్మీర్లో అశాంతి నెలకొల్పే శక్తులను అణచివేయాలి. భద్రతను మరింత పటిష్టం చేయాలి. త్వరగా ఉగ్రవాదులను పట్టుకుని శిక్షించాలని మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
ఉగ్రవాదం ఉమ్మడి శత్రువు
కొలంబో: ఉగ్రవాదం ఉమ్మడి శత్రువని, దానిని ఎదుర్కొనేందుకు ఐక్య, నిర్దిష్ట కార్యాచరణ అవసరమని భారత్, శ్రీలంక అభిప్రాయపడ్డాయి. ఏప్రిల్‌లో ఈస్టర్ పర్వదినాన జరిగిన బాంబు దాడుల విషాదం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న శ్రీలంకకు సంఘీభావం తెలిపేందుకు భారత ప్రధాని మోదీ ఆదివారం కొలంబో చేరుకున్నారు. మాల్దీవుల్లో రెండు రోజుల పర్యటన ముగించుకుని వచ్చిన మోదీకి అధ్యక్షుడు సిరిసేన ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఈస్టర్ ఉగ్రదాడుల అనంతరం శ్రీలంకకు వెళ్లిన మొదటి నేత భారత ప్రధాని కావడం గమనార్హం. ‘అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనను పది రోజుల్లో రెండోసారి కలుసుకున్నాను. ఉమ్మడి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఐక్య, నిర్దిష్ట కార్యాచరణ అవసరమని భావించాం. శ్రీలంక భద్రత, ఉజ్వల భవిష్యత్తులో భాగస్వామి అయ్యేందుకు భారత్ కట్టుబడి ఉంది’అని సిరిసేనతో భేటీ అనంతరం మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక, ఉమ్మడి ప్రాధాన్య అంశాలపై చర్చలు జరిపారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గౌరవార్థం విందు ఏర్పాటు చేసిన సిరిసేన.. ఆయనకు ధ్యానముద్రలో ఉన్న బుద్ధుని శిల్పం ప్రతిని బహూకరించారు. అనురాధపురలో ఉన్న ధ్యానబుద్ధుని భారీ శిల్పం 4 నుంచి 7వ శతాబ్దాల మధ్య ఏర్పాటైందని ప్రధాని కార్యాలయం వివరించింది. ఈ విగ్రహ నమూనాను తెల్లటేకుతో రూపొందించేందుకు నిపుణులకు రెండేళ్లు పట్టిందని తెలిపింది. ఉగ్రదాడి మృతులకు నివాళి ప్రధాని మోదీ కొలంబో ఎయిర్‌పోర్టు నుంచి అధ్యక్షుని కార్యాలయానికి వెళ్లే దారిలోనే ఉన్న సెయింట్ ఆంథోనీ చర్చిని సందర్శించారు. ఈ సందర్భంగా బాంబుదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. ‘పిరికిపందల ఉగ్ర చర్య శ్రీలంక స్థైర్యాన్ని దెబ్బతీయలేదు. శ్రీలంక ప్రజలకు భారత్ తోడుగా ఉంటుంది’అని మోదీ అన్నారు. ఈస్టర్ పండగ రోజు ఉగ్రదాడులకు గురైన చర్చిల్లో ఇది ఒకటి. ఏప్రిల్‌లో తౌహీద్ జమాత్ అనే ఉగ్ర సంస్థ జరిపిన దాడుల్లో వందలాది అమాయకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మోదీకి అమూల్య కానుక ప్రధాని మోదీకి శ్రీలంక అధ్యక్ష నివాసం వద్ద ఘన స్వాగతం లభించింది. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధాని మోదీకి స్వయంగా గొడుగుపట్టారు. అధ్యక్ష భవనం ప్రాంగణంలో మోదీ అశోక మొక్కను నాటారు. అనంతరం ప్రధాని రణిల్ విక్రమసింఘేతో సమావేశమ య్యారు. ప్రతిపక్ష నేత మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే, తమిళ పార్టీల కూటమి నేత ఆర్.సంపతన్‌తోనూ సమావేశమయ్యారు. శ్రీలంకలోని భారత సంతతి ప్రజలతో మాట్లాడిన అనంతరం మోదీ స్వదేశానికి తిరుగు పయన మయ్యారు. ప్రధాని మోదీ 2015, 2017 సంవత్సరాల్లో కూడా శ్రీలంకలో పర్యటించారు. గత నెలలో జరిగిన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన హాజరయ్యారు. -
‘చావడానికైనా చంపడానికైనా సిద్ధం’
హైదరాబాద్: ప్రతి ఒక్క భారతీయుడు పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, దీనికి ప్రతి పౌరుడు చావడానికైనా, చంపడానికైనా సిద్ధంగా ఉండాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శుక్రవారం బీజేపీ, హిందూ వాహిణి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కె. లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజా సింగ్, హిందూ వాహిణి కార్యకర్తలు పాల్గొన్నారు. రాజా సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రమూలాలు కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే మోదీ కూడా సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 40 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. మరో 70 మంది జవాన్లు కూడా గాయపడ్డారు. -
ఉగ్రదాడిపై ప్రముఖుల మండిపాటు
న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఉగ్రదాడి ఘటనను కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ తీవ్రంగా ఖండించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, స్థానికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖండించిన చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: దాడిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు జనాన్ని చంపడాన్ని ఆయన ఖండించారు. పిరికిపందల చర్య: వైస్ జగన్ ఈ దాడి పిరికి పందల చర్య అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పలువురు భద్రతా సిబ్బంది, పౌరులు మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.