tence situation
-
తమిళనాడులో కొనసాగుతున్న ఆందోళనలు
-
తమిళనాడులో కొనసాగుతున్న ఆందోళనలు
తమిళనాడు/చిత్తూరు: శేషాచల అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్ కౌంటర్ ఘటనపై ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం జరిపిన ఎన్ కౌంటర్ లో తమిళనాడుకు చెందిన కూలీలు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు లో ఆందోళనలు చేపట్టడంతో తిరుమల తమిళనాడు మధ్య బస్సు సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. ఆందోళనలు ఇంకా కొనసాగుతుండటంతో ఆరో రోజూ కూడా సర్వీసులను రద్దు చేసినట్టు ఆర్టీసీ పేర్కొంది. అయితే తమిళనాడు అధికారులతో ఏపీయస్ ఆర్టీసీ మంతనాలు జరుపుతోంది. కానీ, ఈ విషయంలో తమిళనాడు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. సర్వీసులను రద్దు చేయడంతో ఏపీయస్ ఆర్టీసీకి ఇప్పటికే 3 కోట్ల రూపాయల మేర నష్టం వాటిలినట్టు అంచనా. దాంతో ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇదిలా ఉండగా, శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
శేషాచలం ఎన్కౌంటర్పై భగ్గుమన్న తమిళనాడు
శేషాచలం అడవుల్లో చోటుచేసుకున్న ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ అగ్గి.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల వాతావరణాన్ని వేడెక్కించింది. 20 మంది తమిళులను ఆంధ్రా పోలీసులు పొట్టనపెట్టుకున్నారని ఆరోపిస్తూ అనేక సంస్థలు పలు చోట్ల ఆందోళనలు నిర్వహిస్తుండటంతో తమిళనాడు వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన నిరసనకారులు.. బాబు ఫొటోలు, దిష్టి బొమ్మలను దగ్థం చేశారు ఇప్పటికే చెన్నైలోని కోయంబేడు అంతర్ రాష్ట్ర బస్ స్టేషన్లో ఏపీకి చెందిన తొమ్మిది బస్సులపై దుండగులు దాడిచేశారు. నెల్లూరు సరిహద్దులో మరో బస్సుపై పెట్రోల్ బాంబుతో దాడికి యత్నించారు. దీంతో ఉద్రిక్తతలు చల్లారేవరకు ఇరురాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపివేయాలని అధికారులు భావిస్తున్నారు. మరికొద్ది గంటల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.