breaking news
telugu praja vedika
-
'తెలంగాణలో 70 శాతం మందిది సమైక్యమే'
హైదరాబాద్: తెలంగాణలో 70 శాతం మంది సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని, అయితే దాడులకు భయపడి వారు తమ గళాన్ని నొక్కిపెట్టుకుంటున్నారని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ మహాసభ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాపార్కు వద్ద గురువారం చేపట్టిన ఒక రోజు దీక్షలో శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. టీ ఉద్యమం పేరుతో జరుపుతున్న దాడులకు భయపడి తెలంగాణలోని చాలా మంది సమైక్య వాదులు బయటకు రావడం లేదన్నారు. తెలంగాణ కోరుకోవడమంటే మళ్లీ ఫ్యూడల్ వ్యవస్థకు ప్రాణం పోయడమేనని దుయ్యబట్టారు. ఈ దీక్షలో తెలంగాణకు చెందిన పలువురు సమైక్య వాదులు, తెలుగు ప్రజా వేదిక అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి, నాయకురాలు కాదాసి రాణిలు పాల్గొన్నారు. -
'ఎంపీలు,కేంద్రమంత్రులు తెలుగు ప్రజలను మోసం చేశారు'
సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు తెలుగు ప్రజలను మోసం చేశారని తెలుగు ప్రజా వేదిక ఛైర్మన్ ఆంజనేయరెడ్డి ఆరోపించారు. ప్యాకేజీల కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని వారు తాకట్టుపెట్టారన్నారు. ఆంజనేయరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... అసెంబ్లీలో టి. బిల్లుపై చర్చించకుండా... బిల్లుకు వ్యతిరేకంగా సమైక్య తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్యరాష్ట్రం కోసం తెలుగు ప్రజా వేదిక ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.