breaking news
Telangana Union of Working Journalists
-
ఢిల్లీ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడిగా వెంకటేష్
ఢిల్లీ: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఢిల్లీ అధ్యక్షుడిగా నాగిళ్ల వెంకటేష్(సాక్షి టీవీ), ప్రధాన కార్యదర్శిగా తిరుపతి (వెలుగు), కోశాధికారిగా శిరీష్ రెడ్డి (హెచ్ఎం టీవీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం తెలంగాణ భవన్లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం జరిగింది. టీయూడబ్ల్యూజే గౌరవ సలహాదారు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ , రాష్ట్ర కమిటీ ప్రతినిధి అవ్వారి భాస్కర్ ల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఢిల్లీ శాఖను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ టీయూడబ్ల్యూజే సభ్యులు యూనియన్ కార్యకలాపాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ సభ్యులు ఐకమత్యం, పరస్పర సహకారంతో పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం అధ్యక్షుడిగా నాగిల్ల వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా తిరుపతి, కోశాధికారిగా శిరీష రెడ్డి లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అభినందనలు తెలియజేశారు. కరోనా కష్టకాలంలో జర్నలిస్టులను ఆదుకున్న మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు ఢిల్లీ టీయూడబ్ల్యూజే కమిటీ ధన్యవాదాలు తెలిపింది. -
నేడు జర్నలిస్టుల ధర్నా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐజేయూ) ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఐ అండ్ పీఆర్ ఎదుట ‘సావధాన దినం’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ జరిగే ఈ ధర్నాలో నగరంలోని జర్నలిస్టులందరూ పాల్గొనాలని సిటీ జర్నలిస్టుల సంఘం నేతలు యాదగిరి, కోటిరెడ్డి, కె. సుధాకర్ రెడ్డిలు తెలిపారు.