breaking news
telangana major irrigation minister
-
'బాబూ.. ఆ గొంతు మీదా కాదా?'
-
'టీడీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అవినీతికి పాల్పడి ఇరుక్కుపోయిన టీడీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్లో హరీష్ రావు మాట్లాడుతూ... ఓటుకు కోట్లు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. హైదరాబాద్ నగరంలో నివాసముండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారికి ఎందుకు రుణమాఫీ చేయాలేదని ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్ను హరీష్ రావు ప్రశ్నించారు. అయితే తమ ప్రభుత్వం మాత్రం అన్ని ప్రాంతాల వారిని సమన్యాయంతో చూస్తున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు.