breaking news
telangana develop
-
టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి
శంకర్పల్లి, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి కేఎస్ రత్నం అన్నారు. సోమవారం మండలంలోని జనవాడ, మిర్జాగూడ, ఇంద్రారెడ్డినగర్, పొద్దుటూర్ గ్రామాల్లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో.. అదే విధంగా నవ తెలంగాణ నిర్మాణం కూడా ఆ పార్టీకే సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని తెలిపారు. దేశ సంపదను దోచుకున్న ఆ పార్టీకి ఓటు వేయకూడదని ప్రజలను కోరారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి మండలానికి తాగు సాగునీరు అందిస్తామని, పట్టణాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌడిచెర్ల నర్సింహ, మాజీ ఎంపీపీ బీర్ల నర్సింహ, మిర్జాగూడ సర్పంచ్ సంజీవ్‌కుమార్, మాజీ సర్పంచ్ అయిలయ్య, జిల్లా గొర్రెల కాపరుల సంఘం మాజీ అధ్యక్షుడు ఒగ్గు మల్లేష్‌యాదవ్, రాములు, చోటు, పంతం జంగయ్య, యాదయ్య, ఎజాస్, శ్రీశైలం, అఫ్సర్, గోవింద్‌రెడ్డి ,శ్రీరాములు పాల్గొన్నారు. -
మోడీతోనే తెలంగాణ అభివృద్ధి
దౌల్తాబాద్, న్యూస్‌లైన్: బీజేపీ అధికారంలోకి వచ్చి నరేంద్రమోడి ప్రధాని అయితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రముఖ సినీనటులు రాజశేఖర్, జీవిత అన్నారు. ఆదివారం వారు దౌల్తాబాద్‌లో దుబ్బాక అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా సినీనటులు మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఓటేస్తే తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులకే పదవులు వస్తాయని, అంతేగాక డబ్బుసంచులు కూడా బెట్టుకుంటారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డికి ఓటేసినా ఫలితముండదని చెప్పారు. ఈ ప్రాంతంలో చేనేత కార్మికులతోపాటు పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వాటికి ప్రభుత్వానిదే బాధ్యత అని వారు పేర్కొన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఓటేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని సూచించారు. కమలం గుర్తుకు ఓటేసి రఘునందన్‌రావును గెలిపించాలని వారు కోరారు. ప్రచారంలో బీజేపీ నాయకులు రాజుగౌడ్, కుమ్మరి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.